మన కర్మలే మన భవిష్యత్తు – మంచి చెడు ఫలితాలపై ఆధ్యాత్మిక సందేశం

జగత్తునందు ఏ సుఖ దుఖములకు కాని,
ఏయొక్క ఆనందమునకు కానీ మనము చేసుకున్నటువంటి యొక్క మంచి చెడ్డల కర్మలే దీనికి మూల కారణమని గుర్తించి మంచి కార్యములలో ప్రవేశించి మంచి భావములు పెంచుకొని మంచి జీవితములోపల, మంచిని పొందమని ప్రబోధిస్తూ వస్తుంది.
మనము చేసినటువంటివి మనకే లభిస్తాయి కానీ, మరొకరికి కాదు! నీవు తిన్నటువంటి యొక్క పదార్ధము యొక్క త్రేపు, వాసన నీకే లభిస్తుంది కాని ఇంకొకరికి లభిస్తుందా?
నీవు మామిడి పండును భుజించినప్పుడు, నీకే వస్తుంది కాని ఆ మామిడి పండు త్రేపు, మరొకరికి రాదు! లేక నీవు మామిడి పండు తినేసి, దోస పండు త్రేపు రావాలంటే వస్తుందా? రాదది.!
కనుక మన యొక్క మంచి చెడ్డలకు మనమే మూల కారణము.
దీనికి భగవంతుడు కూడను కారణము కాదు!
భగవంతుడు నిమిత్తమాత్రుడు.
కాని, చెడ్డ కర్మలు ఎన్ని ఉండినప్పటికిని,
పాపములు ఎన్ని చేసినప్పటికినీ, ఒక పరతత్వము లోపల భగవంతుని హృదయ పూర్వకంగా ప్రార్ధిస్తే సర్వకర్మలు కూడనూ మంచువలె మాయమైపోతాయి.
శుభమస్తు 🙏శ్రీ సద్గురు పీఠం ..✍️
సమస్త లోకా సుఖినోభవంతు 🙏
