homebanner

సంస్కారబలం: పిల్లలపై తల్లిదండ్రుల ప్రభావం & భారతీయ విలువలు

సంస్కారబలం: పిల్లలపై తల్లిదండ్రుల ప్రభావం & భారతీయ విలువలు

🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷

 "సంస్కారబలం" ఎప్పుడూ ఇంటి పెద్ద నుంచి రావాలి. ఒక ఇల్లు పాడైపోవడానికి కారణం ఇంటి పెద్దే అయి ఉంటాడు. తనకి లేని సంస్కారం పిల్లలకు రాదు. తను లేవగానే స్నానం చేసి, పూజామందిరంలో సంధ్యావందనం చేయడు. తను లేచి పూజా మందిరంలో కూర్చుని నాలుగు స్తోత్రములు చదవడు. "తన ఇంటి కప్ బోర్డ్ లో రామాయణం పుస్తకాలు గాని, భాగవతం పుస్తకాలు" గానీ ఉండవు. తాను ఎప్పుడూ కూర్చుని భగవత్సంబంధమయిన గ్రంథం గురించి మాట్లాడడు. తన పిల్లలతో మాట్లాడేటప్పుడు ఒక "పోతనగారి గురించి. ఒక వాల్మీకి మహర్షి గురించో, మన జాతి సంపద గురించో, మన సంస్కృతి గురించో" పలకడు. కాని తన పిల్లలు మాత్రం చాలా సంస్కారవంతులై ఉండాలని కోరుకుంటాడు. ఇది ఎలా జరుగుతుంది? మనకి 'పరానుకరణము' అని ఒకటి ఉంది. పిల్లలు తల్లిదండ్రులు ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తిస్తారు. “మా తండ్రిగారు దేనినయినా అంగీకరిస్తారు కానీ ఇది అంగీకరించలేరు” అని బిడ్డడికి తెలిసిందనుకోండి అసలు తొంభై శాతం ప్రవర్తన నియంత్రించబడుతుంది. "బిడ్డడి ముందే తండ్రి చెయ్యరాని పని చేస్తున్నట్లయితే ఆ పనిని బిడ్డడు చేయకుండా ఎలా ఉంటాడు?" తండ్రి చేసిన పనిని తానెందుకు చేయకూడదు అనుకుంటాడు.

🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
homebanner పండుగలు

దసరా: హిందూమతంలో 9 రోజుల ప్రాముఖ్యత

  • September 30, 2024
దసరా, విజయదశమి అని కూడా పిలుస్తారు, ఇది నవరాత్రి అని పిలువబడే 9 రోజుల పాటు జరుపుకునే ప్రధాన హిందూ పండుగ. ప్రతి రోజు లోతైన ఆధ్యాత్మిక
blank
homebanner పండుగలు

బతుకమ్మ పండుగ: తెలంగాణకు ప్రాముఖ్యత

  • September 30, 2024
బతుకమ్మ తెలంగాణలో అత్యంత శక్తివంతమైన మరియు సాంస్కృతికంగా ముఖ్యమైన పండుగలలో ఒకటి, దీనిని ప్రధానంగా మహిళలు జరుపుకుంటారు. ఇది తెలంగాణ సాంస్కృతిక స్ఫూర్తిని సూచించే పూల పండుగ