homebanner

కాశీ వారణాసి యాత్ర పూర్తి గైడ్ – దర్శన క్రమం & ప్రయాణ సూచనలు

కాశీ వారణాసి యాత్ర పూర్తి గైడ్ – దర్శన క్రమం & ప్రయాణ సూచనలు

🕉️కొత్తగా వారణాసి వెళ్లేవారికి సూచనలు…!

వారణాసి వెళ్ళే వాళ్ళు ట్రైన్ దిగిన తర్వాత ఆంధ్ర ఆశ్రమాలు చాలా ఉన్నాయి…

సైకిల్ స్వామి ఆశ్రమంలో ఐతే మనిషికి 300 నుంచి ఛార్జ్ చేస్తారు. తారక రామ ఆశ్రమంలో ఐతే రూం కి 150 నుంచి మన కన్వీనెంట్ బట్టి ఛార్జ్ చేస్తారు ఎక్స్ట్రా మనిషికి 20ఛార్జ్ చేస్తారు. మధ్యాహ్నం భోజనం, ఈవెనింగ్ అల్పాహారం ఉంటుంది.

ఆశ్రమానికి వెళ్లిన తర్వాత ఉదయం ఆరు గంటలకు మీరు బయటకి వచ్చి మొదటగా కాల భైరవ స్వామి దర్శనం చేసుకొని, అక్కడ నుంచి వారాహి అమ్మ దర్శనానికి వెళ్ళండి. ఉదయం 9 గంటలలోపే వారాహి అమ్మ దర్శనం. ఆ తర్వాత అమ్మ దర్శనం ఉండదు. వారాహి అమ్మ గ్రామ దేవత.

అక్కడ నుంచి విశాలాక్షి అమ్మ గుడి దగరలో ఉంటుంది. అమ్మ దర్శనం చేసుకొని, విశాలాక్షి అమ్మ గుడి దగర నుంచి విశ్వనాథుని గుడికి
2 నిముషాలలో కాలి నడకన వెళ్లొచ్చు.

1వ నంబర్ గేట్ నుంచి వెల్లినట్లైతే సాక్షి గణపతినీ దర్శించుకోవచ్చు. డుంది గణపతి గుడి లోపల ఉంటుంది. స్వామి వారి దర్శనం 4 వ నంబర్ గేట్ నుంచి త్వరగా అవుతుంది. స్వామి దర్శనం చేసుకొని వచ్చాక లోపల అన్నపూర్ణమ్మ అమ్మ దర్శనం చేసుకోవచ్చు. అక్కడ పూజారికి 100 ఇస్తే అమ్మ వారిని తాకనిస్తారు.

అన్నపూర్ణమ్మ గుడి లోపలి నుంచి అన్న ప్రసాదానికి దారి ఉంటుంది. కచ్చితంగా అక్కడ భోజనం చేయాలి. గుడిలో మనకి అమ్మ ప్రసాదంగా ఒకతను, కొంచెం బియ్యం, ఒక coin (కాసు) ఇస్తారు. 100 రూపాయలు ఇవమంటారు. 50 రూపాయలు ఇచ్చినా కొందరు తీసుకుంటారు. ఆ కాసు మన ఇంట్లోనే బీరువాలో పెట్టుకోవాలి. బియ్యం మన ఇంట్లో మనం తెచుక్కున్న బియ్యం బస్తాలలో కొంచెం వేసుకొని మిగతాది బీరువాలో దాచుకోవాలి.

ఫోన్స్, వాల్లెట్స్ అనుమతించరు. ఒకవేళ తీసుకు వెళ్తే 4 వ నంబర్ గేట్ దగర దేవస్థానం వారి ఫ్రీ లాకర్ ఉంటుంది అక్కడ పెట్టుకోవచ్చు. సాయంత్రం 6 నుంచి 7 వరకు స్పర్శ దర్శనం ఉంటుంది. 7 కి హారతి సేవ ఉంటుంది. స్వామి దర్శనం ఆదివారాలు సోమవారాలు బాగా రద్దీగా ఉంటుంది.

