27 ఫిబ్రవరి 2026 శుక్రవారం రాశిఫలాలు – అన్ని రాశుల దినఫలాలు

🙏 27, ఫిబ్రవరి, 2026 ✍ దృగ్గణిత పంచాంగం 🙏
ఓం నమో నారాయణాయః – నమః శివాయః
శ్రీ రామ జయరామ జయజయరామ
🌻————————————🌻
స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం
శిశిర ఋతౌః / ఫాల్గుణమాసం / శుక్ల పక్షం
తిథి : ఏకాదశి రా 10.32 వరకు ఉపరి ద్వాదశి
వారం : శుక్రవారం ( భృగువాసరే )
నక్షత్రం : ఆరుద్ర ఉ 10.48 వరకు ఉపరి పునర్వసు
యోగం : ఆయుష్మాన్ రా 07.44 వరకు ఉపరి సౌభాగ్య
కరణం : వణజి ఉ 11.31 భద్ర రా 10.32 ఉపరి బవ
👉 —–ॐ సాధారణ శుభ సమయాలు —–ॐ
ఉ 10.00 – 11.00 సా 05.00 – 06.00
అమృత కాలం : ఈరోజు లేదు
అభిజిత్ కాలం : ప 11.57 – 12.44
💫———————————💫
వర్జ్యం : రా 10.12 – 11.43
దుర్ముహూర్తం : ఉ 08.45 – 09.38 మ 12.44 – 01.31
రాహు కాలం : ఉ 10.52 – 12.20
గుళికకాళం : ఉ 07.55 – 09.23
యమగండం : మ 03.17 – 04.45
ప్రయాణశూల : పడమర దిక్కుకు పనికిరాదు
👉 ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ 🌻
ప్రాతః కాలం : ఉ 06.27 – 08.48
సంగవ కాలం : 08.48 – 11.10
మధ్యాహ్న కాలం : 11.10 – 01.31
అపరాహ్న కాలం : మ 01.31 – 03.52
ఆబ్ధికం తిధి : ఫాల్గుణ శుద్ధ ఏకాదశి
సాయంకాలం : సా 03.52 – 06.14
ప్రదోష కాలం : సా 06.14 – 08.40
రాత్రి కాలం : రా 08.40 – 11.55
నిశీధి కాలం : రా 11.55 – 12.44
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.48 – 05.37
🙏————–🙏————-🙏
సూర్యోదయాస్తమాలు : ఉ 06.27 | సా 06.14 విజయవాడ
సూర్యోదయాస్తమాలు : ఉ 06.36 | సా 06.22 హైదరాబాద్
సూర్యరాశి : కుంభం | చంద్రరాశి : మిధునం/కర్కాటకం
ఈరోజు జన్మదినం / వివాహవార్షికోత్సవం జరుపుకునే
ఆత్మీయులకు శుభాశీస్సులు – ధీర్ఘాయుష్మాన్ భవః
వాసు ముక్తినూతలపాటి, ఫోన్ 99497 22792
🙌 ————-🙌————-🙌*
🐏 మేషం
ఆలయ దర్శనాలు మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. ప్రయాణాలలో అవరోధాలు ఉంటాయి. పనులలో ఆటంకాలు ఉన్న నిదానంగా పూర్తిచేస్తారు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయమై శ్రద్ద అవసరం. వ్యాపారాలు మరింత నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది.
🐂 వృషభం
దూర ప్రాంత బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు ఉండవు. వృత్తి ఉద్యోగాలలో అంచనాలను అందుకుంటారు. వ్యాపారాలలో తగిన లాభం పొందుతారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశములు లభిస్తాయి.
👬 మిధునం
వ్యవహారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఉన్నట్టుండి నిర్ణయాలలో మార్పులు చేసుకుని ఇబ్బంది పడతారు. ఉద్యోగమున పనిభారం పెరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలలో దృష్టి పెట్టడం మంచిది. బంధువర్గంతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ప్రయాణాలు కష్టంగా ఉంటాయి.
🦀 కర్కాటకం
కొత్త పనులు శ్రీకారం చుడతారు. దూర ప్రాంత బంధువుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సమాజంలో విలువ పెరుగుతుంది. విలువైన వస్తు, వస్త్ర, ధన లాభాలున్నాయి. వృత్తి, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.
🦁 సింహం
విందు వినోదాది కార్యక్రమాలలో విరివిగా పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. నిరుద్యోగులకు ఒక సమాచారం ఊరటను ఇస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలలో కొత్త పద్ధతులు ప్రవేశపెడతారు. ఉద్యోగ విషయమై శుభవార్త అందుతుంది.
👧 కన్య
ముఖ్యమైన పనులలో తొందరపాటు నిర్ణయాలు వలన ఆర్ధిక నష్టాలు కలుగుతాయి. చేపట్టిన పనులు అవాంతరాలు కలిగి మధ్యలో నిలిచిపోతాయి. వివాదాలకు వెళ్ళకపోవడం మంచిది. ద్విస్వభావ ఆలోచనలు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.
⚖️ తుల
ప్రయాణాలు చికాకు కలిగిస్తాయి. సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. కొన్ని పనులు వాయిదా వెయ్యడం మంచిది. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరం అవుతాయి. ఉద్యోగమున శ్రమ తప్పదు.
🦂 వృశ్చికం
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. సంతాన విద్యా విషయాలలో సంతృప్తి కలుగుతుంది. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. విభేదించినవారే దగ్గరవుతారు. ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది.
🏹 ధనస్సు
అప్రయత్నంగా పనులు పూర్తవుతాయి. సన్నిహితుల కలయిక సంతోషం కలిగిస్తుంది. చాలా కాలంగా వేచి చూస్తున్న అవకాశం లభిస్తుంది. వాహన కొనుగోలు అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగ విషయమై ఇరుక్కున్న సమస్యల నుండి చాకచక్యంగా బయటపడతారు.
🐐 మకరం
కొన్ని వ్యవహారాలలో ముఖ్యమైన మార్పులు చోటుచేసుకుంటాయి. శ్రమతో ప్రయాణాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగములలో పని ఒత్తిడి పెరుగుతుంది. దైవ భక్తి పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించడం మంచిది. మిత్రుల నుండి సమస్యలు కలుగుతాయి.
🏺 కుంభం
ఇంటా బయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం అంతగా అనుకూలించదు. సన్నిహితులతో దూరంగా మెలగడం మంచిది. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. చేసిన పని మళ్ళీ మళ్ళీ చెయ్యవలసిన రావచ్చు. వృత్తి, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో ఉండవు.
🐟 మీనం
ప్రయాణాలలో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. చాలా కాలంగా తీరని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో హోదా పెరుగుతుంది. వ్యవహారాలు ఉత్సాహంగా ఉంటాయి. బంధుమిత్రులతో అనుకూల వాతావరణం ఉంటుంది.
🍁 శుభం భూయాత్ 🍀
