జి. పుల్లారెడ్డి త్యాగగాథ: రామజన్మభూమి కోసం జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు

రాముని భవ్యమందిర పునాదిరాళ్లలో జి పుల్లారెడ్డి గారిపేరు.
రాముడి కోసం ఆస్తులు త్యాగంచేసిన మహానుభావులు కీర్తిశేషులు శ్రీ గుణంపల్లి పుల్లారెడ్డి గారు. ఈరోజు వారి ఆత్మ పరిపూర్ణమైన ఆనందాన్ని పొందుతుంది. జై శ్రీరాం….
పుల్లారెడ్డి గారి పేరు వినగానే స్వీట్లతో పాటు మహోన్నత వ్యక్తిత్వం, నీతినిజాయితీలను పాటించిన నేతి మిఠాయిల వ్యాపారిగా, ధార్మిక నాయకునిగా, సామాజిక కార్యకర్తగా కళ్ళముందు కదలాడుతుంది. కృషియే సర్వోత్కృష్ట ధ్యానము అని నమ్మిన మహావ్యక్తి.|| ఈ విజయం అవిజ్ఞాతులైన మహనీయుల స్మృతి కి అంకితం .||
🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
అయోధ్య రామ జన్మభూమి నిర్మాణం అని మాట పలికితే దాని వెనుక మరొక అవిస్మరణీయ దిగ్గజం…..స్వర్గీయ గుణంపల్లి పుల్లారెడ్డి(జి పుల్లారెడ్డి నేతి మిఠాయిల అధినేత).
ఆ రోజుల్లో కోర్టులో కేసు వాదించడానికి రోజుకు లక్షల్లో ఖర్చు వస్తున్నందున
ఢిల్లీ కార్యాలయంలో ఆర్థిక సంకటం ఏర్పడింది. కోశాధికారిగా ఉన్న పుల్లారెడ్డి గారి దగ్గరికి అశోక్ సింగల్ గారు వచ్చారు. అప్పటికి ఇరవైఐదు లక్షలు సమీకరించాలి. లక్షల రూపాయలు సంగ్రహించడం అప్పటికప్పుడు కష్టంగా ఉన్న సమయం. బాధపడుతూ హైదరాబాద్ వచ్చారు .
పుల్లారెడ్డి గారి ఇంట్లో కూర్చొని మాట్లాడుతుండగా, ఇంట్లోకి వెళ్లి వచ్చి రెండు లక్షల రూపాయలు అశోక్ జీ చేతిలో పెట్టి, సాయంత్రానికి మరో పది లక్షలు ఆ తర్వాత మిగతావి సమకూర్చుదాము అంటూ, రామజన్మభూమి కేసు మనకు విజయం చేకూరే వరకు వాదించ వలసిందే దాని కొరకు పోరాడవలసినదే. ఎక్కడికైనా, ఎంత దూరమైనా, ఎన్ని త్యాగాలకైనా వెరవకుండా ముందుకు వెళ్దాం.
కేసు విషయంలో అంతరాయం కలగకూడదు అంటూ భరోసా ఇవ్వడమే కాక, ఎర్రమంజిల్లో ఉన్న తన ఇంటి ముందుకు తీసుకువచ్చి అశోక్ జి చేతులు పట్టుకొని, నేను బతికుండగా, కోశాధికారిగా ఉండగా కేసుకు సంబంధించిన ధనం తక్కువ కానివ్వను .
అవసరమైతే ఈ ఇల్లు అమ్మి వేద్దాం, ఆమె లక్షల రూపాయల విలువచేసే నగలు అమ్మి వేద్దాం అంటూ భార్య నారాయణమ్మ గారితో సహా అశోక్ జీ చేతులు పట్టుకుని ప్రార్థించాడు.
అశోక్ సింఘాల్ కన్నీటి పర్యంతమై, ఆనందాశ్రువులు కనుకొనుకులలో సుడులు తిరుగుతుండగా, నీవంటి కుమారులు జన్మించినందుననే భారతమాత శిరస్సు ఉన్నతంగా నిలిచి ఉంది. అపజయం అన్నదే లేదు. ఎప్పుడు తల వంచ వలసిన అవసరం రాదు అంటూ భారతమాత ప్రియ పుత్రుని ఆలింగనం చేసుకుని పుల్లా రెడ్డి గారి భుజాన్ని ఆనందపు అశ్రువులతో తడిపేసారు కీర్తిశేషులు అశోక్ సింగల్ జి.
