( భర్తృహరి సుభాషితము)

వనజ భవుండు కోపమున వాహన మైన మరాళ భర్తకున్
వన జననీ విహార కలనంబు దొలగంగ జేయు గాని గుం
భనమున దుగ్ధ జీవన విభాగ విధాన నిరూడ నైపుణీ
జనిత మహా యశో విభవ సారము హంసకు మాన్ప జాలునే
తా𝕝𝕝 బ్రహ్మకు తన వాహన మైన హంస పైన కోపము వచ్చిన పద్మ సరోవరము లందు విహరిమప కుండు నటుల ఆజ్ఞాపించ గలడుకానీ నీరు క్షీర ములను వేరు చేయగల నేర్పును తీసి వేయలేడు గదా!…..
అటులనే అధికారికి కోపము వచ్చిన వారిని… ఉద్యోగము నుండి తొలగించ గలడు కానీ వారి విద్యనూ, ప్రతిభను వారి నుండి లాక్కో లేడు కదా! వారు యింకొక చోట ఉద్యోగము సంపాదించుకో గలరు. విద్య , ప్రతిభ ముఖ్యమని కవి యొక్క భావము