తెలుగు అక్షరాలన్నింటితో పెళ్లి ఆహ్వానం ఎలా ఉందో మీరే చూడండి…
……………………………………….
తెలుగు వర్ణమాలతో పెళ్లి ఆహ్వానం
………………………………………..

అ :- అరుదైన అమ్మాయి
ఆ :- ఆకతాయి అబ్బాయి
ఇ :- ఇద్దరికి
ఈ :- ఈడు జోడి కుదిరి
ఉ :- ఉంగరాలను తొడిగి
ఊ :- ఊరంతా ఊరేగించారు
ఋ :- ఋణాల కోసం
ఎ :- ఎ వరెవరినో అడుగుతూ ఉంటే
ఏ :- ఏనుగు లాంటి కుభేరుడితో అడిగి
ఐ :- ఐశ్వర్యం అనే కట్నం ఇచ్చి
ఒ :- ఒకరికి ఒకరు వియ్యంకులవారు
ఓ :- ఓర్పుతో ఒప్పందం చేసుకొని
ఔ :- ఔదార్యాని ఇరు కుటుంబాలకు
అం :- అందించాలని కోరుకుంటూ
అ :- అ : అంటూ
క :- కలపతో తయారయిన పత్రికలపై కలంతో రాసిచ్చి
ఖ :- ఖడ్గలతో నరికిన పందిరి ఆకులను
గ :- గడప ముందుకు తీసుకొచ్చి
ఘ :- ఘనమైన ఏర్పాట్లు చేయించి
చ :- చాపుల (బట్టలు)నింటిని కొని
ఛ :- ఛత్రం (గొడుగు) పట్టి గండదీపాని
జ :- జరిపిస్తూ
ఝ :- ఝాము రాత్రి దాక
ట :- ట పకాయలను కాలుస్తూ
ఠ :- ఠీవిగా (వైభవంగా)
డ :- డ ప్పులతో
ఢ :- ఢం ఢం అని శబ్దాలతో సాగుతుంది
ణ :- కంక ణా లు చేతికి కట్టుకొని
త :- తట్టలో తమలపాకులు పట్టుకొని
థ :- థమన్(మ్యూజిక్ డైరెక్టర్) డప్పులతో
ద :- దగ్గరి బంధువులను పిలిచి
ధ :- ధ నవంతులను కూడా పిలిచి
న :- న అనే నలుగురిని పిలిచి
ప :- పది మందిని పలకరిస్తూ
ఫ :- ఫంక్షన్ కి రావాలని చెప్తూ
బ :- బ లగాలతో బంగార దుకాణాలకు వెళ్లి
భ :- భటువులని (ఆభరణాలు) కొని
మ :- మంగళ స్నానాలు చేయించి, రాజసూయ
య :- యాగం లాంటి పెళ్లికి
ర :- రా రండోయ్ వేడుక చూద్దాం అని చెప్పి
ల :- లక్షణమైన
వ :- వధూవరులను మీరు
శ :- శతమానం భవతి అని
ష :- షరతులు లేకుండా ఆశీర్వదించడానికి
స :- సప్తపది (పెళ్లి) వేడుకలో
హ :- హంగు ఆర్భాటాలతో రెడీ అయిన మండపంలో
ళ :- క ళ త్రం (భార్య) కాబోతున్న ఆమె ప్రక్కన వరుడు కూర్చొని
క్ష :- క్షత్రియ చెంత ఉండే బ్రాహ్మణుల సాక్షిగా జరిగే ఈ పెళ్లికి
ఱ :- ఱండి
*తెలుగు భాష చమత్కారాలు ఎంతో వైవిధ్యంగా ఉంటుంది. అందుకే అన్నారు" దేశ బాషలందు తెలుగు లెస్స" ….🚩🚩🚩🚩🚩