02-10-2025 • గురువారం • రాశి ఫలితాలు 🌸

♈ మేషం
చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ సలహాలు తీసుకోవడం మంచిది. అవసరానికి ధన సహాయం అందుతుంది. వ్యాపార పురోగతికి చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగ సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు.
♉ వృషభం
నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. కొత్త వస్తువులు, వాహన లాభాలు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా వేధించిన సమస్యలు తొలగుతాయి. మానసికంగా ప్రశాంతత కలుగుతుంది.
♊ మిథునం
చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. కుటుంబ పెద్దలతో మాటపట్టింపులు ఉంటాయి. రుణ ఒత్తిడి పెరిగి మానసికంగా అస్థిమితం కలుగుతుంది. వృధా ప్రయాణాలు చేస్తారు. ఇంటి బయటా నూతన సమస్యలు వస్తాయి. వ్యాపారాలు నిలకడగా ఉండవు. ఉద్యోగ వాతావరణం నిరాశ కలిగిస్తుంది.
♋ కర్కాటకం
సన్నిహితులతో విభేదాలు తలెత్తుతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి. వ్యాపార విషయమై తొందరపాటు నిర్ణయాలు చేయరాదు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి.
♌ సింహం
ఇంటా బయటా గౌరవం, మర్యాదలు పొందుతారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. కొత్త వ్యాపారాలకు కుటుంబ సభ్యుల నుండి పెట్టుబడులు అందుతాయి. సంతానం విద్యా, ఉద్యోగ విషయాలలో శుభవార్తలు అందుతాయి. వృత్తిలో ఆశించిన పదవులు పొందుతారు.
♍ కన్యా
సంఘంలోని ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. ధన వ్యవహారాలలో అనుకూలత ఉంటుంది. బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. గృహ, వాహన కొనుగోలు ప్రయత్నాలు సఫలం అవుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకొని లాభాలు పొందుతారు. ఉద్యోగంలో అధికారుల ఆదరణ ఉంటుంది.
♎ తుల
ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నాయి. చేపట్టిన పనులలో జాప్యం తప్పదు. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆందోళన కలిగిస్తుంది. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగంలో ఇతరుల నుండి విమర్శలు ఎదురవుతాయి.
♏ వృశ్చికం
కీలక వ్యవహారాలలో తొందరపాటు వలన గందరగోళ పరిస్థితులు వస్తాయి. మిత్రుల నుండి ఊహించని రుణ ఒత్తిడి కలుగుతుంది. ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయరాదు. వ్యాపార భాగస్వాములతో స్వల్ప వివాదాలు వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.
♐ ధనుస్సు
అవసరానికి కుటుంబ సభ్యుల సహాయం లభిస్తుంది. దూర ప్రయాణాలలో కొత్త పరిచయాలు కలుగుతాయి. బంధు మిత్రుల నుండి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం లభిస్తుంది. వ్యాపార సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి.
♑ మకరం
జీవిత భాగస్వామితో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో అధిక కష్టం చేసి స్వల్ప ఫలితాలు పొందుతారు. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తికాక చికాకులు వస్తాయి. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. ఉద్యోగంలో స్థానచలన సూచనలు ఉన్నాయి. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది.
♒ కుంభం
కొత్త కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తిచేస్తారు. ఆత్మీయులతో శుభకార్యాలలో పాల్గొంటారు. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కొత్త వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
♓ మీనం
ముఖ్యమైన పనులు వ్యయప్రయాసలతో కానీ పూర్తవుతాయి. బంధువర్గంతో విభేదాలు తలెత్తుతాయి. ఆలోచనలలో స్థిరత్వం లోపిస్తుంది. ఇంటి బయట చికాకులు పెరుగుతాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. సంతానం విద్యాపై దృష్టి పెట్టాలి.
🌼 శుభం భూయాత్ 🌼