గురువారం శుభోదయ సందేశం 26-02-2026 | దివ్య ఆశీర్వాదాలు

ఆత్మీయ బంధు మిత్రులకు గురువారపు శుభోదయ శుభాకాంక్షలు 🌹
కృష్ణం వందే జగద్గురుమ్ 🙏
ప్రపంచానికి భగవద్గీత ప్రసాదించిన విశ్వ గురువులు గీతా చార్యులు శ్రీకృష్ణుడు పరమాత్ములవారు**,**
పూజ్య గురువులు శ్రీ గురు దత్తాత్రేయుడు వారు**,**
పూజ్య గురువులు శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారు**,**
జగద్గురువులు ఆది శంకరాచార్యుడు వార్ల అనుగ్రహంతో
మీరు, మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ..
ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న ఆత్మీయయులకు శుభాకాంక్షలు 🌹💐🥭🍫🍇
━━━━━━━━━━━━━━━━━━
ఈ రోజు AVB మంచి మాటలు
గురువారం : 26-02-2026
━━━━━━━━━━━━━━━━━━
ఈ జీవితం చాలా చిన్నది మిమ్మల్ని ప్రేమించే వారితో మీరంటే అభిమానించే వారితో మీ కోసం ప్రేమగా ఎదురుచూసే వాళ్ళతో ఎక్కువ సమయం గడపటానికి ప్రయత్నిచండి ,
మన ఈ సమాజంలో నిజమైన ప్రేమకి నిజాయితీగా ఉన్న మనిషికి విలువే లేదు, అబద్దాన్ని అందంగా చూపిస్తే నిజం కూడా దాని వెంట పడుతుంది .
ప్రతి బాధకూ ఒక సంతోషం ఉంటుంది, ప్రతి తప్పుకీ సరిదిద్దుకునే ఒక అవకాశం ఉంటుంది, జీవితంలో జరిగే ప్రతి సంఘటనకీ కాలమే సమాధానం చెబుతుంది, మనం లేదు అనుకుంటే ఏదీ ఉండదు, ఉంది అనుకుంటే లేనిది కూడా మనతోనే ఉంటుంది ,
మనం ఎలా ఉండాలంటే నీతో ఉన్నవారు నిన్ను ఎందుకు కలిసామా అనుకునేలా కాకుండా నిన్ను విమర్శించిన వాళ్లు కూడా నిన్ను ఎందుకు వదులుకున్నామా అనుకునేలా బ్రతకాలి .
మీరు మనస్తత్వం కలిసిన వారిని వదులు కోకూడదు,
మానవత్వం తెలియని వారిని కలుపు కోకూడదు.
ఎదుటివారితో మాట్లాడేటపుడు వీరితో మనం మాట్లాడే ఆఖరి మాట ఇదే కావచ్చునేమో అని తలంచి మాట్లాడాలి అప్పుడే మన నోటి నుండి వచ్చే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడగలం .
నాకు ఏమీ తెలియదు అనుకునే వారు అమాయకుడు,
నాకు అన్నీ తెలుసు అనుకునేవాడు మూర్ఖుడు,
మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి అనుకునేవాడు నిత్య విద్యార్థి తెలుసుకున్నవాటిలో సత్య,అసత్యాలు గ్రహించేవాడు మేధావి
✍️ AVB సుబ్బారావు
📞 9985255805
🚩🌹🤝
