13-11-2025 (గురువారం) – రాశి ఫలితాలు

♈ మేషం మిత్రులతో చిన్నపాటి వివాదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి.
♈ మేషం
మిత్రులతో చిన్నపాటి వివాదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. ప్రయాణాలలో మార్గ అవరోధాలు ఎదురవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు. సంతానం ఆరోగ్య సమస్యలు కొంత ఆందోళన కలిగిస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.
♉ వృషభం
చేపట్టిన పనులు శ్రమతో గాని పూర్తి కావు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ప్రత్యర్థుల నుండి ఊహించని సమస్యలు తలెత్తవచ్చు. వ్యాపార, ఉద్యోగాలు సాదాసీదాగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మేలు కాదు.
♊ మిధునం
వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. దూరప్రాంతాల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. చేపట్టిన పనులు సజావుగా పూర్తవుతాయి.
♋ కర్కాటకం
వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని మార్పులు సంభవిస్తాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. బంధువులతో విభేదాలు మానసిక అసాంతృప్తి కలిగిస్తాయి.
♌ సింహం
చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఇంటా–బయటా పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగ సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.
♍ కన్యా
కొన్ని పనులు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు తలెత్తవచ్చు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో అధిక శ్రమతో అల్ప ఫలితాలు పొందుతారు. స్థిరాస్తి వివాదాలు తలనొప్పిని కలిగిస్తాయి.
♎ తులా
వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఉద్యోగ ప్రోత్సాహకాలు లభిస్తాయి. రాజకీయ సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి.
♏ వృశ్చికం
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు పంచుకుంటారు. ఉద్యోగాలలో పదోన్నతులు సంభవిస్తాయి.
♐ ధనస్సు
సోదరులతో స్వల్ప వివాదాలు తలెత్తవచ్చు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం ఉంటుంది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి. కొంత శ్రమతోనే పనులు పూర్తవుతాయి.
♑ మకరం
ఉద్యోగ ఒత్తిడులు అధికమవుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేయకపోవడం మంచిది. ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.
♒ కుంభం
నిరుద్యోగులకు ఇంటర్వ్యూల అవకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సన్నిహితుల సహకారం పొందుతారు. జీవిత భాగస్వామితో విందు వినోదాల్లో పాల్గొంటారు.
♓ మీనం
దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం లభిస్తుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. విందు వినోదాలకు ధన వ్యయం చేస్తారు. వ్యాపార విస్తరణకు కుటుంబ సహకారం లభిస్తుంది.
🌸 శుభం భూయాత్ 🌸
తరచుగా అడిగే ప్రశ్నలు
13-11-2025 గురువారం ఏ రాశులకు వ్యాపారం అనుకూలంగా ఉంది?
ఆ రోజు మిధునం, సింహం, తులా, వృశ్చికం, కుంభం రాశులకు వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా లేదా సాఫీగా సాగుతాయని సూచించబడింది. తులా రాశి వారికి మొండి బకాయిలు వసూలవుతాయని చెప్పబడింది.
13 నవంబర్ 2025న నిరుద్యోగులకు ఏ రాశుల్లో అవకాశాలు సూచించబడ్డాయి?
వృశ్చిక రాశి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, కుంభ రాశి వారికి ఇంటర్వ్యూల అవకాశాలు, మీన రాశి వారికి అధికారుల అనుగ్రహం సూచించబడ్డాయి. కర్కాటక రాశి వారికి నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయని చెప్పబడింది.
13-11-2025 గురువారం ఏ రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి?
మేషం, మకరం రాశుల వారికి ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయని సూచించబడింది. కర్కాటక రాశి వారికి రుణదాతల ఒత్తిడి పెరుగుతుందని చెప్పబడింది.
13 నవంబర్ 2025న ప్రయాణాల విషయంలో ఏ రాశులకు హెచ్చరిక ఉంది?
మేష రాశి వారికి ప్రయాణాలలో మార్గ అవరోధాలు, ధనస్సు రాశి వారికి వాహన ప్రమాద సూచనలు ఉన్నాయని చెప్పబడింది. వృషభ రాశి వారు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిదని సూచించబడింది.
13-11-2025న ఉద్యోగులకు పదోన్నతులు ఏ రాశిలో సూచించబడ్డాయి?
వృశ్చిక రాశి వారికి ఉద్యోగాలలో పదోన్నతులు సంభవిస్తాయని, తులా రాశి వారికి ఉద్యోగ ప్రోత్సాహకాలు లభిస్తాయని సూచించబడింది. ఇవి జ్యోతిష సూచనలు మాత్రమే, హామీలు కావు.
కుటుంబం, స్నేహితులతో షేర్ చేయండి
WhatsAppలో పంపండి, పోస్ట్ చేయండి లేదా లింక్ కాపీ చేయండి.
జ్యోతిషం నుంచి మరిన్ని
- 7 నవంబర్ 2026 శనివారం రాశి ఫలాలు — 12 రాశుల దిన ఫలాలు
- 6 నవంబర్ 2026 శుక్రవారం రాశి ఫలాలు — 12 రాశుల దిన ఫలాలు
- 5 నవంబర్ 2026 గురువారం రాశి ఫలాలు — 12 రాశుల దిన ఫలాలు
- 4 నవంబర్ 2026 బుధవారం రాశి ఫలాలు — 12 రాశుల దిన ఫలాలు
- 3 నవంబర్ 2026 మంగళవారం రాశి ఫలాలు — 12 రాశుల దిన ఫలాలు
