శ్రావణమాసం ముగిసి, మంగళగౌరి నోములు, వరలక్ష్మి వ్రతాలతో సందడిగా ఉన్న ఇళ్లన్నీ ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారినట్టే అనిపిస్తుంది.
అయినా… శ్రావణం తరువాత వచ్చే భాద్రపదమూ విశేషమే!

భాద్రపద మాసం ఎందుకు ప్రత్యేకం?

ఇవి కూడా చదవండి: సంఘ శతాబ్ది దీపావళి శుభాకాంక్షలు · దసరా శరన్నవరాత్రులు – దేవీ అవతారం విశిష్టత- నాలుగవ రోజు అవతారం – శ్రీ కాత్యాయనీ దేవి · శరన్నవరాత్రి పూజలు - శ్రీ సిద్ధి గణపతి దేవాలయం

చాంద్రమానం ప్రకారం పౌర్ణమి నాడు చంద్రుడు పూర్వాభాద్ర / ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉండటంతో దీనికి భాద్రపద మాసం అని పేరు వచ్చింది.
ఈ మాసంలో ఒంటిపూట భోజనం చేస్తే ఆరోగ్యం, ధన సమృద్ధి కలుగుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఉప్పు, బెల్లం దానాలు కూడా ప్రత్యేక ఫలితాన్నిస్తాయని పండితుల అభిప్రాయం.
ముఖ్యంగా ప్రజలు “భద్రంగా ఉండాలి” అన్న ఆలోచనతో ఈ మాసం ఆచారాలు ఏర్పడ్డాయి.

Advertisement

భాద్రపదంలో ముఖ్యమైన పండుగలు & వ్రతాలు

  • వినాయక చవితి – శ్రీ గణపతి ఆవిర్భావ దినం. 21 రకాల పత్రాలతో గణనాథుని పూజించి ఉండ్రాళ్ళు నైవేద్యం పెడతారు. విద్యార్థులు పుస్తకాలు పూజిస్తారు.
  • సువర్ణ గౌరీ వ్రతం – శుక్ల తదియ నాడు స్త్రీలు ఉపవాసం చేసి, ముత్తైదువులకు వాయినాలు ఇచ్చి పూజ చేస్తారు.
  • ఋషి పంచమి – స్త్రీలకు సంబంధించిన ప్రత్యేక వ్రతం. తెలియక చేసిన పాపాలు తొలగుతాయని పురాణవచనం.
  • రాధాష్టమి – శ్రీకృష్ణ-రాధాదేవులను పూజించే రోజు. పెరుగు దానం విశేష ఫలితాన్నిస్తుంది. దాంపత్య సౌఖ్యం కలుగుతుందని విశ్వాసం.
  • పరివర్తన ఏకాదశి – శ్రీమహావిష్ణువు శయనావస్థలో పక్కకు తిరిగే రోజు. ఈ వ్రతం కరువు, కాటకాలు తొలగిస్తుందని చెబుతారు.
  • వామన జయంతి – వామనుడి ఆవిర్భావ దినం. విజయం, విజయతీర్థం కలుగుతుందని విశ్వాసం.
  • అనంత చతుర్దశి – శ్రీ అనంత పద్మనాభుని పూజించే రోజు. ఐశ్వర్యం, సుఖసంపదలు కలుగుతాయి.
  • ఉమా మహేశ్వర వ్రతం – భక్తి శ్రద్ధలతో ఆచరించినవారికి అపారమైన ఐశ్వర్యం ప్రసాదమవుతుంది.
  • ఉండ్రాళ్ల తద్ది – స్త్రీలు గౌరీ దేవిని పూజించి ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టి భర్త, దాంపత్య సౌఖ్యం కోసం ఆచరిస్తారు.
Advertisement

పితృ పక్షం (మహాలయ పక్షం)

భాద్రపద పూర్ణిమ అనంతరం మహాలయ పక్షం ఆరంభమవుతుంది. అమావాస్య వరకు మృతులైన పితృదేవతలకు తర్పణాలు, శ్రద్ధ, దానధర్మాలు తప్పనిసరిగా చేయాలి.
భాద్రపద అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు. ఈ రోజున పితృకార్యాలు విశేష ఫలితాన్నిస్తాయని పురాణవచనం.

ముగింపు

మొత్తానికి – భాద్రపద మాసం ఆధ్యాత్మికత, వ్రతాచారాలు, పండుగలతో నిండిన పవిత్రమైన కాలం. ఈ మాసంలో దానధర్మాలు మరింత విశేష ఫలితాలను ఇస్తాయని పండితులు సూచిస్తున్నారు.

✍️ – వాసు ముక్తినూతలపాటి

తరచుగా అడిగే ప్రశ్నలు

భాద్రపద మాసానికి ఆ పేరు ఎలా వచ్చింది?

చాంద్రమానం ప్రకారం ఈ మాసం పౌర్ణమి నాడు చంద్రుడు పూర్వాభాద్ర లేదా ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉంటాడు, అందుకే దీనికి భాద్రపద మాసం అని పేరు వచ్చింది.

భాద్రపద మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు, వ్రతాలు ఏవి?

వినాయక చవితి, సువర్ణ గౌరీ వ్రతం, ఋషి పంచమి, రాధాష్టమి, పరివర్తన ఏకాదశి, వామన జయంతి, అనంత చతుర్దశి, ఉమా మహేశ్వర వ్రతం, ఉండ్రాళ్ల తద్ది ఈ మాసంలో ఆచరిస్తారు.

వినాయక చవితి నాడు గణపతిని ఎలా పూజిస్తారు?

21 రకాల పత్రాలతో గణనాథుని పూజించి ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెడతారు. విద్యార్థులు ఆ రోజు తమ పుస్తకాలను కూడా పూజిస్తారు.

భాద్రపద మాసంలో ఏ దానాలు, ఆచారాలు పాటిస్తారు?

ఈ మాసంలో ఒంటిపూట భోజనం చేయడం, ఉప్పు, బెల్లం దానం చేయడం ప్రత్యేక ఫలితాన్నిస్తాయని పండితుల అభిప్రాయం. ప్రచారంలో ఉన్నట్లుగా ఈ మాసంలో చేసే దానధర్మాలు మరింత విశేష ఫలితాలను ఇస్తాయి.

పరివర్తన ఏకాదశి ప్రత్యేకత ఏమిటి?

ప్రచారంలో ఉన్నట్లుగా ఈ రోజున శయనావస్థలో ఉన్న శ్రీమహావిష్ణువు పక్కకు తిరుగుతారు. ఈ వ్రతం కరువు, కాటకాలు తొలగిస్తుందని భక్తుల విశ్వాసం.

మహాలయ పక్షం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఆ సమయంలో ఏమి చేయాలి?

భాద్రపద పూర్ణిమ తర్వాత మహాలయ పక్షం ఆరంభమై అమావాస్య వరకు ఉంటుంది. ఈ రోజుల్లో పితృదేవతలకు తర్పణాలు, శ్రాద్ధం, దానధర్మాలు చేస్తారు. భాద్రపద అమావాస్యనే మహాలయ అమావాస్య అంటారు.