homebanner

27 ఫిబ్రవరి 2026 శుక్రవారం రాశిఫలాలు – అన్ని రాశుల దినఫలాలు

27 ఫిబ్రవరి 2026 శుక్రవారం రాశిఫలాలు – అన్ని రాశుల దినఫలాలు

🙏 27, ఫిబ్రవరి, 2026  ✍ దృగ్గణిత పంచాంగం  🙏
ఓం నమో నారాయణాయః – నమః శివాయః
శ్రీ రామ జయరామ జయజయరామ
🌻————————————🌻
స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం
శిశిర ఋతౌః / ఫాల్గుణమాసం / శుక్ల పక్షం
తిథి  : ఏకాదశి ‌రా 10.32 వరకు ఉపరి ద్వాదశి
వారం    : శుక్రవారం ( భృగువాసరే )
నక్షత్రం  : ఆరుద్ర ఉ 10.48 వరకు ఉపరి పునర్వసు
యోగం : ఆయుష్మాన్ రా 07.44 వరకు ఉపరి సౌభాగ్య
కరణం  : వణజి ఉ 11.31 భద్ర రా 10.32 ఉపరి బవ
👉 —–ॐ సాధారణ శుభ సమయాలు —–ॐ
ఉ 10.00 – 11.00 సా 05.00 – 06.00
అమృత కాలం  : ఈరోజు లేదు
అభిజిత్ కాలం  : ప 11.57 – 12.44
💫———————————💫
వర్జ్యం    : రా 10.12 – 11.43
దుర్ముహూర్తం  : ఉ 08.45 – 09.38 మ 12.44 – 01.31
రాహు కాలం   : ఉ 10.52 – 12.20
గుళికకాళం      : ఉ 07.55 – 09.23
యమగండం    : మ 03.17 – 04.45
ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు
👉  ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ 🌻
ప్రాతః కాలం          :  ఉ 06.27 – 08.48
సంగవ కాలం         :     08.48 – 11.10
మధ్యాహ్న కాలం    :    11.10 – 01.31
అపరాహ్న కాలం    : మ 01.31 – 03.52
ఆబ్ధికం తిధి         : ఫాల్గుణ శుద్ధ ఏకాదశి
సాయంకాలం        :  సా 03.52 – 06.14
ప్రదోష కాలం         :  సా 06.14 – 08.40
రాత్రి కాలం           :  రా 08.40 – 11.55
నిశీధి కాలం          :  రా 11.55 – 12.44
బ్రాహ్మీ ముహూర్తం :  తె 04.48 – 05.37
🙏————–🙏————-🙏
సూర్యోదయాస్తమాలు : ఉ 06.27 | సా 06.14 విజయవాడ
సూర్యోదయాస్తమాలు : ఉ 06.36 | సా 06.22 హైదరాబాద్
సూర్యరాశి : కుంభం | చంద్రరాశి : మిధునం/కర్కాటకం
ఈరోజు జన్మదినం / వివాహవార్షికోత్సవం జరుపుకునే
ఆత్మీయులకు శుభాశీస్సులు – ధీర్ఘాయుష్మాన్ భవః
వాసు ముక్తినూతలపాటి, ఫోన్ 99497 22792
🙌 ————-🙌————-🙌*


🐏 మేషం

ఆలయ దర్శనాలు మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. ప్రయాణాలలో అవరోధాలు ఉంటాయి. పనులలో ఆటంకాలు ఉన్న నిదానంగా పూర్తిచేస్తారు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయమై శ్రద్ద అవసరం. వ్యాపారాలు మరింత నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది.


🐂 వృషభం

దూర ప్రాంత బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు ఉండవు. వృత్తి ఉద్యోగాలలో అంచనాలను అందుకుంటారు. వ్యాపారాలలో తగిన లాభం పొందుతారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశములు లభిస్తాయి.


👬 మిధునం

వ్యవహారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఉన్నట్టుండి నిర్ణయాలలో మార్పులు చేసుకుని ఇబ్బంది పడతారు. ఉద్యోగమున పనిభారం పెరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలలో దృష్టి పెట్టడం మంచిది. బంధువర్గంతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ప్రయాణాలు కష్టంగా ఉంటాయి.


