homebanner

అర్ధ మండల దత్త దీక్ష 2026 – మొగలిచెర్లలో శ్రీ దత్తాత్రేయ స్వామి సేవ, అన్నప్రసాదం & భక్తి విశేషాలు

అర్ధ మండల దత్త దీక్ష 2026 – మొగలిచెర్లలో శ్రీ దత్తాత్రేయ స్వామి సేవ, అన్నప్రసాదం & భక్తి విశేషాలు

అర్ధ మండల దత్త దీక్ష

మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయుడు మాలాధారణ లేదా మండల దీక్ష అనేది 41 రోజుల కార్యక్రమం..

కొంతమంది తమకు వున్న ఇబ్బందుల వలన పూర్తి మండలం రోజులు దీక్ష తీసుకోవడానికి కుదరకపోయినప్పుడు.. కనీసం 21 రోజుల పాటైనా ఆ అవధూత స్మరణ లో వుండి తరిద్దామనే తలంపుతో.. అర్ధ మండల దీక్ష స్వీకరిస్తారు..


ఈరోజుకు ఆ అర్ధమండల దీక్ష స్వీకరణ కార్యక్రమం పూర్తి అయింది..

సుమారు 200 మంది అర్ధ మండల దీక్ష తీసుకొన్నారని ఒక అంచనా..

అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని ఇలా దీక్ష లో వుండి కొలిస్తే.. తమకు రక్ష గా ఉంటాడనే ప్రగాఢ విశ్వాసం ఇక్కడ ప్రజల్లో వుంది..

అందుకే ప్రతి ఏడూ దీక్ష స్వీకరించే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది..


మా వంతుగా దీక్ష లో వున్న స్వాములకు..

శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరాన్ని దర్శించుకునే భక్తులకు ఉచిత అన్న ప్రసాదము, వసతి ఏర్పాట్లు చేస్తున్నాము..


“దీక్షలో వున్న స్వామి అంటే మా లెక్కలో సాక్షాత్తు దత్త స్వరూపమే అని భావిస్తాము..

ఆ స్వామికి ఒక పూట ఆహారం పెట్టినా.. అది నేరుగా ఆ దత్తాత్రేయడే తీసుకొన్నట్లుగా తెలుస్తాము..”

అని ఒక భక్తుడు మాతో చెప్పిన మాటలు మేము మరచిపోము..


మందిరం వద్దే ఉండి..

నిత్యము శ్రీ దత్తాత్రేయ స్వామి వారి సేవలో తరిస్తున్న దత్త స్వాముల భిక్ష కొఱకు దాతలు సహకారం ఇస్తున్నారు..

వారందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము..


అదే విధంగా..

21 రోజులపాటు మండల దీక్ష లో వున్న స్వాముల ఆహారం కోసం సహకారం అందించమని దాతలకు విజ్ఞప్తి చేస్తున్నాము..

మేము ఏ ఏర్పాటు చేసినా.. అది ఎందరో దత్త భక్తుల సహాయ సహకారాలతోనే చేయగలిగాము..

ఆ భక్తులకు మా తరఫున ఎన్ని సార్లు ధన్యవాదములు తెలుపుకున్నా.. అది తక్కువే..


అటువంటి మంచి హృదయం కలిగిన భక్తులకు ఆ దత్తుడి ఆశీస్సులు ఎల్లవేళలా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..


సర్వం..

శ్రీ దత్త కృప!!


సంప్రదించవలసిన వివరాలు:

మందిరం వద్ద ఏర్పాట్లు కొఱకు:
పవని కృష్ణ కిరీటి : 72078 75712

చిరునామా:
పవని నాగేంద్ర ప్రసాద్
శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం
మొగలిచెర్ల గ్రామం
వయా కందుకూరు
లింగసముద్రం మండలం
ప్రకాశం జిల్లా – 523114

సెల్: 99089 73699 & 94402 66380

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
homebanner పండుగలు

దసరా: హిందూమతంలో 9 రోజుల ప్రాముఖ్యత

  • September 30, 2024
దసరా, విజయదశమి అని కూడా పిలుస్తారు, ఇది నవరాత్రి అని పిలువబడే 9 రోజుల పాటు జరుపుకునే ప్రధాన హిందూ పండుగ. ప్రతి రోజు లోతైన ఆధ్యాత్మిక
blank
homebanner పండుగలు

బతుకమ్మ పండుగ: తెలంగాణకు ప్రాముఖ్యత

  • September 30, 2024
బతుకమ్మ తెలంగాణలో అత్యంత శక్తివంతమైన మరియు సాంస్కృతికంగా ముఖ్యమైన పండుగలలో ఒకటి, దీనిని ప్రధానంగా మహిళలు జరుపుకుంటారు. ఇది తెలంగాణ సాంస్కృతిక స్ఫూర్తిని సూచించే పూల పండుగ