అమ్మానాన్నల ప్రేమ గొప్పదా? లేక ప్రేమ పేరుతో వెళ్ళిపోయిన నీ ప్రేమ గొప్పదా?

తల్లితండ్రులకు చెప్పకుండా ఎవరో మధ్యలో పరిచయం అయిన ఒక అనామకుడిని నమ్మి వెళ్ళిపోయిన కూతురికి —
నాకు ఒక్క సూటి ప్రశ్న…
నీ ప్రేమ ఎలా గొప్పది?
రక్తమాంసాలు కడుపులో మోస్తూ,
నెత్తుటి ముద్దను ముద్దుగా చూస్తూ,
సమయం వచ్చి నువ్వు ఆ కడుపులో నుంచి బయటకు రావాలని తంతున్నప్పుడు,
ఆ బాధను కనురెప్ప దాటనీయకుండా దాచి,
తన ప్రాణం తీయబడినా పర్వాలేదు,
“శంకరా, నా బిడ్డను బ్రతికించు” అని మొక్కిన ఆ అమ్మ ప్రేమ కంటే నీ ప్రేమ గొప్పదా?
నువ్వు పుట్టిన క్షణం నుంచి,
నువ్వు అడుగేసే ప్రతి అడుగులో
తన అరచేతిని పెట్టి కాపాడిన,
నువ్వు తడబడితే గుండె తడిచిన,
నీ కోసం ఎండ వాన తట్టుకొని తన జీవితాన్ని కరిగించిన ఆ నాన్న ప్రేమ కంటే నీ ప్రేమ గొప్పదా?
నువ్వు అడిగిన ప్రతి దానికి
తన చెమటను నీ సంతోషంగా మార్చిన,
ఏమీ ఆశించకుండా నువ్వు సంతోషంగా ఉండాలని
ప్రాణం పెట్టిన తల్లిదండ్రుల ప్రేమ కంటే —
నీ ప్రేమ గొప్పదా?
ప్రేమ పేరుతో వెళ్లి తల్లిదండ్రుల గుండెల్లో గాయాలు పెట్టడం నిజమైన ప్రేమనా?
ఇప్పటివరకు జరిగిన సంగతి…
మా ఇంటి దగ్గర నాలుగు రోజుల క్రితం జరిగిందీ వేదన.
ఇంట్లో చెప్పకుండా ఎవరో తోడు వచ్చినవారితో వెళ్లిన అమ్మాయి తలచుకొని కుమిలి ఏడుస్తున్న ఆ తల్లిదండ్రుల ఆవేదన.
ఇరుగుపొరుగువాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక విలపిస్తున్న వారి వేదన.
తలుపు చప్పుడు వింటే “నా బిడ్డ వచ్చింది” అనే ఆశతో పరుగెత్తి చూసి,
తిరిగి కన్నీరు మున్నీరవుతున్న ఆ తల్లిదండ్రుల బాధ…
వీటిని చూసిన మనసు చలించకుండా ఉందా?
🙏 ప్రతి అమ్మాయి… బయట అడుగు వేయడానికి ముందు ఒక్క క్షణం ఆ తల్లిదండ్రుల ప్రేమను గుర్తుచేసుకోండి.
ఒకరు మారకపోయినా, ఒక్కరు ఆలోచిస్తారని ఆశిస్తూ…
సదా మీ సేవలో,
కే.వి.ఆర్
📞 9640264638