సిద్ధిదాత్రి దేవి, సిద్ధులు: 8, 18 సిద్ధుల వివరణ, నవరాత్రి 9వ రోజు విశిష్టత
నవరాత్రి 9వ రోజు పూజించే దుర్గామాత తొమ్మిదవ శక్తి స్వరూపమైన సిద్ధిదాత్రిపై తెలుగు భక్తి వ్యాసం: మార్కండేయ పురాణంలోని 8 సిద్ధులు, బ్రహ్మవైవర్త పురాణం శ్రీకృష్ణ జన్మ ఖండంలోని 18 సిద్ధులు, అర్ధనారీశ్వరుడు, అమ్మవారి రూపం, తొమ్మిది రోజుల ఆరాధనకు ఈమె పూజతో పరిపూర్ణత.

నవరాత్రి 9వ రోజు పూజించే దుర్గామాత తొమ్మిదవ శక్తి స్వరూపమైన సిద్ధిదాత్రిపై తెలుగు భక్తి వ్యాసం: మార్కండేయ పురాణంలోని 8 సిద్ధులు, బ్రహ్మవైవర్త పురాణం శ్రీకృష్ణ జన్మ ఖండంలోని 18 సిద్ధులు, అర్ధనారీశ్వరుడు, అమ్మవారి రూపం, తొమ్మిది రోజుల ఆరాధనకు ఈమె పూజతో పరిపూర్ణత.
నవరాత్రి 9వ రోజు, 2026: భారతదేశంలో సిద్ధిదాత్రి పూజ సోమవారం, 19 అక్టోబర్ 2026; అదే రోజు దుర్గాష్టమి, మహర్నవమి కూడా (దృక్ పంచాంగం). విజయదశమి మంగళవారం, 20 అక్టోబర్. USA, కెనడా, UKలలో కూడా మహా నవమి సోమవారం, 19 అక్టోబర్. అమ్మవారి మంత్రాలు, రంగు, పూజా విధానం కోసం నవరాత్రి 2026 9వ రోజు: సిద్ధిదాత్రి చూడండి.
సిద్ధిదాత్రి: తొమ్మిదవ శక్తి స్వరూపం
తొమ్మిదవ శక్తి స్వరూపమైన సిద్ధిదాత్రి సర్వసిద్ధులనూ ప్రసాదిస్తుంది. ఈమె కరుణవల్లే పరమేశ్వరుని అర్ధశరీరాన్ని పార్వతీ దేవి సాధించినట్టు పురాణకథనం. ఈమెకి ప్రార్ధన చేస్తే పరమానంద దాయకమైన అమృతపథం సంప్రాప్తిస్తుంది.
సాధన: మార్కండేయ పురాణంలో 8 సిద్ధులు
దుర్గామాత తొమ్మిదవ శక్తి స్వరూప నామం 'సిద్ధిదాత్రి'. ఈమె సర్వవిధ సిద్ధులనూ ప్రసాదిస్తుంది. మార్కండేయ పురాణంలో సిద్ధులు ఎనిమిది రకాలుగా ఉన్నాయి:
- అణిమ
- మహిమ
- గరిమ
- లఘిమ
- ప్రాప్తి
- ప్రాకామ్యము
- ఈశిత్వము
- వశిత్వము
సులభంగా చెప్పాలంటే: సాధారణంగా చెప్పే వివరణ ప్రకారం అణిమ అంటే అణువంత సూక్ష్మంగా మారడం, మహిమ అంటే విశాలంగా పెరగడం, గరిమ అంటే బరువుగా మారడం, లఘిమ అంటే తేలికగా మారడం, ప్రాప్తి అంటే దేనినైనా చేరగలగడం, ప్రాకామ్యము అంటే సంకల్పం నెరవేరడం, ఈశిత్వము అంటే ప్రభుత్వం (ఆధిపత్యం), వశిత్వము అంటే వశపరచుకునే శక్తి. (ఈ చిన్న వివరణను HinduTone జోడించింది.)