దర్శనాలు అయిపోయాక మధ్యాహ్నం 1 నుంచి లోకల్ టెంపో మాట్లాడుకొని అన్ని చూసుకోవచ్చు. దుర్గమ్మ గుడి, గవ్వలమ్మ, మందిరం, బెనారుస్ యూనివర్సిటీలో టెంపుల్స్ హనుమాన్ టెంపుల్ ఇవన్నీ లోకల్ టెంపుల్స్ కి మనం మాట్లాడుకునే ఆటో వాళ్ళు చూపిస్తారు. మనిషికి 300 వరకు ఛార్జ్ చేస్తారు. అవి అన్నీ చూసుకునే సరికి సాయంత్రం 6 అవుతుంది. అక్కడ కు దగ్గర్లో ఉండే ఏదైనా ఘాట్ లలో గంగ హారతి చూసుకోవచ్చు. దశాశ్వమేధ ఘాట్, కేదార్నాథ్ ఘాట్ ఆశ్రమానికి దగ్గర్లోనే ఉంటాయి.

రెండవ రోజు ఘాట్లలో స్నానాలు చేసి పడవలు మాట్లాడుకుని 64 ఘాట్లు వెళ్ళటానికి,12 గంటలకి మణికర్ణిక ఘాట్ లో స్నానాలు చేయవచ్చు.

మణికర్ణిక ఘాట్లో స్నానాలు చేస్తే పితృ దేవతలకి మోక్షం లభిస్తుంది అంటారు. స్నానం చేసే సమయంలో మనసులోని కోరికలు నెరవేరుతాయి అంటారు.

మణికర్ణిక ఘాట్ విశ్వనాథ గుడి 4 వ నంబర్ గేట్ నుంచి కొంచెం ముందుకి నడుస్తూ వెళ్తే కుడి చేతి వైపు పెద్ద అర్చ్ కనిపిస్తుంది. దానిలో నుంచి నడుచు కుంటు వెళ్తే ఘాట్ కి వెళ్తాం. దాదాపు ఘాట్లు అన్ని పక్క పక్కనే ఉంటాయి.

వీలైతే కాలభైరవ టెంపుల్ నుంచి వచ్చేప్పుడు మహా మృత్యుంజయ గుడి, ఓంకారేశ్వర మకరేశ్వర్, ఆకరేశ్వర గుడులు చూసుకోవచ్చు. జంగం బాడీ మఠం దాటాక తిలబందేశ్వర్ గుడి ఉంటుంది. కుదిరితే లోలార్కు కుండ్ చూసుకోండి. హిందువులు అక్కడ ఎక్కువగా పుణ్య స్నానాలు ఆచరిస్తారు.

సూర్య భగవానుడు గుడి చిన్న గుడులు అక్కడ పక్కనే ఉంటాయి. దర్శనం చేసుకోండి. తర్వాత శివుని దర్శనం చేసుకోండి.

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
homebanner పండుగలు

దసరా: హిందూమతంలో 9 రోజుల ప్రాముఖ్యత

  • September 30, 2024
దసరా, విజయదశమి అని కూడా పిలుస్తారు, ఇది నవరాత్రి అని పిలువబడే 9 రోజుల పాటు జరుపుకునే ప్రధాన హిందూ పండుగ. ప్రతి రోజు లోతైన ఆధ్యాత్మిక
blank
homebanner పండుగలు

బతుకమ్మ పండుగ: తెలంగాణకు ప్రాముఖ్యత

  • September 30, 2024
బతుకమ్మ తెలంగాణలో అత్యంత శక్తివంతమైన మరియు సాంస్కృతికంగా ముఖ్యమైన పండుగలలో ఒకటి, దీనిని ప్రధానంగా మహిళలు జరుపుకుంటారు. ఇది తెలంగాణ సాంస్కృతిక స్ఫూర్తిని సూచించే పూల పండుగ