homebanner

మనిషి తప్పించుకోలేని మూడు కర్మలు – సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మల వివరణ

మనిషి తప్పించుకోలేని మూడు కర్మలు – సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మల వివరణ

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

మనిషి తప్పించుకోలేని మూడు కర్మలు?

హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం, మనిషి తాను చేసే పనుల ఫలితాల నుంచి తప్పించుకోలేడని కర్మ సిద్ధాంతం చెబుతుంది. కర్మలు ప్రధానంగా మూడు రకాలు. వీటిని కేవలం పనులు అనడం కంటే, మన జీవిత ప్రయాణంలో మనం వెంట తెచ్చుకునే “సంస్కారాలు” లేదా “ఫలాల మూటలు” అని విశ్లేషించవచ్చు.

🕉️ సంచిత కర్మ

“సంచిత” అంటే “సంగ్రహించబడినది” “పోగుచేయబడినది”

సంచిత కర్మ అంటే అనేక జన్మల నుండి పోగుచేసిన కర్మల సమూహం. మన గత జన్మలలో చేసిన మంచి, చెడు కర్మలన్నీ ఒక గిడ్డంగిలో నిల్వ ఉన్నట్లుగా ఉంటాయి.

ఒక గోధుమ గిడ్డంగిలో టన్నుల కొద్దీ ధాన్యం పోగుచేసినట్లు, మన అనేక జన్మల కర్మలు సంచితంగా ఉంటాయి.

~>> అనేకజన్మసంసిద్ధం కర్మ సంచితముచ్యతే ।
కల్పకోటిసహస్రాణి సంచితం కర్మ తిష్ఠతి ॥

అనేక జన్మలలో చేసిన కర్మను సంచిత కర్మ అంటారు. కోట్ల కల్పాలపాటు సంచిత కర్మ నిలుచుండి ఉంటుంది.

🕉️ ప్రారబ్ధ కర్మ

“ప్రారబ్ధ” అంటే “ప్రారంభించబడినది” లేక “అమలులోకి వచ్చినది”

సంచిత కర్మ గిడ్డంగిలో నుండి ఈ జన్మలో అనుభవించడానికి తీసుకొచ్చిన కర్మ. ఇది ఈ జన్మలో తప్పనిసరిగా అనుభవించాల్సిందే.

గిడ్డంగిలోని ధాన్యంలో నుండి రోజుకు అవసరమైన పరిమాణం మాత్రమే తీసుకు రావడం లాంటిది.

బాణం విల్లు నుండి బయలుదేరిన తర్వాత దాన్ని ఆపలేము – అలాగే ప్రారబ్ధ కర్మను ఆపలేము.

ప్రారబ్ధ కర్మ… ఏ దేశం, ఏ కుటుంబం, రూపం, ఆరోగ్యం, ఆయుష్షు, సుఖదుఃఖాలు, తల్లిదండ్రులు, భార్యాభర్తలు, సంతానం,, లను నిర్ణయిస్తుంది.

~>> ప్రారబ్ధం పుణ్యపాపానాం ఫలం దేహే సమాశ్రితమ్।
భోక్తవ్యమేవ తత్ సర్వం న త్యక్తుం శక్యతే క్వచిత్॥

పుణ్య-పాప కర్మల ఫలితం ఈ దేహంలో ప్రారబ్ధంగా ఆశ్రయించి ఉంది. అది అంతా అనుభవించాల్సిందే – ఎక్కడా వదిలివేయలేము.

🕉️ ఆగామి కర్మ

“ఆగామి” అంటే “రాబోయేది” లేక “భవిష్యత్తు”

ఈ జన్మలో ఇప్పుడు చేస్తున్న కర్మలు – ఇవి భవిష్యత్తు జన్మల కోసం సంచిత కర్మలో చేరుతాయి.

ఇప్పుడు మనం విత్తే విత్తనాలు, భవిష్యత్తులో పంటగా లభిస్తాయి.

