1. కార్యక్రమాలలో ధర్మ ప్రచారం చెయ్యాలి
  2. వివరణ ఇస్తూ కార్యక్రమం చేయించాలి
  3. ధర్మ రక్షణ లో వ్యక్తిగత, కుటుంబ బాధ్యతలు గుర్తు చెయ్యాలి.
  4. ధర్మం పై జరుగుతున్న దాడులు వివరించాలి.
  5. పలు సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ, దేవాలయ, పురోహిత రక్షణ, తద్వారా ధర్మ రక్షణ, హిందూ దేశ రక్షణకు సైన్యం తయారు అయ్యేలా కృషి చెయ్యాలి..
  6. దేశం లో పలు ప్రాంతాలలో దేవాలయాలపై, అర్చక పురోహితులపై జరుగుతున్న పైసాచిక దాడులను దృష్టిలో ఉంచుకుని సమాజాన్ని చైతన్యపరిచే కార్యక్రమమే ప్రధాన కర్తవ్యం గా కర్తవ్యాన్ని నిర్వహించాలి…
  7. అర్చకుడు / పురోహితుడు ఊరు మారతాను, వెళిపోతాను అంటే బాధపడే, అడ్ఫుకునే సమాజం తయారు కావాలి.
  8. అర్చకత్వం అంటే మంచి, వీరోచిత సమాజమ్ ను తయారుచేసే వృత్తిగా భావించాలి.
  9. తిరుపతి వంటి దేవాలయాలలో నే కాదు, గ్రామం లో ఉన్న రామాలయం లో కూడా దైవం ఉన్నాడు అనే స్పృహను పెంచే ప్రయత్నం చెయ్యాల్సినది అర్చకుడే కదా.
  10. పార్టీలకు అతీతం గా ఉండాలి.
  11. డబ్బులున్న వారిని ఒకలా, పెద వారిని ఒకలా కాకుండా అందరినీ ఒకేలా చూసేలా అర్చకుడు ఉండాలి..