మృత్యుంజయ నామ వైభవం: శివుని మహిమ, మంత్రం & ఆరాధన ఫలితాలు

మృత్యుంజయ నామ వైభవం
- మృత్యుంజయ అని శివుడికి ఉన్న విశేషమైనటువంటి నామము. మృత్యువును జయించిన వాడాయన. అంటే అమృత స్వరూపుడు, శాశ్వతుడు.
ఓం నమఃశివాయ
అందుకే మృత్యుంజయుడుగా పరమేశ్వరుని పరమేశ్వరుని ఆరాధించేటప్పుడు ఒక విశేషమైన మంత్రంతో సాధన చేయవచ్చు –
శ్రీ అమృతేశ్వరాయ నమశ్శివాయ
ఈ మంత్రంతో జపంగా వాడుకోవచ్చు. శివారాధనలో వినియోగిస్తే అకాల మృత్యువులు, అపమృత్యువులు తొలగుతాయి అని వివరిస్తున్నారు. మృత్యుంజయ అనే పేరులోనే స్వామి అనుగ్రహం కనపడుతున్నది. అలా శివునియొక్క నామాలలోనే ఆయన ఇచ్చే అనుగ్రహం వ్యక్తమవుతుంది.
