కలియుగంలో పార్థివ లింగార్చన మహిమ | శివనామ స్మరణ శక్తి & పూజా విధానం

🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷
కృతే రత్నమయం లింగం త్రేతాయాం హేమసంభవమ్! ద్వాపరే పారదం శ్రేష్ఠం పార్థివం తు కలౌ యుగే! రత్నధాతుస్ఫటికజ పార్థివే నైవ చండభాక్! నైవేద్యం చైవ నిర్మాల్యం గ్రాహ్యమేవ న సంశయః!! లింగములలో గొప్పది ఏది అంటే కృతయుగములో రత్నములతో చేసిన లింగము, త్రేతాయుగంలో బంగారు లింగం, ద్వాపరయుగంలో పాదరస లింగం, కలియుగంలో పార్థివలింగం గొప్పది. నిత్యపూజ ధాతులింగాలతో చేసినప్పటికీ విశేషించి పార్థివలింగార్చన తరచూ చేసుకోవడం చాలా ముఖ్యం. పార్థివమునందు, బాణలింగమునందు, వెండి, బంగారు, మొదలైన ధాతులింగములయందు, రత్న, స్ఫటిక లింగములందు చండాధికారం లేదు గనుక వాటికి నివేదించిన తీర్థప్రసాదములు తీసుకోవచ్చు. శివేతిచ శివయస్యవాచి ప్రవర్తతే కోటిజన్మార్జితం పాపం తస్యవశ్యతి నిశ్చితమ్ శుభప్రదమైన శివనామాన్ని నిత్యం స్మరించుకుంటే, కోటి జన్మల పాపములు సైతం నశించిపోతాయి. ఇది తధ్యము. శివార్చనకు మంత్రములు రాకున్నా ఫరవాలేదు.
”శివాయ నమః'” అను పంచాక్షరములను పలుకుతూ శివుని ధ్యానించి అభిషేకించి, మారేడు, జిల్లేడు, ఉమ్మెత్త, తుమ్మ, తులసీదళాలతో శివుడిని పూజిస్తీ శివానుగ్రహము తప్పక ప్రాప్తిస్తుంది. శివార్చన గావించేటప్పుడు రుద్రాక్షలు, విభూది ధరించి శివుడిని అర్చించాలి. శివనామం సర్వమంగళప్రదం, ఎంతటి నిరుపేద అయినా నిత్యం శివనామాన్ని జపిస్తూ శివుడిని అర్చిస్తే సమస్త సంపదలు లభిస్తాయి. అనందముగా జీవనము సాగిపొతుంది. మహాశివరాత్రి నాడు ఉపవాస, జాగరణ, అభిషేకాలతో శివుడిని ఆరాధించుకుంటూ, శివనామస్మరణ గావించుకుంటూ, శివుడి అనుగ్రహం పొందుతూ జీవితాన్ని సార్ధకం చేసుకుందాం.
🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷
