homebanner

శివరాత్రి ప్రత్యేకం: అష్టనామ శివపూజ, వ్రత సంకల్పం & రుద్రాభిషేక రహస్యాలు

శివరాత్రి ప్రత్యేకం: అష్టనామ శివపూజ, వ్రత సంకల్పం & రుద్రాభిషేక రహస్యాలు

🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷

శివపూజను 108 నామాలతో చేశారా, సహస్ర నామాలతో చేశారా, అన్న దానితో సంబంధం ఉండదు. శివపూజ పరిపూర్ణం కావాలి అంటే ఆగమ తత్త్వవేత్తలు అయినటువంటి పెద్దలు చెప్పే మాట ఒకటే – ఎనిమిది నామములతో పూజ చేస్తే చాలు.

భవాయ దేవాయ నమః
శర్వాయ దేవాయ నమః
ఈశానాయ దేవాయ నమః
పశుపతయే దేవాయ నమః
రుద్రాయ దేవాయ నమః
ఉగ్రాయ దేవాయ నమః
భీమాయ దేవాయ నమః
మహతే దేవాయ నమః

ఈ ఎనిమిది నామముల చేత శివపూజ పూర్తి అయిపోతుంది.

ఆచారాలు-అభీష్టసిద్ధులు : శివరాత్రి ప్రత్యేకం

 ( శివరాత్రి వ్రత సంకల్పం ) శ్లోకం దేవ దేవ మహాదేవ నీలకంఠ నమోస్తుతే కర్తుమిచ్ఛామ్యహం దేన! శివరాత్రివ్రతం తవ || తవ ప్రభావాత్ దేవేశ! నిర్విఘ్నన భవేదితి | కామాద్యాః శత్రవో మాం వై పీడాం కుర్వంతు నైవ హి || భావం

ఓ దేవాదిదేవా! మహాదేవా! నీలకంఠ! నీకు నమస్కారము!
ఓ దేవా! నేను నీకు ప్రీతికరమైన ఈ శివరాత్రి వ్రతాన్ని చేయాలని సంకల్పిస్తున్నాను.
ఓ దేవేశ్వరా! నీ ప్రభావం చేత ఈ వ్రతం ఎటువంటి విఘ్నాలు లేకుండా పరిపూర్ణమయ్యేలా అనుగ్రహించు.
కామము, క్రోధము మొదలైన అంతర్గత శత్రువులు నన్ను బాధించకుండుగాక.

మహా శివరాత్రి నాడు ఏమి చేయాలి?

  1. మహా శివ రాత్రి అర్ధరాత్రి వేళ శివలింగానికి అభిషేకం జరుగుతూ ఉండగా చూడడం.
  2. శివలింగము కటిక చీకట్లో వెలుతురు చిమ్ముతూ ఎలా ఆవిర్భవించినదో మనసులో ధ్యానము చేయడం.
  3. రుద్రాన్ని పారాయణ చేయడం. ఇవి ఏమీ చెయ్య లేకపోతే మహా శివ రాత్రి ప్రదోష వేళ (అసుర సంధ్య వేళ) ఒక్క మారేడు దళం అయిన శివలింగం మీద ఎవరు వేస్తున్నారో వాడు మోక్షమునకు అధికారి.

🌻”రుద్రం, మహారుద్రం, లఘురుద్రం, అతి రుద్రం” – లాంటి మాటలు అభిషేక సందర్భాల్లో వింటూంటాం. అసలు వీటిలో తేడాలు ఏమిటి?🌻

పూజ్యగురువులు శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు

(‘ఋషిపీఠం’ ప్రచురణ ‘సమాధానమ్’ సంచిక నుండి సేకరణ)

యజుర్వేదంలోని మంత్రభాగమైన 11 అనువాకాల ‘శతరుద్రీయం’ కు ‘రుద్రం’ అని పేరు. దానిని ఒకసారి పఠిస్తూ చేసే అభిషేకం రుద్రాభిషేకం అంటారు. దానికి ‘రుద్రం’, ‘ఏకరుద్రం’ అని పేర్లు కూడా ఉన్నాయి.

ఈ 11 అనువాకాల
‘రుద్రం’ పదకొండుసార్లు చెబుతూ చేస్తే ‘ఏకాదశ రుద్రాభిషేకం’ లేదా ‘రుద్రి’ అంటారు.

రుద్రాన్ని 121 సార్లు పఠిస్తూ చేసే అభిషేకం ‘లఘురుద్రాభిషేకం’.

11 లఘురుద్రాలు ఒక ‘మహారుద్రం’. అంటే, ఈ అభిషేకంలో రుద్రం (మొత్తం 116 అనువాకాలు) 1331 సార్లు పఠించబడుతుంది.

ఈ మహారుద్రాలు పదకొండు సార్లు అయితే ‘అతిరుద్రం’. దీనిలో 14641 మారులు రుద్రం చెప్పబడుతుంది.

ఈ రుద్రమంత్రాలను అభిషేకానికి వాడితే ‘రుద్రాభిషేకం! హోమంలో వినియోగిస్తే ‘రుద్రయాగం’. ఇవే ఆయా పేర్లలో ఉన్న విభిన్నార్ధాలు.

🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
homebanner పండుగలు

దసరా: హిందూమతంలో 9 రోజుల ప్రాముఖ్యత

  • September 30, 2024
దసరా, విజయదశమి అని కూడా పిలుస్తారు, ఇది నవరాత్రి అని పిలువబడే 9 రోజుల పాటు జరుపుకునే ప్రధాన హిందూ పండుగ. ప్రతి రోజు లోతైన ఆధ్యాత్మిక
blank
homebanner పండుగలు

బతుకమ్మ పండుగ: తెలంగాణకు ప్రాముఖ్యత

  • September 30, 2024
బతుకమ్మ తెలంగాణలో అత్యంత శక్తివంతమైన మరియు సాంస్కృతికంగా ముఖ్యమైన పండుగలలో ఒకటి, దీనిని ప్రధానంగా మహిళలు జరుపుకుంటారు. ఇది తెలంగాణ సాంస్కృతిక స్ఫూర్తిని సూచించే పూల పండుగ