~>> ఆగామి కర్మ యత్ కుర్యాత్ ఇదానీం మానవః స్వయమ్।
భవిష్యే తస్య ఫలదం భవేత్ జన్మాన్తరే ధ్రువమ్ ॥

మనిషి ఇప్పుడు తానే చేసే కర్మను ఆగామి కర్మ అంటారు. భవిష్యత్తులో, మరో జన్మలో దాని ఫలితం తప్పకుండా లభిస్తుంది.

🕉️ బాణ ఉపమానం:

~>> బాణం విముక్తం యథా ప్రారబ్ధం కర్మ ।
ధనుఃస్థం యథా సంచితం కర్మ।
తూణీరస్థం యథా ఆగామి కర్మ ॥

ప్రారబ్ధ = విల్లు నుండి వదిలిన బాణం ,,, ఆపలేము
సంచిత = విల్లులో అమర్చిన బాణం ,,, ఇంకా వదలలేదు
ఆగామి = పొదిలోలో ఉన్న బాణాలు ,,, ఇంకా తీసుకోలేదు
🕉️ కర్మలను ఎలా తీర్చాలి?

🛕 సంచిత కర్మ తొలగింపు : జ్ఞానం ద్వారా :

~>> జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా।
సంచితం దహతే జ్ఞానం తృణానీవ హుతాశనః॥ (భగవద్గీత 4.37)

జ్ఞానాగ్ని సమస్త కర్మలను భస్మం చేస్తుంది. జ్ఞానం సంచిత కర్మను గడ్డిని అగ్ని కాల్చినట్లు దహిస్తుంది.

తొలగించుకొనే మార్గాలు : ఆత్మజ్ఞానం పొందడం, గురూపదేశం, భక్తి, ధ్యానం, మోక్ష సాధన

🛕 ప్రారబ్ధ కర్మ అనుభవం : సమత్వ భావంతో అనుభవించడం

~>> సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ।
తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి॥ (భగవద్గీత 2.38)

మార్గాలు : సమ భావంతో స్వీకరించడం, ఫల త్యాగం, ఓర్పు, ధైర్యం, “ఇది నా కర్మఫలం” అని తెలుసుకోవడం

🛕 ఆగామి కర్మ శుద్ధి : నిష్కామ కర్మ:

~>> కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన।
మా కర్మఫలహేతుర్భూర్మా తే సఙ్గోऽస్త్వకర్మణి॥ (భగవద్గీత 2.47)

మార్గాలు : ఫలాపేక్ష లేకుండా కర్మ చేయడం, ధర్మ మార్గంలో నడవడం, సత్కర్మలు, పుణ్య కార్యాలు, భగవత్ అర్పణ బుద్ధి

🕉️ జీవన సూత్రం : గతాన్ని మరచిపోండి, వర్తమానాన్ని స్వీకరించండి, భవిష్యత్తును సత్కర్మలతో నిర్మించుకోండి!

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
homebanner పండుగలు

దసరా: హిందూమతంలో 9 రోజుల ప్రాముఖ్యత

  • September 30, 2024
దసరా, విజయదశమి అని కూడా పిలుస్తారు, ఇది నవరాత్రి అని పిలువబడే 9 రోజుల పాటు జరుపుకునే ప్రధాన హిందూ పండుగ. ప్రతి రోజు లోతైన ఆధ్యాత్మిక
blank
homebanner పండుగలు

బతుకమ్మ పండుగ: తెలంగాణకు ప్రాముఖ్యత

  • September 30, 2024
బతుకమ్మ తెలంగాణలో అత్యంత శక్తివంతమైన మరియు సాంస్కృతికంగా ముఖ్యమైన పండుగలలో ఒకటి, దీనిని ప్రధానంగా మహిళలు జరుపుకుంటారు. ఇది తెలంగాణ సాంస్కృతిక స్ఫూర్తిని సూచించే పూల పండుగ