దుస్తర్కాత్ సువిరమ్యతాం – శంకర సందేశం

🍂🥀🍂🥀🍂🥀🍂🥀🍂🥀🍂🥀🍂
దుస్తర్కాత్ సువిరమ్యతాం శ్రుతిమతః తర్కోనుసంధీయతాం
మన శ్రేయోభిలాషులు మనకు ఏవైనా విషయాలు చెప్పినప్పుడు, మనం దానిని అత్యంత శ్రద్ధతో మరియు విశ్వాసంతో ఆచరించాలి. వాటిని గురించి వాదించడం లేదా ఆధునిక విజ్ఞానపరముగా సరైనదా అని తర్కించడము మంచిది కాదు. అలాగని పెద్దవారు చెప్పారు కదా అని గ్రుడ్డిగా అనుసరించకూడదు. చెప్పిన విషయము శ్రుతి మరియు శాస్త్రాలకు అనుగుణంగా ఉందో లేదో మనము ధృవీకరించుకోవాలి. ఇదే మాటను శ్రీశంకర భగవత్పాదులవారు ఇలా చేపారు. "దుస్తర్కాత్ సువిరమ్యతాం శ్రుతిమతః తర్కోనుసంధీయతాం" - కుతర్కాలకు దూరంగా ఉండండి, వేదములకు అనుగుణంగా ఉన్నవాటిని ఆచరించండి. 🌿🌿🌿🌿🌿🥀🥀🥀🥀🥀