బ్రహ్మవైవర్త పురాణంలో 18 సిద్ధులు
బ్రహ్మవైవర్త పురాణంలోని శ్రీకృష్ణ జన్మ ఖండంలో సిద్ధులు అష్టాదశ విధాలుగా తెలుపబడ్డాయి. అవి:
- అణిమ
- లఘీమ
- ప్రాప్తి
- ప్రాకామ్యము
- మహిమ
- ఈశిత్వ వశిత్వాలు
- సర్వకామావసాయిత
- సర్వజ్ఞత్వం
- దూరశ్రవణం
- పరకాయ ప్రవేశం
- వాక్త్వం సిద్ధి
- కల్పం
- సృష్టి
- సంహారకరణ సామర్థ్యం
- అమరత్వం
- సర్వన్యాయకత్వం
- భావన
- సిద్ధి
అర్ధనారీశ్వరుడు, అమ్మవారి రూపం
సిద్ధిదాత్రి మాత భక్తులకూ, సాధకులకూ ఈ సిద్ధులన్నింటిని ప్రసాదించగలదు. పరమేశ్వరుడు ఈ సర్వ సిద్ధులను దేవి కృపవలననే పొందారని దేవీ పురాణంలో కనిపిస్తుంది. ఈ సిద్ధిదాత్రి మాత పరమశివునిపై దయ తలచి, ఆయన శరీరంలో అర్ధభాగమైంది. కనుక ఆయన అర్ధనారీశ్వరుడుగా వాసికెక్కారు. సిద్ధిదాత్రి దేవి చతుర్భుజ. సింహవాహన. ఈ దేవీ స్వరూపం కమలంపై ఆసీనురాలై ఉంటుంది. ఈమె కుడివైపు ఒక చేతిలో చక్రాన్ని దాల్చి ఉంటుంది. మరొక చేతిలో గదను ధరించి ఉంటుంది. ఎడమవైపు ఒక చేతిలో శంఖాన్నీ, మరొక హస్తంలో కమలాన్నీ దాల్చి దర్శనమిస్తుంది.
నవరాత్రి 9వ రోజు ఆరాధన
నవరాత్రి మహోత్సవాల్లో తొమ్మిదవ రోజున ఉపాసించబడే దేవీ స్వరూపం ఈమెదే. తొమ్మిదవ రోజున శాస్త్రీయ విధి విధానాలతో సంపూర్ణ నిష్ఠతో ఈమెను ఆరాధించేవారికి సకల సిద్ధులూ కరతలామలకం అవుతాయని భక్తుల విశ్వాసం. సృష్టిలో ఈమెకు అగమ్యమైనది ఏది లేదు. ఈ మాత కృపతో ఉపాసకుడికి ఈ బ్రహ్మాండాన్నే జయించే సామర్థ్యం లభిస్తుందని పురాణ కథనం.
ఈ సిద్ధిదాత్రి మాత కృపకు పాత్రులవ్వడానికి నిరంతరం ప్రతీ వ్యక్తీ ప్రయత్నించాలి. ఈ మాత దయా ప్రభావంవల్ల అతడు అనంతమైన దుఃఖరూప సంసారం నుండి నిర్లిప్తుడవ్వగలడు. అన్ని సుఖాలను పొందడమే కాకుండా మోక్షాన్ని సైతం పొందుతాడని భక్తుల విశ్వాసం.
నవదుర్గల్లో 'సిద్ధిదాత్రి' అవతారం చివరిది. మొదటి ఎనిమిది రోజుల్లో క్రమంగా దుర్గాదేవి ఎనిమిది అవతారాలను విధ్యుక్తంగా నిష్ఠతో ఆరాధించి, తొమ్మిదవ రోజు ఉపాసకుడు ఈ సిద్ధిదాత్రి ఆరాధనలో నిమగ్నుడు కావాలి. ఈ దేవిని ఉపాసించడం ముగియగానే భక్తులయొక్క, సాధకులయొక్క లౌకిక, పారలౌకిక మనోరథాలన్నీ సఫలమవుతాయని భక్తుల విశ్వాసం. సిద్ధిదాత్రి మాత కృపకు పాత్రుడైన భక్తుడికి కోరికలేవీ మిగిలి ఉండవు. ఇలాంటి భక్తుడు అన్ని విధాల సాంసారిక వాంఛలకు, అవసరాలకు, ఆసక్తులకు అతీతుడవుతాడు. అతడు మానసికంగా భగవతీ దేవి దివ్య లోకంలో విహరిస్తాడు. ఆ దేవీ కృపారసామృతం నిరంతరంగా ఆస్వాదిస్తూ, విషయ భోగ విరక్తుడవుతాడు. అట్టి వారికి భగవతీ దేవి సాన్నిధ్యమే సర్వస్వంగా ఉంటుంది. ఈ పరమ పదాన్ని పొందిన వెంటనే అతనికి ఇతర ప్రాపంచిక వస్తువుల అవసరం ఏ మాత్రం ఉండదు.
దుర్గామాత చరణ సన్నిధిని చేరటానికై మనం నిరంతరం నియమ నిష్ఠలతో ఆమెను ఉపాసించడమే కర్తవ్యం. భగవతీ మాత స్మరణ, ధ్యాన పూజాదికాల ప్రభావం వల్ల ఈ సంసారం నిస్సారమని మనకు బోధ పడుతుంది. తన్మహత్త్వాన నిజమైన పరమానందదాయకమైన అమృత పథం మనకు ప్రాప్తిస్తుంది.
