దేవుని ఉంగరాలు పెట్టుకుంటున్నారా?

ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి! కొంతమంది ఫ్యాషన్ కోసం ఉంగరాలు ధరిస్తారు…మరికొంతమంది జాతక ప్రకారం రకరకాల రత్నాలతో ఉన్న ఉంగరాలను వేస్తుంటారు…కానీ, చాలామంది భక్తులు ప్రత్యేకంగా దేవుని ప్రతిమ ఉన్న ఉంగరాలు భక్తితో ధరిస్తూ ఉంటారు.
ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి!
కొంతమంది ఫ్యాషన్ కోసం ఉంగరాలు ధరిస్తారు…
మరికొంతమంది జాతక ప్రకారం రకరకాల రత్నాలతో ఉన్న ఉంగరాలను వేస్తుంటారు…
కానీ, చాలామంది భక్తులు ప్రత్యేకంగా దేవుని ప్రతిమ ఉన్న ఉంగరాలు భక్తితో ధరిస్తూ ఉంటారు. ఉదయం లేచిన వెంటనే కళ్ళకు అద్దుకోవడం, దండం పెట్టుకోవడం లాంటి ఆచారాలు పాటిస్తుంటారు.
అయితే…
దేవుడి ఉంగరాలను సరైన పద్ధతిలో ధరిస్తేనే మంచి ఫలితం.
లేకపోతే నెగిటివ్ ఎఫెక్ట్లు రావచ్చని పండితులు హెచ్చరిస్తున్నారు.
సరైన విధానంగా దేవుని ఉంగరం ఎలా ధరించాలి?
- ఉంగరంలో ఉన్న దేవుడి తల భాగం – మన మణికట్టు వైపు ఉండాలి.
- దేవుని పాదాలు – వేళ్ల గోర్ల వైపు ఉండేలా ఉంచాలి. ఎందుకంటే మన వేళ్ళు భూమివైపు చూస్తూ ఉంటాయి, అలాగే దేవుడి పాదాలు కూడా భూమివైపు ఉండాలి.
🧿 కళ్ళకు అద్దుకోవాలంటే...
- ఉంగరాన్ని చేతికి వేసుకుని చేతిని ముడిచిన తరవాతే కళ్ళకు అద్దుకోవాలి. ఇది భక్తితో కూడిన ఆచారంలో భాగం.
జాగ్రత్తలు పాటించాల్సిన సమయాలు
- మహిళలు తమ నెలసరి సమయంలో దేవుని ఉంగరాలు ధరించరాదు.
- భోజన సమయంలో ఉంగరానికి ఎంగిలి తగలకూడదు.
- ధూమపానం చేసే వారు – ఆ పొగ దేవుని ప్రతిమకు తగలకుండా జాగ్రత్త పడాలి.
చివరిగా పండితుల హెచ్చరిక:
సరైన విధానంలో దేవుని ఉంగరాన్ని ధరిస్తే ఆధ్యాత్మిక రక్షణ, శాంతి, ఆశీర్వాదం లభిస్తుంది.
కానీ నిర్లక్ష్యంగా ధరిస్తే అనుకోని బాధలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది.
దేవుని ఉంగరాన్ని వేయడం భక్తి మాత్రమే కాదు, బాధ్యత కూడాను.
భక్తితో, జాగ్రత్తగా ధరించండి – అప్పుడు మాత్రమే దేవుని కరుణ చేకూరుతుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు
దేవుని ఉంగరాన్ని ఏ దిశలో ధరించాలి?
ఉంగరంలో దేవుడి తల భాగం మణికట్టు వైపు, దేవుని పాదాలు వేళ్ల గోర్ల వైపు ఉండేలా ధరించాలి. మన వేళ్ళు భూమివైపు చూస్తూ ఉంటాయి కాబట్టి దేవుడి పాదాలు కూడా భూమివైపు ఉండాలని పండితులు చెబుతారు.
దేవుని ఉంగరాన్ని కళ్ళకు ఎలా అద్దుకోవాలి?
ఉంగరాన్ని చేతికి వేసుకుని, చేతిని ముడిచిన తరవాతే కళ్ళకు అద్దుకోవాలి. ఇది భక్తితో కూడిన ఆచారంలో భాగం.
నెలసరి సమయంలో దేవుని ఉంగరం ధరించవచ్చా?
మహిళలు తమ నెలసరి సమయంలో దేవుని ఉంగరాలు ధరించరాదని పండితులు సూచిస్తున్నారు.
భోజనం, ధూమపానం సమయంలో దేవుని ఉంగరం విషయంలో ఏ జాగ్రత్తలు పాటించాలి?
భోజన సమయంలో ఉంగరానికి ఎంగిలి తగలకూడదు. ధూమపానం చేసే వారు ఆ పొగ దేవుని ప్రతిమకు తగలకుండా జాగ్రత్త పడాలి.
దేవుని ఉంగరాన్ని నిర్లక్ష్యంగా ధరిస్తే ఏమవుతుంది?
ప్రచారంలో ఉన్నట్లుగా, సరైన విధానంలో ధరిస్తే ఆధ్యాత్మిక రక్షణ, శాంతి లభిస్తాయని, నిర్లక్ష్యంగా ధరిస్తే అనుకోని బాధలు ఎదురవ్వచ్చని పండితులు హెచ్చరిస్తారు. దేవుని ఉంగరం వేయడం భక్తి మాత్రమే కాదు, బాధ్యత కూడా.
కుటుంబం, స్నేహితులతో షేర్ చేయండి
WhatsAppలో పంపండి, పోస్ట్ చేయండి లేదా లింక్ కాపీ చేయండి.
సంప్రదాయాలు నుంచి మరిన్ని
- షష్టిపూర్తి: హిందూ సంప్రదాయంలో 60వ పుట్టినరోజు వేడుక – విధులు, సామగ్రి, క్రమబద్ధమైన విధానం
- కర్వా చౌత్ వెనుక చరిత్ర, పురాణ కథలు: వీరవతి, కర్వా, ద్రౌపది మరియు 2026 వ్రతం (గురువారం, 29 అక్టోబర్)
- రామ్లీలా: భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా రామాయణానికి సజీవ పునఃకథనం
- భీష్మ తర్పణ విధి
- నక్షత్ర స్తోత్ర మాలిక – 26వ రోజు | ఉత్తరాభాద్ర నక్షత్ర శరభేశాష్టకం | శని దోష నివారణ స్తోత్రం




