homebanner

మహాశివరాత్రి మహిమ 2026 – పరమపవిత్ర రాత్రి విశేషాలు & వ్రత విధానం

మహాశివరాత్రి మహిమ 2026 – పరమపవిత్ర రాత్రి విశేషాలు & వ్రత విధానం

మహాశివరాత్రి మహిమ – పరమపవిత్ర రాత్రి..

వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం ।
వందే పన్నగభూషణం శశిధరం వందే పశూనాం పతిమ్ ॥
వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియమ్ ।
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్ ॥

అనే మంగళశ్లోకంతో ఆరంభమయ్యే మహాశివరాత్రి మహిమ, భక్తుల హృదయాలను పవిత్రం చేసే దివ్యోత్సవం. అష్టాదశ మహాపురాణాలలో – అగ్ని పురాణం, పద్మ పురాణం, స్కాంద పురాణం, శివ పురాణం, గరుడ పురాణం మొదలైన వాటిలో ఈ పర్వదిన మహిమ విశదీకరించబడింది.

— ఎందుకు మాఘ బహుళ చతుర్దశి? రోజు శివరాత్రి

ప్రళయకాలంలో సమస్త సృష్టి లీనమైపోయినపుడు, కాత్యాయనీదేవి సృష్టిబీజాలను పద్మంలో భద్రపరిచి పరమశివుని ధ్యానించింది. ఆమె ప్రార్థనకుప్రసన్నుడైన శివుడు మాఘ బహుళ చతుర్దశి అర్ధరాత్రి ప్రత్యక్షమయ్యాడు.

ఆ దివ్యరాత్రి నుండి ఈ తిథి మహాశివరాత్రిగా ప్రసిద్ధి చెందింది.
ఈ రోజున ఉపవాసం చేసి, అర్ధరాత్రి శివారాధన చేసినవారికి ఇహపర సౌఖ్యాలు కలుగుతాయని శివుడు వరప్రదానం చేశాడు.

శాస్త్రవచనం

శివరాత్రి మహోరాత్రం
నిరాహారో జితేంద్రియః
అర్చయేద్యో యథాన్యాయం
తథా బలమవంచకః॥

ఒక సంవత్సరం పాటు శివారాధన చేసిన ఫలితాన్ని, శివరాత్రి రోజున నిష్కపటభక్తితో చేసిన పూజ ద్వారా పొందవచ్చని స్వయంగా శివుడు బ్రహ్మతో అన్నాడని పురాణవచనం.
శివరాత్రి వ్రత విధానం

  • సంకల్పం చేసుకోవాలి
  • ఉపవాస దీక్ష స్వీకరించాలి
  • పంచగవ్యాలు
  • పంచామృతాలు
  • బిల్వదళాలు (మారేడు ఆకులు)
  • శివకథా శ్రవణం
  • నామస్మరణ
  • భజనలు

శివుడికి కొద్దిపాటి నీరు పోసినా, బిల్వదళం సమర్పించినా, ఆయన అపారానందం పొందుతాడు.
భక్తుని ఇంట కల్పవృక్షం
నిలుస్తుంది – అంటే కోరికలన్నీ తీరుతాయి.

శివ” పదార్థం

శం – సుఖం, పరమానందం
ఇ – పరమపురుషత్వం
వ– అమృతత్వం

అంటే శివుడు = సుఖం + శ్రేష్ఠత్వం + అమృతత్వం

శివుడు మనలో ప్రాణశక్తి రూపంలో ఉన్నాడు. ఆ శక్తి లేకపోతే “శవం” అవుతాం. అందుకే శివస్మరణ జీవనానికి ప్రాణం.

సంవత్సరానికొకసారి అయినా, జన్మానికొకసారి అయినా –
భక్తిశ్రద్ధలతో మహాశివరాత్రిని ఆచరించాలి.

శివుడు భోళాశంకరుడు – సర్వసులభుడు.
కొంచెం నీరు, కొంచెం భక్తి – చాలు!

ఓం నమః శివాయ
సమస్త లోకా సుఖినోభవంతు 🙏

శ్రీ సద్గురు పీఠం ద్వారా…✍️

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
homebanner పండుగలు

దసరా: హిందూమతంలో 9 రోజుల ప్రాముఖ్యత

  • September 30, 2024
దసరా, విజయదశమి అని కూడా పిలుస్తారు, ఇది నవరాత్రి అని పిలువబడే 9 రోజుల పాటు జరుపుకునే ప్రధాన హిందూ పండుగ. ప్రతి రోజు లోతైన ఆధ్యాత్మిక
blank
homebanner పండుగలు

బతుకమ్మ పండుగ: తెలంగాణకు ప్రాముఖ్యత

  • September 30, 2024
బతుకమ్మ తెలంగాణలో అత్యంత శక్తివంతమైన మరియు సాంస్కృతికంగా ముఖ్యమైన పండుగలలో ఒకటి, దీనిని ప్రధానంగా మహిళలు జరుపుకుంటారు. ఇది తెలంగాణ సాంస్కృతిక స్ఫూర్తిని సూచించే పూల పండుగ