పౌరోహిత్యం, ఆచారం – నేడు అవసరం, రేపటి నిలుపు

జ్యోతిర్మయమ్
బ్రాహ్మణ బంధువులకు నమస్కారమ్ 🙏
జంగమ మహాసభలో ప్రతిజ్ఞ
ఇటీవలి కాలంలో ఒక ప్రాంతంలో జరిగిన జంగమ మహాసభలో కొందరు పెద్దలు మాట్లాడుతూ –
“వచ్చే పది సంవత్సరాలలో బ్రాహ్మణులు పౌరోహిత్యం చేయకూడదు, దేవాలయాల్లో అర్చకత్వానికి స్థానం ఇవ్వకూడదు” అని ప్రతిజ్ఞ చేశారు.
ఈ మాటలు విని ఆలోచిస్తే – మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో అన్వేషించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
ప్రధాన కారణాలు
ఎంత వెతికినా మూడు పెద్ద లోపాలే కనబడుతున్నాయి:
- అరకొర విద్యతో పౌరోహిత్యం చేయడం
- పౌరోహిత్యం చేస్తూనే వ్యసనాలకు బానిస కావడం
- జిహ్వా చాపల్యాన్ని అదుపు చేసుకోలేక బహిరంగంగా తినిపోవడం, సమాజంలో గౌరవం కోల్పోవడం
ఇవన్నీ సమాజంలో బ్రాహ్మణుల గుర్తింపు తగ్గడానికి ప్రధాన కారణాలు.
పౌరోహిత్యపు పవిత్రత కోల్పోవడం
- పౌరోహిత్యం అంటే ప్రజలకు హితం, ధర్మం బోధించడం.
- కానీ ఈ లక్ష్యాన్ని చాలామంది వదిలేశారు.
- భోజనంలో నియమాలు పాటించకపోవడం, గాయత్రి మంత్రం మర్చిపోవడం, శ్రద్ధ లోపించడం… ఇవన్నీ ఆచారం నశింపజేస్తున్నాయి.
ఇతర కులాల ప్రవేశం
- నేడు అనేక కులాల వారు పౌరోహిత్యం నేర్చుకుని చేస్తున్నారు.
- అయ్యప్ప దీక్షలలో గురుస్వాములు వేరే కులాల వారే అవుతున్నారు.
- వేషధారణ మార్చి “మేము బ్రాహ్మణులమే” అని చెప్పుకునే వారు మన సంఘాలలో కలిసిపోతున్నారు.
వివాహ వ్యవస్థలో పతనం
- ఆడపిల్లలకు సమయానికి వివాహం చేయకపోవడం వల్ల కులాంతర వివాహాలు పెరుగుతున్నాయి.
- మగ పిల్లలు సరైన చదువులేక ఉద్యోగాలు సంపాదించలేక వివాహాలు ఆలస్యం అవుతున్నాయి.
- ఇది మొత్తం తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్ల జరుగుతున్నది.
కమిషన్ వ్యాపారాలు
- పౌరోహిత్యంలో కూడా కమిషన్ వ్యవహారాలు పెరిగాయి.
- “దక్షిణ”కు బదులుగా డబ్బు కోసం వాదించడం, బ్రోకర్లతో వ్యవహరించడం బ్రాహ్మణ గౌరవాన్ని దెబ్బతీస్తోంది.
పతనావస్థలో ఉన్న జీవనశైలి
- కొందరు వృద్ధులు వ్యసనాలతో, గర్వంతో పౌరోహిత్యంలో దిగజారుతున్నారు.
- కొందరు మద్యం సేవించి, మాంసాహారం తిని, మరుసటి రోజు పౌరోహిత్యం కోసం వస్తున్నారు.
- ఇలాంటి పరిస్థితుల్లో సమాజం ఎలా గౌరవిస్తుంది?
వంట వ్యవస్థలో లోపాలు
- ఇతర కులాల వారిని పరిచారకులుగా, వంటవారిగా వాడుకోవడం.
- మడిచీర కట్టడం, గోత్రాలు చెబడం నేర్పి వేరే కులాల ఆడవారిని ఆబ్దిక వంటకు పంపించడం.
- కమిషన్ వ్యవహారాలు ఇక్కడ కూడా పెరిగాయి.
బ్రాహ్మణ సంఘాల నిర్వీర్యం
- నెలకొకసారి ఒకరి ఇంట్లో రుద్రాభిషేకం, భోజనం చేసి మీటింగ్ – అంతే!
- ఇది ధర్మ పరిరక్షణ కాదు.
- ధర్మ వృక్షానికి ఆహారం ఇవ్వాలి – కేవలం పండ్లను సేకరించడం కాదు.
వేదపాఠశాలల్లో మార్పులు
- నేడు వేదం నేర్చుకునేవారు అన్నికులాలవారు.
- బ్రాహ్మణ పిల్లలు అలర్ట్ కాకపోతే రేపు వారికీ అసిస్టెంట్స్‌గానే ఉండాల్సి వస్తుంది.
నిజమైన మహనీయులు
- మెదక్, నిజామాబాద్ మొదలైన ప్రాంతాల్లో ఉన్న పండితులు, కవులు, అవధానులు, శాస్త్రజ్ఞులు ఉన్నత విద్యలు, ఉద్యోగాలు సాధించినా ధర్మాన్ని వదలలేదు.
- అలాంటి వారిని యువత ఆదర్శంగా తీసుకోవాలి.
ఆచారాల్లో నిర్లక్ష్యం
- పిండప్రదానం, ఆబ్దిక కర్మలు, తల్లిదండ్రుల సంస్కారాలు పూర్తిగా విస్మరించబడుతున్నాయి.
- కొందరు పెద్దలను ఓల్డ్ ఏజ్ హోమ్స్‌లో పెట్టడం దురదృష్టకరం.
తుది హెచ్చరిక
బ్రాహ్మణుడు తన ఆచారాన్ని, క్వాలిటీని కాపాడకపోతే రాబోయే రోజుల్లో అధోగతి తప్పదు.
బ్రాహ్మణ ఆచారం గొప్పది ✨
దాన్ని నిలబెట్టుకుందాం…
బ్రాహ్మణునిగా జీవిద్దాం.
✍️ వి.వి. రమణశర్మ సిద్ధాంతి