హిందూ దేవుళ్ళు

మహత్మ్యానికి మరో పేరు – శ్రీశైలం ఇష్టకామేశ్వరి

Sri Shailam Ishtakameshwari – The Divine Grantor of Wishes

కోరికలు అనేకం. వాటిని తీర్చుకోవడానికి మార్గాలు కూడా అనేకం. మనం మన ప్రయత్నంతో కాకుండా, వాటిని దైవానికి విన్నవించి తీర్చుకోవాలని కోరుకుంటాం. దేవుడికి మన ఇష్టకామాలను (కోరికలు) చెప్పుకుంటాం. మన కోరికలు వినే దైవాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో శ్రీశైలం సమీపంలోని ఇష్టకామేశ్వరి ఆలయం ఒకటి.

శ్రీశైలానికి 20 కిలోమీటర్ల దూరంలో వెలసిన ఇష్టకామేశ్వరి దేవి భక్తుల కోరికలను తీర్చడంలో ప్రసిద్ధి చెందింది. భక్తుల ఆస్తికతను పెంచుతూ, వారి మనోసంతృప్తిని అందిస్తుంది.


ఇష్టకామేశ్వరి విగ్రహం చాలా ప్రత్యేకమైనది. రాతి విగ్రహాన్ని తాకితే గట్టిగా అనిపిస్తుంది, కానీ నుదటకు కుంకుమ పెట్టినప్పుడు అది మెత్తగా, చర్మంలా తాకబడుతుంది. ఇది ఎన్నో సంవత్సరాలుగా వేలాది భక్తులు అనుభవిస్తున్న ఒక ప్రత్యేక అనుభవం.

దేవి మందహాసంతో భక్తులను స్వాగతిస్తూ, వారి కోరికలను సఫలమైనందుకు భక్తులు కృతజ్ఞతాభావంతో ఆలయాన్ని సందర్శిస్తారు. రెండు, మూడు సార్లు దర్శనమందించిన వారు మళ్లీ మళ్లీ వస్తారు. ఎందుకంటే, వారు కోరిన కోరికలు సఫలమవుతాయి. కోరికలు నెరవేరినందుకు కొత్త కోరికలు అప్పగించడానికి వారు తిరిగి ఆలయానికి వస్తారు.


ఇష్టకామేశ్వరి విగ్రహం అరుదైనది, మరియు ఇలాంటి విశిష్టత కలిగిన విగ్రహ దేశంలో మరెక్కడా లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరో ప్రత్యేక విషయం ఏమిటంటే, భక్తులు స్వయంగా ఆలయానికి రారని, దేవి వారిని ఆహ్వానిస్తుందని విశ్వసనీయంగా అనిపిస్తుంది. అమ్మ భక్తులకు పిలుపు ఇస్తారని, ఆ పిలుపు మేరకు వారు ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహిస్తారు.

చాలా కాలం క్రితం అడవిలో కొందరు చెంచులకు అమ్మ విగ్రహం కనిపించిందని, వారు ఆ విగ్రహాన్ని ప్రతిష్ట చేసి పూజలు ప్రారంభించినట్టు, ఇప్పటికీ వారి సంతతే ఆలయ అర్చకులుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.


సర్వోజనాః సుఖినోభవంతు

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
హిందూ దేవుళ్ళు హిందూమతం

సరస్వతి పూజ: అంతర్గత సృజనాత్మకతను మేల్కొల్పడం

జ్ఞానం, కళలు మరియు సృజనాత్మకత యొక్క దైవిక స్వరూపమైన సరస్వతి దేవి, మన అంతర్గత సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి మరియు జ్ఞానం మరియు కళాత్మక సాధనల ద్వారా మనల్ని
blank
హిందూ దేవుళ్ళు హిందూమతం

పురాణాలు మరియు ఆధ్యాత్మికత నుండి సాంస్కృతిక ప్రాముఖ్యత వరకు విభిన్న ఆసక్తులకు అనుగుణంగా హిందూ దేవుళ్లపై కొన్ని ఆకర్షణీయమైన బ్లాగ్ ఆలోచనలు ఇక్కడ ఉన్నాయి:

పౌరాణిక కథలు మరియు వాటి పాఠాలు చెడుపై మంచి విజయంః రాముడు మరియు కృష్ణుడు వంటి విష్ణువు అవతారాల కథలు. గణేశుడి వివేకంః అతని కథలను మరియు