ఇటువంటి ఎందరో త్యాగధనుల యొక్క కృషి. తమ రక్తాన్ని చెమటగా మార్చిన అనేకమంది అవిజ్ఞాతులైన హిందూధర్మ రక్షకులైన వారి త్యాగ ఫలమే రామజన్మభూమి నిర్మాణం, దాని విజయం వాళ్లందరి స్మృతులకు అంకితం.
🚩🚩🚩🚩 🙏🏻 🚩🚩🚩🚩
మన తెలుగు రాష్ట్రాల్లో పుల్లా రెడ్డి స్వీట్స్ పేరు వినని వారు లేరు అంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే, ఏ పండగొచ్చినా, ఎలాంటి ఆనంద సందర్భమైనా పుల్లా రెడ్డి స్వీట్స్ కొని అందరికి పంచటం ఒక ఆనవాయితీగా మారిపోయింది. ముఖ్యంగా, హైద్రాబాద్ లో పుల్లారెడ్డి స్వీట్స్ షాప్, ఆ నగరానికే ఒక ప్రత్యేకతను తీసుకొచ్చి పెట్టింది. ఎవరైనా హైదరాబాద్ నుండి మిగిలిన ప్రాంతాలకి వెళ్లే వారు ఉంటె, ఖచ్చితంగా ఈ పుల్లారెడ్డి స్వీట్స్ కొని తీసుకువెళతారు. అలాంటి పుల్లారెడ్డి స్వీట్స్ గురించి మనము ఇంతవరకు వినని, చూడని ఎన్నో గొప్ప నిజాలు ఉన్నాయి. మనం అంతగా ఆదరించే పుల్లా రెడ్డి స్వీట్స్ గురించి ఈ గొప్ప విషయాలు తెలుసుకోవటం చాలా ముఖ్యం.
- తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే, మొట్ట మొదటి సారిగా శ్రీవారి గుడి వంట గదికి ఆహ్వానించబడినది పుల్లా రెడ్డి స్వీట్స్ షాప్. టీటీడీ వారు తాము భక్తులకి అందించే ప్రసాదాలు ఎక్కువ కాలం నిల్వ ఉండే విధంగా సూచనల కోసం పుల్లా రెడ్డి స్వీట్స్ వారిని ఆహ్వానించారు. ఇలా ఒక దేవస్థానం వారు ఒక స్వీట్స్ షాప్ వారిని ఆహ్వానించటం ఎంతో గౌరవప్రదమైనది. తిరుమల తిరుపతి దేవస్థానం వారు పుల్లా రెడ్డి స్వీట్స్ కి ఇచ్చిన గౌరవం చాలా అరుదైనది. దాదాపు ఇది ఎవరికీ తెలియని నిజం.
- ఎంతటి పెద్ద వ్యాపారం అయినా, చిన్నగానే మొదలవుతుంది, పుల్లా రెడ్డి స్వీట్స్ వ్యాపారం కూడా అలా మొదలైయినదే.
కర్నూల్ లోని గోకవరం అనే ఒక పల్లెటూరులో, సైకిల్ తొక్కుతూ తన భార్య తయారు చేసిన స్వీట్స్ ను అమ్ముతూ అంచెలంచెలుగా ఎదిగారు జి. పుల్లా రెడ్డి గారు. కసిరెడ్డి గారి గొప్ప సలహా మేరకు, పాత కర్నూల్ మార్కెట్ లో ఒక చిన్న స్వీట్ షాప్ పెట్టి తోలి అడుగు వేశారు.
- భారత దేశం లో ఎక్కువశాతం, స్వీట్ షాప్స్ ఉత్తర భారతదేశం నుండి వచ్చే వ్యాపారులు, అంటే ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్ నుండి వచ్చినవారు ఉండేవారు. అంతే కాకుండా ముస్లిం వ్యాపారులు కూడా ఎంతో ఎక్కువ మంది ఉండేవారు. అలాంటి సమయంలో, ఆంధ్ర ప్రదేశ్ లో మొట్ట మొదటి సారిగా తెలుగు స్వీట్ షాప్ గా జి. పుల్లా రెడ్డి స్వీట్ షాప్ పేరు తెచ్చుకుంది. మన తెలుగు వాళ్ళకి, ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చింది పుల్లా రెడ్డి స్వీట్స్. అప్పటివరకు వేరు వేరు ప్రదేశాల నుండి వచ్చిన మిఠాయి వ్యాపారులకు గట్టి పోటీని ఇచ్చింది పుల్లా రెడ్డి స్వీట్స్.
