సుఖం దుఃఖం తాత్కాలికమే – శివ తత్వం ద్వారా జీవన సత్యం

🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷
” సు/ధు: ” ఖం
సుఖం/ధు:ఖం ఎప్పుడు కూడా స్థిరంగా ఉండవు.
కొంత కాలం తరువాత, అదే సు – ధు: గా మారుతుంది..
కొంతమంది వ్యక్తులకు, ఒక విషయం ‘సు’ అవుతుంది, కానీ మరికొందరికి అదే ‘ధు’ అవుతుంది.
‘ఖ’ అంటే ఆకాశం
‘సు’ లేదా ‘ధు:’ పట్ల స్పందించకుండా మనం ‘ఖ’ లాగ ఉండాలి.
‘సు’ & “ధు:’ మన జీవితకాలంలో తిరుగుతూనే ఉంటాయి.
మన సనాతన ధర్మంలో ఇద్దరు వేర్వేరు దేవతలు ఉండరు.
బాధను సృష్టించడానికి ఒక దేవుడు
ఆ బాధను తగ్గించడానికి మరొక దేవుడు ఉండరు.
ఒకే ఒక్క దేవుడు మాత్రమే ఉంటాడు – అతడే ఈశ్వరుడు
శివుడే కష్టం ఇస్తాడు – శివుడే కష్టం నుండి బయట పడేలా చేస్తాడు
భయక్రుత్, భయ నాశనహ:
🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷
