homebanner

శనివారపు శుభోదయ శుభాకాంక్షలు

shanivaram-subhodayam-message-14-02-2026

ఆత్మీయబంధుమిత్రులకు శనివారపు శుభోదయ శుభాకాంక్షలు🌹.. లక్ష్మి పద్మావతి సమెత తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వారు, శ్రీ వల్లి దేవసేన సమెత తిరుత్థాణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారు మా ఇంటి దైవం వినుకొండ శ్రీ రామ భక్త శ్రీ గుంటి ఆంజనేయ స్వామి వార్ల అనుగ్రహం తో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటు…ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్నా ఆత్మీయులకు శుభాకాంక్షలు 🌹🌹💐💐🍇🍇🥭🥭🍫🍫

..

శనివారం : 14-02-2026

ఫిబ్రవరి 14 తల్లితండ్రులను సమాజాన్ని దేశ రక్షణ కోసం రక్తం చిందించిన వీర సైనుకులను రోజు .ప్రేమతో గౌరవించాలనే భాద్యతను గుర్తుచేసుకునే రోజుగా పాటిద్దాం నా జీవితం నా ఇష్టం అని నువ్వు అనుకోవొచ్చు కాని మన పుట్టుక తల్లితండ్రుల త్యాగఫలం తో మొదలుతుందని గుర్తుంచుకో, ని పెరుగుదలకు సమాజం లోని కార్మికులు కర్షకులు గురువులు మొదలకు వారు కారకులని మరవొద్దు నేస్తమా...అటువంటి వారిని ప్రేమతో గౌరవిద్దాం మనం ఒకరి మనసు గాయపరచడానికి ఒక నిమిషం చాలు కానీ ! గాయపడిన మనసును గెలవాలంటే మాత్రం జీవితకాలం సరిపోదు . మనం ఎదుటి వారిని ఒకమాట అనే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి మాట్లాడాలి .

నీవు ఇతరులను తక్కువ చేసి మాట్లాడితే నీ స్థాయి గొప్పగా ఉంటుందో లేదో కానీ నీ వ్యక్తిత్వం మాత్రం తప్పకుండా దిగజారి పోతుంది

 నేను సాధించిన విషయాల వెనుక రహస్యమేమీ లేదు . కేవలం కష్టించి పని చేయడమే ఉప్పులాగా కటువుగా మాట్లాడే వారే నీ మేలుకోరే మిత్రుడు, అంతే తప్ప చక్కెర లాగా తీపి కబుర్లు చెప్పేవారు కాదు ఎందుకంటే చక్కెరకు చీమలు పట్టని రోజు లేదు, అదే ఉప్పుకు పురుగు పట్టిన దాఖాలాలు నేటికి లేదు ! ఎవరినీ నీవు నమ్మకు మోసపొతావు, ఎవరి కోసమూ ఆలోచించకు వాళ్ళకే నీవు అలుసై పోతావు, ఎక్కువ విలువ వారికి ఇవ్వకు గౌరవాన్ని కోల్పోతావు ఎవరిని ప్రశ్నించకు శత్రువు అవుతావు, ముందుగా వీళ్ళు నా వాళ్ళు వారు నా వాళ్ళు అని ఆలోచించడం తగ్గించు ! . ఎవరి నుంచి ఏం ఆశించకు నీ జీవితం బాగుంటుంది .

. మన ఆనందం పంచుకునే వారికంటే మన బాధను పంచుకునే వారినీ ఎప్పుడు వదులుకోవద్దు… ఆనందం అందరు పంచుకుంటారు.. మన బాధను కొందరే పంచుకుంటారు

 మనకు ఏవైనా బాధలు, కష్టాలు ఉంటే వాటిని ముందుగా భగవంతునికే చెప్పుకోవాలి.*

ఎందుకంటే ఏ బాధలు లేని వాడు మాత్రమే వేరొకని బాధలు తీర్చగల సామర్ధ్యం కలిగి ఉంటాడు.
మనలో బాధలు లేనివారంటూ ఎవరూ లేరు.*
ఏ బాధలు లేనివాడు భగవంతుడొక్కడే. కనుక ఆయనకే ముందుగా చెప్పుకోవాలి.*
అయితే ఒక్కసారి మనం మన బాధలను గూర్చి ఆయనకు చెప్పాక వాటిని గూర్చి ఆలోచించడం మానేయాలి. పదే పదే చెప్పడం చేయకూడదు.*

. భగవంతుడే వాటి సంగతి చూసుకుంటాడు అన్న ధీమాతో మన పని మనం చేసుకుంటూ ఉండాలి. ఇదే అసలైన విశ్వాసం నమ్మకం,అదే నిజమైన శరణాగతి..

✍️AVB సుబ్బారావు,
9985255805

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
homebanner పండుగలు

దసరా: హిందూమతంలో 9 రోజుల ప్రాముఖ్యత

  • September 30, 2024
దసరా, విజయదశమి అని కూడా పిలుస్తారు, ఇది నవరాత్రి అని పిలువబడే 9 రోజుల పాటు జరుపుకునే ప్రధాన హిందూ పండుగ. ప్రతి రోజు లోతైన ఆధ్యాత్మిక
blank
homebanner పండుగలు

బతుకమ్మ పండుగ: తెలంగాణకు ప్రాముఖ్యత

  • September 30, 2024
బతుకమ్మ తెలంగాణలో అత్యంత శక్తివంతమైన మరియు సాంస్కృతికంగా ముఖ్యమైన పండుగలలో ఒకటి, దీనిని ప్రధానంగా మహిళలు జరుపుకుంటారు. ఇది తెలంగాణ సాంస్కృతిక స్ఫూర్తిని సూచించే పూల పండుగ