- 1954 సంవత్సరంలో పుల్లా రెడ్డి స్వీట్స్, రాష్ట్రపతి నివసించే రాజభవన్ కి అధికారికంగా స్వీట్స్ సరఫరా చేయటం ప్రారంభించింది.
- 1974 లో జి. పుల్లా రెడ్డి గారు, RSS లో సంఘ్ చాలక్ గా చేరారు. తద్వారా 1975 లో ఆయన పుల్లారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ను స్థాపించారు. కేవలం వ్యాపారం కే పరిమితం కాకుండా, దేశానికి ఉపయోగపడే సేవ చెయ్యాలనే తపన పుల్లారెడ్డి గారిని ఈ స్థాయికి తీసుకొచ్చింది.
ఎవరైనా హైదరాబాద్ నుండి మిగిలిన ప్రాంతాలకి వెళ్లే వారు ఉంటె, ఖచ్చితంగా ఈ పుల్లారెడ్డి స్వీట్స్ కొని తీసుకువెళతారు.
- ఉడిపి పేజవర్ మట్, పుల్లారెడ్డి గారికి ‘దానగుణ భూషణ’ అనే బిరుదును 1991 లో అందించారు. దాని మరుసటి సంవత్సరం లో ‘జమ్నాలాల్ బజాజ్’ అవార్డును వారు చేసే నిజాయితీ గల వ్యాపారానికి నిదర్శనంగా పొందారు.
- దేశం మొత్తం 18 ఔట్లెట్స్ ఉన్నాయి, అందులో 8 హైదరాబాద్ లో, 4 కర్నూల్ లో, 6 బెంగుళూరు లో.
అమెరికా లో కూడా షాప్ లు ప్రారంభించారు, అందులో న్యూ యార్క్, కాలిఫోర్నియా, షార్లెట్ వంటి ప్రధాన నగరాలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి దాదాపు 45 కోట్ల ఆదాయం వస్తుంది.
- కేవలం స్వీట్ షాప్ కాకుండా, హైదరాబాద్ లో పుల్లారెడ్డి కాలేజీ అఫ్ ఇంజనీరింగ్ మరియు, జి.నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ను స్థాపించారు.
- పుల్లా రెడ్డి స్వీట్స్ ను స్థాపించిన జి పుల్లారెడ్డి గారు ఏవిధమైన ఉన్నత విద్య చదువుకోలేదు. అయినప్పటికీ భారతదేశంలో విజయవంతమైన కొద్ది వ్యాపారవేత్తలలో పుల్లారెడ్డి ఒకరి గా నిలిచారు.
మనందరికీ పుల్లా రెడ్డి స్వీట్స్ గురించి ఎన్నో తెలియని అద్భుతమైన నిజాలు తెలిసాయి. అయితే, వీటి అన్నింటిలో, వ్యాపారం పట్ల ఆయనకి ఉన్న క్రమశిక్షణ, అంచెలంచెలుగా ఎదిగే తత్త్వం కనపడుతున్నాయి. ఎంత ఎత్తుకి ఎదిగినా, ఒదిగి ఉండగలిగే స్వభావం వల్ల ఆయనకు ఎన్నో గౌరవ సత్కారాలు లభించాయి. ఎవ్వరికీ అందని గౌరవ బిరుదులూ పొందారు. అంతటి తో ఆగకుండా, సమాజం పట్ల ఆయనకి ఉన్న శ్రద్ధను పనుల రూపంలో చూపించి అందరికి వీలైనంత మంచిని చేసే ప్రయత్నం చెయ్యటం లో ఆయన పూర్తిగా విజయం సాధించారు. వ్యాపారం ద్వారా గొప్ప స్థాయికి ఎదిగి, ఆ స్థాయిని తిరిగి వ్యాపారం ద్వారా కాకుండా తన సేవా భావం వల్ల, సమాజం పట్ల గౌరవ భావం తో ఆయన మెలిగిన తీరు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది 👏