🦀 కర్కాటకం

కొత్త పనులు శ్రీకారం చుడతారు. దూర ప్రాంత బంధువుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సమాజంలో విలువ పెరుగుతుంది. విలువైన వస్తు, వస్త్ర, ధన లాభాలున్నాయి. వృత్తి, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.


🦁 సింహం

విందు వినోదాది కార్యక్రమాలలో విరివిగా పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. నిరుద్యోగులకు ఒక సమాచారం ఊరటను ఇస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలలో కొత్త పద్ధతులు ప్రవేశపెడతారు. ఉద్యోగ విషయమై శుభవార్త అందుతుంది.


👧 కన్య

ముఖ్యమైన పనులలో తొందరపాటు నిర్ణయాలు వలన ఆర్ధిక నష్టాలు కలుగుతాయి. చేపట్టిన పనులు అవాంతరాలు కలిగి మధ్యలో నిలిచిపోతాయి. వివాదాలకు వెళ్ళకపోవడం మంచిది. ద్విస్వభావ ఆలోచనలు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.


⚖️ తుల

ప్రయాణాలు చికాకు కలిగిస్తాయి. సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. కొన్ని పనులు వాయిదా వెయ్యడం మంచిది. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరం అవుతాయి. ఉద్యోగమున శ్రమ తప్పదు.


🦂 వృశ్చికం

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. సంతాన విద్యా విషయాలలో సంతృప్తి కలుగుతుంది. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. విభేదించినవారే దగ్గరవుతారు. ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది.


🏹 ధనస్సు

అప్రయత్నంగా పనులు పూర్తవుతాయి. సన్నిహితుల కలయిక సంతోషం కలిగిస్తుంది. చాలా కాలంగా వేచి చూస్తున్న అవకాశం లభిస్తుంది. వాహన కొనుగోలు అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగ విషయమై ఇరుక్కున్న సమస్యల నుండి చాకచక్యంగా బయటపడతారు.


🐐 మకరం

కొన్ని వ్యవహారాలలో ముఖ్యమైన మార్పులు చోటుచేసుకుంటాయి. శ్రమతో ప్రయాణాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగములలో పని ఒత్తిడి పెరుగుతుంది. దైవ భక్తి పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించడం మంచిది. మిత్రుల నుండి సమస్యలు కలుగుతాయి.


🏺 కుంభం

ఇంటా బయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం అంతగా అనుకూలించదు. సన్నిహితులతో దూరంగా మెలగడం మంచిది. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. చేసిన పని మళ్ళీ మళ్ళీ చెయ్యవలసిన రావచ్చు. వృత్తి, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో ఉండవు.


🐟 మీనం

ప్రయాణాలలో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. చాలా కాలంగా తీరని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో హోదా పెరుగుతుంది. వ్యవహారాలు ఉత్సాహంగా ఉంటాయి. బంధుమిత్రులతో అనుకూల వాతావరణం ఉంటుంది.


🍁 శుభం భూయాత్ 🍀

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
homebanner పండుగలు

దసరా: హిందూమతంలో 9 రోజుల ప్రాముఖ్యత

  • September 30, 2024
దసరా, విజయదశమి అని కూడా పిలుస్తారు, ఇది నవరాత్రి అని పిలువబడే 9 రోజుల పాటు జరుపుకునే ప్రధాన హిందూ పండుగ. ప్రతి రోజు లోతైన ఆధ్యాత్మిక
blank
homebanner పండుగలు

బతుకమ్మ పండుగ: తెలంగాణకు ప్రాముఖ్యత

  • September 30, 2024
బతుకమ్మ తెలంగాణలో అత్యంత శక్తివంతమైన మరియు సాంస్కృతికంగా ముఖ్యమైన పండుగలలో ఒకటి, దీనిని ప్రధానంగా మహిళలు జరుపుకుంటారు. ఇది తెలంగాణ సాంస్కృతిక స్ఫూర్తిని సూచించే పూల పండుగ