నవమి నాడు చాలా మంది భక్తులు దుర్గా అష్టోత్తర శతనామావళి (108 నామాలు) కూడా పఠిస్తారు. నవమి నాడే దేవీ ప్రధాన పూజ ఎందుకో తెలుసుకోవడానికి దసరా మహర్నవమి విశిష్టత చదవండి.
తరచుగా అడిగే ప్రశ్నలు
సిద్ధిదాత్రి దేవి ఎవరు?
నవదుర్గల్లో దుర్గామాత తొమ్మిదవ శక్తి స్వరూపం సిద్ధిదాత్రి, నవరాత్రుల తొమ్మిదవ రోజున ఈమెను పూజిస్తారు. సిద్ధులను ప్రసాదించే తల్లి అని ఈ పేరుకు అర్థం; భక్తులకూ, సాధకులకూ సర్వవిధ సిద్ధులనూ ప్రసాదిస్తుందని విశ్వాసం.
8 సిద్ధులు ఏవి?
ఈ వ్యాసంలో చెప్పినట్లు మార్కండేయ పురాణంలో సిద్ధులు ఎనిమిది: అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశిత్వము, వశిత్వము.
బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పిన 18 సిద్ధులు ఏవి?
ఈ వ్యాసంలో పేర్కొన్న బ్రహ్మవైవర్త పురాణం శ్రీకృష్ణ జన్మ ఖండం ప్రకారం సిద్ధులు అష్టాదశ విధాలు: అణిమ, లఘీమ, ప్రాప్తి, ప్రాకామ్యము, మహిమ, ఈశిత్వ వశిత్వాలు, సర్వకామావసాయిత, సర్వజ్ఞత్వం, దూరశ్రవణం, పరకాయ ప్రవేశం, వాక్త్వం సిద్ధి, కల్పం, సృష్టి, సంహారకరణ సామర్థ్యం, అమరత్వం, సర్వన్యాయకత్వం, భావన, సిద్ధి.
2026లో నవరాత్రి 9వ రోజు సిద్ధిదాత్రి పూజ ఎప్పుడు?
దృక్ పంచాంగం ప్రకారం భారతదేశంలో నవరాత్రి 9వ రోజు సోమవారం, 19 అక్టోబర్ 2026; అదే రోజు దుర్గాష్టమి, మహర్నవమి కూడా. విజయదశమి మంగళవారం, 20 అక్టోబర్. USA, కెనడా, UKలలో కూడా మహా నవమి సోమవారం, 19 అక్టోబర్.
సిద్ధిదాత్రికి అర్ధనారీశ్వరునితో సంబంధం ఏమిటి?
పురాణ కథనం ప్రకారం సిద్ధిదాత్రి మాత పరమశివునిపై దయ తలచి, ఆయన శరీరంలో అర్ధభాగమైంది; కనుక ఆయన అర్ధనారీశ్వరుడుగా వాసికెక్కారు. పరమేశ్వరుడు సర్వ సిద్ధులను దేవి కృపవలననే పొందారని కూడా చెబుతారు.
సంపాదకుని గమనిక (19 అక్టోబర్ 2026)
ఈ వ్యాసం తెలుగులో HinduToneకు అందింది. తెలుగు పాఠమే మూలం; ఆంగ్ల పేజీ దాని యథాతథ అనువాదం. సిద్ధుల జాబితాలను రచయిత మార్కండేయ పురాణానికి, బ్రహ్మవైవర్త పురాణం శ్రీకృష్ణ జన్మ ఖండానికి ఆపాదించినట్లే యథాతథంగా ఇచ్చాం. చిన్న సవరణలు మాత్రమే చేశాం: అక్షరదోషాల సవరణ, ఫలితాల గురించిన వాక్యాలను భక్తుల విశ్వాసంగా లేదా పురాణ కథనంగా పేర్కొనడం, శీర్షికలు, 2026 తేదీలు, ఎనిమిది సిద్ధులకు చిన్న వివరణ. తేదీలు దృక్ పంచాంగం ఆధారంగా.
చివరిగా నవీకరించినది: 19 అక్టోబర్ 2026.
సంబంధిత వ్యాసాలు
- నవరాత్రి 2026 9వ రోజు: సిద్ధిదాత్రి మంత్రం, రంగు, పూజా విధానం
- దసరా మహర్నవమి విశిష్టత: అమ్మవారి నవరాత్రి అలంకారాలు, మహిషాసుర మర్దిని కథ
- దుర్గా అష్టోత్తర శతనామావళి: 108 నామాలు, అర్థం
- నవరాత్రి 2026: తేదీలు, నవదుర్గల పేర్లు, పూజా విధానం
- NRIల కోసం నవరాత్రి 2026 సంపూర్ణ గైడ్
- నవరాత్రి 2026 8వ రోజు: మహాగౌరి
- మహా నవమి 2026: తేదీ, పూజ, విశిష్టత



