వృద్ధుడు వ్యర్థుడు కాదు – సీనియర్ సిటిజన్లకు అంకితం

🙏వృద్ధుడు వ్యర్థుడు కాదు, ఇంటికి ఈశ్వరుడు.👏
🙏మూలన పడేస్తే వృద్ధుడు వ్యర్థుడు, ముంగిట్లో కూచోబెడితే ఇంటిని కాచే ఈశ్వరుడు.
🙏బతుకుబాటలో గతుకుల్ని ముందుగా హెచ్చరించి కాపాడే సిద్ధుడు వృద్ధుడు.
👌వృద్ధులు సారధులైతే యువకులు విజయులౌతారు… అనుభవాల గనులు… ఆపాత బంగారాలు.
👌వదిలేస్తే వృద్ధుడు మంచానికి బద్ధుడు. చేయూతనిస్తే ప్రతి వృద్ధుడు ఓ బుద్ధుడు.
💪నిర్లక్ష్యంగా చూస్తే కేవలం మూడుకాళ్ల ముసలివాడు. తగిన గుర్తింపునిస్తే విజయాన్నిచ్చే త్రివిక్రముడు.
✋ఒకనాటి బాలుడే ఈనాటి వృద్ధుడు… తనను పట్టించుకోకున్నా, నువ్వు పచ్చగా ఉండాలని తపించే ఉదాత్తుడు వృద్ధుడు.
👶పలకరిస్తే చాలు పాలకడలిలా పొంగులు వారే పసివాడు వృద్ధుడు.
👴🏾వృద్ధుడంటే పైపైన చూస్తే జుట్టు తెల్లబడిన ఫలిత కేశాలవాడు… అంతర్గతంగా తలపండిన పండితుడు.
🙏వృద్ధుడు వ్యర్థుడు కాదు… ఇంటికి ఈశ్వరుడు.
👍వృద్దులకు గౌరవం ఇద్దాం మన గౌరవం పెంచుకుందాం.
🫠మేము అరవై లో ఇరవై. పచ్చగా మెరిసే పండుటాకులమే గాని చప్పుడు చేసే ఎండుటాకులం కాదు.
😊కలలు పండినా పండకపోయినా మేము తలలు పండిన తిమ్మరుసులం.
👍కొరవడింది కంటి చూపు గాని మందగించలేదు ముందు చూపు.
👍అలసిపోయింది దేహమే గాని మనసుకు లేనే లేదు సందేహం.
😌ఎగిరి అంబరాన్ని అందుకోకున్నా ఈ భూమికి కాబోము భారం.
😔అరవై లో ఇరవై కాకున్నా అందని ద్రాక్షకై అర్రులు చాచం.
👉కుందేళ్ళమై పరుగులు తీయకున్నా తాబేళ్లమై గెలుపు బాట చూపగలం.
🤝చెడుగుడు కూతల సత్తా లేకున్నా చదరంగపు ఎత్తులు నేర్పగలం.
❤️సమయం ఎంతో మాకు లేకున్నా సమయమంతా మీకు సమర్పిస్తాం.
👌అనుకోకుంటే అధిక ప్రసంగం అనుభవ సారం పంచుకుంటాం.
🌸వాడిపోయే పూవులమైనా సౌరభాలు వెదజల్లుతాం.
💐రాలిపోయే తారలమైనా కాంతి పుంజాలు వెదజల్లుతాం.
? DEDICATED TO ALL SENIOR
CITIZENS
FORWARDED 🥰🙏🥰 🙏🥰🙏 🥰🙏🥰
