బ్రాహ్మణుల ఆత్మవిశ్వాసం & జీవన విధానం: సనాతన ధర్మంపై ప్రేరణాత్మక సందేశం

బ్రాహ్మణులు చిన్న తువ్వాలు కట్టుకుని చీపురు పట్టి వంటిల్లు శుభ్రం చేయగలరు. అంట్లు తోమగలరు. రుచిగా వంటకాలు చేయగలరు.
ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని ఒక పెద్ద MNC కంపెనీకి CEO అవ్వగలరు.
మూడు పూటలా సంధ్యావందనం చేస్తూ , ISRO లో పెద్ద శాస్త్రవేత్త అవ్వగలరు.
గుడి దగ్గర భక్తులుకి తీర్థం ఇస్తూ సాదా సీదాగా బ్రతకగలరు. దేశానికి త్రిదళాధిపతులుగా సైన్యంలో పని చేయగలరు.
వారి ఆత్మ విశ్వాసం అటువంటిది. సింహం ఒక్కటే తోడులేకుండా వేటకి వెడుతుంది. మిగతా క్రూర మృగాలు రెండు మూడు కలసి వేటాడుతాయి.
ఏ పరిస్థితుల లోనైనా నేను బతకగలను అనే ఆత్మ విశ్వాసం బ్రాహ్మల్లో కనపడుతుంది. ఎవరో సహాయం చేయాలని, కలసికట్టుగా ఐకమత్యంగా ఎవరిమీదో నిందలు వేయాలని, సాధించాలని వారి ప్రవృత్తిలో కనపడదు. అసూయ ఉండదు. ఆత్మనూన్యత ఉండదు. చిన్న పెద్దా తేడా లేకుండా అన్ని వర్గాల వారిని ఆశీర్వదించగలరు.
బ్రాహ్మణ సంఘాలు ఉన్నప్పటికీ వారి లక్ష్యాలు రాజకీయ వ్యాపార లభ్ది కోసం కాకుండా సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడానికి ఉపయోగిస్తారు. మిగతా కుల సంఘాల మాదిరిగా ఉండదు.
ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది అని నమ్ముతారు.
🙏🙏🙏🙏🙏🙏
