జ్యోతిష్యానికి దక్షిణ ఎందుకు అవసరం? – గౌరవం, ధర్మం, ఫలితం

🔱 *జ్యోతిష్యం – దక్షిణ – గౌరవం*
ఉచితంగా ఈ ప్రపంచంలో ఏదీ రాదు.
జ్యోతిష్యం లాంటి రహస్య శాస్త్రాన్ని అధ్యయనం చేయడం అనేది ఎంతో కఠినమైన విషయం.
ఒక జ్యోతిష్కుడు తన జీవితంలో ఎన్నో రోజులు, ఎన్నో రాత్రులు
తపస్సు లాంటి సాధన చేస్తే గానీ
జ్యోతిష్యంలో ఉన్న మూలాలను అర్థం చేసుకోలేడు.
అలాంటి సాధనకు కనీసం గౌరవం ఇవ్వడం మన ధర్మం.
దానికి మీరు ఏమీ ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు.
మీ అవసరం ఉండి మీరు ఒక విషయం అడిగినప్పుడు,
దానికి తగిన దక్షిణ ఇవ్వడం కనీస గౌరవం.
ఒకవేళ నిజంగా దౌర్భాగ్య పరిస్థితుల్లో, దారిద్ర్యంలో ఉండి అడిగితే
అది వేరే విషయం — దైవం దానిని అర్థం చేసుకుంటుంది.
కానీ మంచి సంపద ఉండి కూడా
జ్యోతిష్కుడి దగ్గర దారిద్ర్యాన్ని నటిస్తే,
ఆ దారిద్ర్యం తప్పకుండా వెంటపడుతుంది.
దైవం దగ్గర గానీ, దైవజ్ఞుడి దగ్గర గానీ
అబద్ధం చెప్పినప్పుడు
అది నిజంగా మారే ప్రమాదం ఉంటుంది.
కాబట్టి వీలైనంతగా
మీరు చెప్పించుకున్న జ్యోతిష్యానికి తగిన దక్షిణ ఇవ్వండి.
ఆ దక్షిణే మీరు అడిగిన ప్రశ్నకు
ఫలితాన్ని, శక్తిని, ఆశీర్వాదాన్ని ఇస్తుంది.
—
⚡ సూటిగా చెప్పాలంటే
జ్యోతిష్యం ఉచితం కాదు.
అది తపస్సుతో వచ్చిన శాస్త్రం.
దక్షిణ = గౌరవం
గౌరవం లేకుండా అడిగితే
ఫలితం కూడా బలహీనమే.
ఒకవేళ “ఉచితంగా దొరుకుతుంది” అని అనుకుంటే,
దానిలో ఉన్న నాణ్యత గురించి తప్పకుండా ఆలోచించాలి.
ఒక్కసారి మనమే మనల్ని ప్రశ్నించుకుందాం:
ఎవరైనా వచ్చి
“నాకు ఉచితంగా పని చేసి పెట్టండి” అని అడిగితే
మనము చేస్తామా?
మనమే చేయము అంటే,
ఎవరూ చేయరు 🙂
ఒకరి విజ్ఞప్తి 🙏
