అన్నం గురించి మంచి మనుషులు చెప్పిన గొప్ప మాటలు🙏

- ” నేను వంటింట్లోకి వేరే పనిమీద వెళ్ళినా కూడా , వంట చేస్తున్న మా అమ్మగారు. “అన్నం పెట్టేస్తా నాన్నా. ఒక్క అయిదు నిముషాలు ” అనేవారు నొచ్చుకుంటూ- నేను అన్నం కోసం వచ్చాననుకుని ! …. ఎంతయినా అమ్మ అంటే అన్నం. …. అన్నం అంటే అమ్మ ! అంతే ! ( జంధ్యాల గారు ) .
- మంచి భోజనం లేని పెళ్ళికి వెళ్ళటం – సంతాప సభకి వెళ్ళిన దానితో సమానం ! ( విశ్వనాధ సత్యనారాయణ గారు ) .
- రాళ్లు తిని అరిగించుకోగల వయసులో వున్నప్పుడు తినటానికి మరమరాలు కూడా దొరకలేదు ! … వజ్రాలూ , వైడూర్యాలూ పోగేసుకున్న ఈ వయసులో మరమరాలు కూడా అరగట్లేదు ! అదే విధి ! ( రేలంగి వెంకట్రామయ్య గారు ) . 4. . ఆరు రోజుల పస్తులున్న వాడి ఆకలి కన్నా, మూడు రోజుల పస్తులున్న వాడి ఆకలి మరీ ప్రమాదం ! ఆహారం దొరికినప్పుడు ముందు వాడ్నే తిననివ్వాలి ! ( ముళ్ళపూడి వెంకటరమణ గారు ) .
- ఏటా వంద బస్తాల బియ్యం మాకు ఇంటికి వచ్చినా మా తండ్రిగారు అన్నీ మనవి కావు నాయనా ” మనల్ని నమ్ముకున్న వాళ్ళు రేయింబగళ్ళు కష్టపడి పని చేస్తేనే ఇవి మన ఇంటి వరకు వచ్చాయి.. అని బీదసాదలకి ధాన్యం చేటలతో పంచేసే వారు.. అన్నీ మనవి కావు అనటంలో వున్న వేదార్ధం నాకు పెద్దయితేనే గానీ అర్ధం కాలేదు ! ( ఆచార్య ఆత్రేయ గారు )
- అమ్మకి నేను అన్నం పెడుతున్నాను అనటం మూర్ఖత్వం ! అమ్మ చేతి అన్నం తింటున్నాను అని చెప్పగలిగినవాడు ధన్యుడు ! ( చాగంటి కోటేశ్వరరావు ) .
- ఆకలితో వున్న వాని మాటలకు ఆగ్రహించవద్దు !! (గౌతమ బుద్దుడు ).
- ఆత్మీయులతో కలసి తినే భోజనానికి రుచి ఎక్కువ ! పల్చని నీళ్ళ చారు కూడా అమృతంలా రుచిస్తుంది ! ( మాతా అమృతానందమయి )
- మీ పిల్లలు ఎంత దూరంలో, ఎక్కడ వున్నా , వేళ పట్టున ఇంత అన్నం తినగలుగుతున్నారంటే అది వాళ్ళ గొప్పా కాదూ , మీ గొప్పా కాదు …. మీ పూర్వీకులు చేసిన పుణ్యఫలమే అని గుర్తించుకుని మనం బ్రతకాలి..
ఎంతటి మంచి వాక్యాలు. ? తమ అనుభవ సారాన్ని మనకి పంచిన పెద్ద మనుషుల బాటలోనే మనం పయనిద్దాం !! సేకరణ… ✍️
