homebanner

13-02-2026 రాశి ఫలాలు | శుక్రవారం రోజు జ్యోతిష ఫలితాలు

13-02-2026 రాశి ఫలాలు | శుక్రవారం రోజు జ్యోతిష ఫలితాలు

☘️🙏🕉️ శ్రీ గురుభ్యోనమః 🙏☘️
🔹 ముక్తినూతలపాటి వాసు 🔹
13-02-2026 / శుక్రవారం / రాశి ఫలితాలు


మేషం

చిన్ననాటి మిత్రుల కలయిక సంతోషాన్నిస్తుంది. విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహమున శుభకార్యాలు కొన్ని నిర్వహిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.


వృషభం

ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఇంటాబయట కొద్దిపాటి సమస్యలు ఉంటాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలుంటాయి.


మిధునం

బంధువులతో అకారణ తగాదాలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య సమస్యలు కొంత కలచి వేస్తాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ధన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం.


కర్కాటకం

రావలసిన బాకీలు సకాలంలో వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. గృహమున సంతోషంగా గడుపుతారు.


సింహం

మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. బంధు మిత్రుల నుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు. సోదరులతో చర్చల్లో పురోగతి సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు అదిగమిస్తాయి. ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది.


కన్య

చేపట్టిన పనులలో కష్టమే తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. ముఖ్యమైన పనుల్లో అవరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి.


తుల

కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి. దూరప్రయాణాలు శ్రమతో కూడినవిగా ఉంటాయి. అనుకున్న పనులలో జాప్యం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో ఊహించని మార్పులు కలుగుతాయి. ఉద్యోగమున అదనపు పని బాధ్యతలు పెరుగుతాయి.


వృశ్చికం

మొండి బాకీలు వసూలవుతాయి. ఆప్తుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహం కలుగుతుంది.


ధనస్సు

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు మధ్యలో వాయిదా వేస్తారు. శ్రమతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వృత్తి, వ్యాపారాలలో చికాకులు పెరుగుతాయి. ఉద్యోగస్థులకు స్థానచలన సూచనలున్నవి.


మకరం

ఉద్యోగమున కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నూతన వాహన యోగం ఉన్నది. ఇంటాబయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు.


కుంభం

ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. చిన్ననాటి మిత్రులతో విభేదాలు కలుగుతాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి.


మీనం

చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. పాతబాకీలు వసూలవుతాయి. బంధు మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు ఆశించిన రీతిలో సాగుతాయి.


🍁 శుభం భూయాత్ 🍀

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
homebanner పండుగలు

దసరా: హిందూమతంలో 9 రోజుల ప్రాముఖ్యత

  • September 30, 2024
దసరా, విజయదశమి అని కూడా పిలుస్తారు, ఇది నవరాత్రి అని పిలువబడే 9 రోజుల పాటు జరుపుకునే ప్రధాన హిందూ పండుగ. ప్రతి రోజు లోతైన ఆధ్యాత్మిక
blank
homebanner పండుగలు

బతుకమ్మ పండుగ: తెలంగాణకు ప్రాముఖ్యత

  • September 30, 2024
బతుకమ్మ తెలంగాణలో అత్యంత శక్తివంతమైన మరియు సాంస్కృతికంగా ముఖ్యమైన పండుగలలో ఒకటి, దీనిని ప్రధానంగా మహిళలు జరుపుకుంటారు. ఇది తెలంగాణ సాంస్కృతిక స్ఫూర్తిని సూచించే పూల పండుగ