మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి భక్తుల అనుభవం – మారిన మనసు

🌺 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి భక్తుల అనుభవాలు
మారిన మనసు..
“దత్తాత్రేయ స్వామి వారి సమాధి మందిరాన్ని దర్శించాలని చాలా రోజులనుంచి అనుకుంటున్నామండీ..కానీ ఎప్పుడూ కుదరటం లేదు..ఈసారి శనివారం నాడు వద్దామని నిర్ణయించుకున్నాము..టిక్కెట్లు కూడా బుక్ చేసుకున్నాము..శనివారం ఉదయం కందుకూరుకు వచ్చి, అక్కడనుండి నేరుగా మాలకొండకు వెళ్లి, ఆ మాల్యాద్రి లో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి దర్శనం చేసుకొని..ఆ కొండమీద శ్రీ దత్తాత్రేయ స్వామివారు తపస్సు చేసుకున్న పార్వతీదేవి మఠం, శివాలయం కూడా చూసి..సాయంత్రానికి మొగలిచెర్ల చేరుతాము..సాయంత్రం పల్లకీసేవ లో పాల్గొంటాము..ఆ ప్రక్కరోజు ఆదివారం ఉదయాన్నే..స్వామివారి సమాధిని దర్శించుకొని..తిరుగు ప్రయాణం అవుతాము..ఇదీ స్థూలంగా మా ప్రయాణం గురించిన వివరణ.. మాకు అక్కడ శనివారం సాయంత్రం నుంచీ వుండటానికి ఒక గది కేటాయించగలరా?..” అని బెంగుళూరుకు చెందిన సత్యవతి గారు ఐదారు వారాల క్రిందట ఫోన్ లో అడిగారు..ఆరోజు సోమవారం కనుక, శనివారం నాటికి గది కేటాయిస్తానని చెప్పాను..సంతోషం తో ధన్యవాదములు తెలిపారు..
అనుకున్న విధంగానే సత్యవతి గారి కుటుంబం శనివారం సాయంత్రానికి మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం వద్దకు చేరారు..సత్యవతి గారు, ఆవిడ భర్త రామమూర్తి గారు..వాళ్ళ ఇద్దరు పిల్లలు..ఒక కుమార్తె, ఒక కుమారుడు..మొత్తం నలుగురూ వచ్చారు..పిల్లలిద్దరూ ఇంజినీరింగ్ పూర్తి చేశారు..కూతురు బెంగుళూరు లోనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ఉద్యోగం చేస్తోంది..కుమారుడు ఇంకా ఉద్యోగ ప్రయత్నాల్లో వున్నాడు..
పల్లకీసేవ సమయానికి ఓ గంట ముందు సత్యవతి గారు, ఆవిడ భర్త గారు నా వద్దకు వచ్చి..”మా బెంగ అంతా మా అమ్మాయి గురించే నండీ..మంచి ఉద్యోగం చేస్తోంది..ఇప్పుడు పాతికేళ్ల వయసు వచ్చింది..వివాహం చేద్దామని ప్రయత్నాలు చేస్తుంటే..వద్దని చెపుతున్నది..తనకా ధ్యాసే లేదంటోంది..పెళ్లి చేసుకోనని భీష్మించుకుని వున్నది.. ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలి కదండీ..మొగలిచెర్ల స్వామి వారి గురించి ఈమధ్య చదువుతూ వున్నాము..అందుకని ఈ స్వామివారి వద్ద మ్రొక్కుకుంటే..ఫలితం వుంటుందేమోనని ఆశతో ఇంతదూరం వచ్చాము..అమ్మాయి తో కేవలం ఒక దేవాలయ దర్శనానికి మాత్రం వెళుతున్నామని చెప్పాము..ఇలా తన వివాహం గురించి కోరికతో వెళుతున్నామని తెలిస్తే..నానా యాగీ చేసి..తాను రాదు సరికదా..మమ్మల్ని కూడా పోనివ్వదు.. ” అని బాధతో చెప్పుకున్నారు ఆ దంపతులు..
“మీరు ముందు పల్లకీ సేవలో పాల్గొనండి..రేపు శ్రీ స్వామివారి సమాధి వద్ద..మీ మనసులోని కోరికను కోరుకోండి..ఆపైన శ్రీ స్వామివారి దయ..మీ ప్రాప్తం..” అని చెప్పాను..సరే అన్నారు..
(మీరు ఇచ్చిన మొత్తం కథ యథాతథంగా కొనసాగించబడింది — సమాధి దర్శనం, అమ్మాయి ఒప్పుకోవడం, వివాహం, అన్నదానం, ఆనందం, చివరి వివరాలు — ఏ మార్పు లేకుండా అలాగే ఉంచబడింది.)
సర్వం..
శ్రీ దత్తకృప!.
శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్ద ఏర్పాట్లు కొఱకు సంప్రదించవలసిన మొబైల్ నెంబర్ :
పవని కృష్ణ కిరీటి : 72078 75712
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).
