02-02-2026 సోమవారం రాశి ఫలితాలు – నేటి జ్యోతిష్య ఫలాలు

☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🙏☘️🔹 ముక్తినూతలపాటి వాసు 🔹 02-02-2026 / సోమవారం / రాశి ఫలితాలు మేషం ధన సంబంధిత వ్యవహారాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🙏☘️
🔹 ముక్తినూతలపాటి వాసు 🔹
02-02-2026 / సోమవారం / రాశి ఫలితాలు
మేషం
ధన సంబంధిత వ్యవహారాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. వ్యాపార వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాలు మిశ్రమంగా సాగుతాయి.
వృషభం
ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. దీర్ఘకాలిక రుణాలు తీర్చి ఊరట చెందుతారు. సమాజంలో పెద్దలతో నూతన పరిచయాలు కలుగుతాయి. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతి కలుగుతాయి.
మిధునం
ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. స్ధిరాస్తి క్రయ విక్రయాలు మందకొడిగా సాగుతాయి. బంధుమిత్రుల నుండి ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
కర్కాటకం
వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం నుండి ఉపశమనం లభిస్తుంది. బంధు మిత్రుల నుండి వివాదాలకు చెందిన సమాచారం అందుతుంది. గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు.
సింహం
స్నేహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. నిరుద్యోగులకు అనుకూలత వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
కన్య
సామాజిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు. అవసరానికి ధనం అందుతుంది. దీర్ఘకాలిక ఋణాలు తీర్చగలుగుతారు. వృత్తి ఉద్యోగాలలో స్వల్ప స్థానచలనాలు చోటు చేసుకుంటాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.
తుల
నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు అందుతాయి. వృత్తి వ్యాపార కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మిత్రులతో ఉన్న వివాదాలను పరిష్కరించుకుంటారు. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఆరోగ్య విషయాలలో స్వల్ప ఇబ్బందులు ఉంటాయి.
వృశ్చికం
గృహమున సంతాన వివాహ శుభకార్య ప్రస్తావన వస్తుంది. సమాజంలో ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ధన సంబంధ వ్యవహారాలు కలిసివస్తాయి. ప్రయాణాలలో వాహనాలు నడిపే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వృత్తి ఉద్యోగాలలో సానుకూల వాతావరణం ఉంటుంది.
ధనస్సు
సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలు రెట్టించిన ఉత్సాహంగా సాగుతాయి. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. దూర ప్రాంత బంధు మిత్రుల ఆగమనం సంతోషం కలిగిస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమౌతాయి. అన్ని వైపుల నుండి అదాయం అందుతుంది.
మకరం
పాత రుణాలను కొంతవరకు తీర్చగలుగుతారు. దూరప్రాంత బంధు మిత్రుల నుండి అందిన సమాచారం ఆశ్చర్యం కలిగిస్తాయి. ధన పరంగా ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు చెయ్యడం మంచిది. సంతాన ఆరోగ్య విషయంలో అశ్రద్ధ మంచిది కాదు.
కుంభం
చిన్ననాటి మిత్రులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన పనులు జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఉద్యోగ వ్యాపారములు మందకొడిగా సాగుతాయి.
మీనం
ఆప్తులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తుచేసుకుని బాధపడతారు. ఇంటా బయట అనుకూలత పెరుగుతుంది. గృహమున శుభకార్యాలకు ధనవ్యయం చేస్తారు. వ్యాపారాలలో ఆర్థికంగా లాభాలు అందుకుంటారు. సోదరులతో స్ధిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు.
🍁 శుభం భూయాత్ 🍀
తరచుగా అడిగే ప్రశ్నలు
02-02-2026 సోమవారం వృషభ రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి?
వృషభ రాశి వారు ఆర్థికంగా పురోగతి సాధిస్తారని, దీర్ఘకాలిక రుణాలు తీర్చి ఊరట చెందుతారని, ఉద్యోగస్తులకు పదోన్నతి కలుగుతుందని ఆ రోజు ఫలితాలలో సూచించారు.
02-02-2026 న ఏ రాశుల వారు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు?
తుల రాశి వారు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిదని, వృశ్చిక రాశి వారు ప్రయాణాలలో వాహనాలు నడిపే విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
02-02-2026 న నిరుద్యోగులకు అనుకూల సూచనలు ఏ రాశుల్లో ఉన్నాయి?
సింహ రాశి నిరుద్యోగులకు అనుకూల వాతావరణం, తుల రాశి వారికి పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు, ధనస్సు రాశి వారి ప్రయత్నాలు సఫలం అవుతాయని సూచించారు.
02-02-2026 న ఆరోగ్యం విషయంలో ఏ రాశుల వారికి జాగ్రత్త సూచనలు ఉన్నాయి?
మేష రాశి వారికి స్వల్ప అనారోగ్య సమస్యలు, తుల రాశి వారికి ఆరోగ్యంలో స్వల్ప ఇబ్బందులు సూచించారు. కుంభ రాశి వారు తల్లిదండ్రుల ఆరోగ్యం, మకర రాశి వారు సంతాన ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
02-02-2026 న రుణాల విషయంలో ఏ రాశులకు ఊరట సూచించారు?
వృషభ, కన్య రాశుల వారు దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారని, మకర రాశి వారు పాత రుణాలను కొంతవరకు తీర్చగలుగుతారని ఆ రోజు ఫలితాలలో సూచించారు.
కుటుంబం, స్నేహితులతో షేర్ చేయండి
WhatsAppలో పంపండి, పోస్ట్ చేయండి లేదా లింక్ కాపీ చేయండి.
homebanner నుంచి మరిన్ని
- పితృయజ్ఞాల్లోని స్వధాదేవి ఎవరు? | పితృదేవతారాధనా రహస్యాలు
- కంచి పరమాచార్య మహిమ | మా జీవితాలకు మాష్టర్ – నిజ జీవిత అనుభవం
- లలితా సహస్ర నామంలో అమ్మవారి సగుణరూప వర్ణన | చంద్రవిద్య శ్లోకాల మహిమ
- సంధ్యావందనం మరియు ఇతర పూజాకార్యక్రమాల సంకల్పము | 16 ఏప్రిల్ 2026 | పంచాంగ వివరాలు
- గ్రహ మూర్తి అంటే ఏమిటి? | సువర్ణ, రజిత, తామ్ర, లోహ మూర్తుల ఫలితాలు



