సంస్కారం – విద్యకు నిజమైన బలం | వినయం, లక్ష్యం జీవన మార్గం

👉 “సంస్కారం అనే మాట గొప్పది.”
చదువు దేనికోసం? సంస్కార బలం కోసం. చదువుకి సంస్కారం తోడైతే మీరు లోకానికి ఏ హితకార్యమైనా చేయగలరు. యుక్తాయుక్త విచక్షణ ఏర్పడుతుంది. సంస్కారబలంతో మీకు తెలియకుండానే ఒక వ్యక్తిత్వం ఏర్పడుతుంది. నీ హితం కోరేవన్నీ ఎప్పుడూ నీకిష్టమైన రీతిలోనే ఉండవు. పాలకోవా ఉంది ఉత్తర భారతంలో దూధ్ పేడా అంటారు. పేడ ఏమిటి నచ్చలేదు అని వ్యంగ్యంగా మాట్లాడక్కరలేదు, అది నేను తినను అంటే, నీ ఖర్మ? పేరేదైతే నీకెందుకు నీక్కావలసింది పాలకోవా రుచి. పైన పేర్లు వివరణలు కావు. నీవందుకోవలసింది అసలు వస్తువుని.
నాకు ఇది తెలియదు అని తెలుసుకోవడమే విద్య, అందుకే నేను విద్యావంతుణ్ణి అని గర్వంగా చెప్పుకోవడం కుదరదు.
“విద్యా దదాతి వినయం” చదివినకొద్దీ, తెలుసుకున్న కొద్దీ వినయం పెరగాలి. వినయం దానంతట అది రాదు, అలా ఐతే అన్ని చదివిన రావణుడికీ వినయం ఉండాలి? లేదు కదా. విద్యతోపాటు వినయం అలవర్చుకోవాలి.
ఎందుకంటే మీరు ఎంత చదివినా ఇంకా మీరు చదువుకోవాల్సినవి మిగిలే ఉంటాయి. మీరు ఎన్ని తెలుసుకున్నారో దాని వల్ల నాకు తెలియనివి చాలా ఉన్నాయి అని తెలిసిననాడూ మీరు అహంకరించడానికి అవకాశం లేదు.
👉 లక్ష్యాన్ని పెట్టుకొకపోతే నీలో ఉన్న రెండు అంశాలు పాడయిపోతాయి. . .
(1) కాలం. :- ఎందుకంటే దాన్ని నీవు సరిగా ” ఉపయోగించుకోలేదు.
(2) నీలోని సమర్థత.
సమర్థత అంటే లక్ష్యసాధనకై నీవు చేసే ప్రయత్నం. మనం పెట్టుకునే లక్ష్యం చిన్నది కాకూడదు. పెద్ద లక్ష్యాన్ని పెట్టుకుని దాన్ని చేరుకోవడానికి నిరంతరం పనిచేయాలి.
🌻🌹🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷🌴🌻
