homebanner

కొత్తగా వారణాసి వెళ్లేవారికి సూచనలు

కొత్తగా వారణాసి వెళ్లేవారికి సూచనలు

🕉️ వారణాసి వెళ్ళే వాళ్ళు ట్రైన్ దిగిన తర్వాత ఆంధ్ర ఆశ్రమాలు చాలా ఉన్నాయి…

సైకిల్ స్వామి ఆశ్రమంలో ఐతే మనిషికి 300 నుంచి ఛార్జ్ చేస్తారు. తారక రామ ఆశ్రమంలో ఐతే రూం కి 150 నుంచి మన కన్వీనెంట్ బట్టి ఛార్జ్ చేస్తారు ఎక్స్ట్రా మనిషికి 20 ఛార్జ్ చేస్తారు. మధ్యాహ్నం భోజనం, ఈవెనింగ్ అల్పాహారం ఉంటుంది.

ఆశ్రమానికి వెళ్లిన తర్వాత ఉదయం ఆరు గంటలకు మీరు బయటకి వచ్చి మొదటగా కాల భైరవ ఆలయం దర్శనం చేసుకొని, అక్కడ నుంచి వారాహి అమ్మ ఆలయం దర్శనానికి వెళ్ళండి. ఉదయం 9 గంటలలోపే వారాహి అమ్మ దర్శనం. ఆ తర్వాత అమ్మ దర్శనం ఉండదు. వారాహి అమ్మ గ్రామ దేవత.

అక్కడ నుంచి విశాలాక్షి అమ్మవారి ఆలయం గుడి దగ్గరలో ఉంటుంది. అమ్మ దర్శనం చేసుకొని, అక్కడ నుంచి కాశీ విశ్వనాథ ఆలయం కి 2 నిమిషాలలో కాలి నడకన వెళ్లొచ్చు.

1వ నంబర్ గేట్ నుంచి వెళ్లినట్లైతే సాక్షి గణపతిని దర్శించుకోవచ్చు. డుంది గణపతి గుడి లోపల ఉంటుంది. స్వామి వారి దర్శనం 4వ నంబర్ గేట్ నుంచి త్వరగా అవుతుంది. స్వామి దర్శనం చేసుకొని వచ్చాక లోపల అన్నపూర్ణ దేవి ఆలయం దర్శనం చేసుకోవచ్చు. అక్కడ పూజారికి 100 ఇస్తే అమ్మ వారిని తాకనిస్తారు.

అన్నపూర్ణమ్మ గుడి లోపలి నుంచి అన్న ప్రసాదానికి దారి ఉంటుంది. కచ్చితంగా అక్కడ భోజనం చేయాలి. గుడిలో మనకి అమ్మ ప్రసాదంగా ఒకతను, కొంచెం బియ్యం, ఒక coin (కాసు) ఇస్తారు. 100 రూపాయలు ఇవమంటారు. 50 రూపాయలు ఇచ్చినా కొందరు తీసుకుంటారు. ఆ కాసు మన ఇంట్లోనే బీరువాలో పెట్టుకోవాలి. బియ్యం మన ఇంట్లో మనం తెచ్చుకున్న బియ్యం బస్తాలలో కొంచెం వేసుకొని మిగతాది బీరువాలో దాచుకోవాలి.

ఫోన్స్, వాల్లెట్స్ అనుమతించరు. ఒకవేళ తీసుకు వెళ్తే 4వ నంబర్ గేట్ దగ్గర దేవస్థానం వారి ఫ్రీ లాకర్ ఉంటుంది అక్కడ పెట్టుకోవచ్చు. సాయంత్రం 6 నుంచి 7 వరకు స్పర్శ దర్శనం ఉంటుంది. 7కి హారతి సేవ ఉంటుంది. స్వామి దర్శనం ఆదివారాలు, సోమవారాలు బాగా రద్దీగా ఉంటుంది.

దర్శనాలు అయిపోయాక మధ్యాహ్నం 1 నుంచి లోకల్ టెంపో మాట్లాడుకొని అన్ని చూసుకోవచ్చు. దుర్గ కుండ ఆలయం, గవ్వలమ్మ మందిరం, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం లోని టెంపుల్స్, హనుమాన్ టెంపుల్ ఇవన్నీ లోకల్ టెంపుల్స్ కి మనం మాట్లాడుకునే ఆటో వాళ్ళు చూపిస్తారు. మనిషికి 300 వరకు ఛార్జ్ చేస్తారు. అవి అన్నీ చూసుకునే సరికి సాయంత్రం 6 అవుతుంది. అక్కడకు దగ్గర్లో ఉండే ఏదైనా ఘాట్ లలో గంగ హారతి చూసుకోవచ్చు. దశాశ్వమేధ ఘాట్, కేదార్ ఘాట్ ఆశ్రమానికి దగ్గర్లోనే ఉంటాయి.

రెండవ రోజు ఘాట్లలో స్నానాలు చేసి పడవలు మాట్లాడుకుని 64 ఘాట్లు వెళ్ళటానికి, 12 గంటలకి మణికర్ణిక ఘాట్ లో స్నానాలు చేయవచ్చు.

మణికర్ణిక ఘాట్లో స్నానాలు చేస్తే పితృ దేవతలకి మోక్షం లభిస్తుంది అంటారు. స్నానం చేసే సమయంలో మనసులోని కోరికలు నెరవేరుతాయి అంటారు.

మణికర్ణిక ఘాట్ కాశీ విశ్వనాథ గుడి 4వ నంబర్ గేట్ నుంచి కొంచెం ముందుకు నడుస్తూ వెళ్తే కుడి చేతి వైపు పెద్ద అర్చ్ కనిపిస్తుంది. దానిలో నుంచి నడుచుకుంటూ వెళ్తే ఘాట్ కి వెళ్తాం. దాదాపు ఘాట్లు అన్ని పక్క పక్కనే ఉంటాయి.

వీలైతే కాలభైరవ టెంపుల్ నుంచి వచ్చేప్పుడు మహా మృత్యుంజయ ఆలయం, ఓంకారేశ్వర్ ఆలయం, ఆకరేశ్వర గుడులు చూసుకోవచ్చు. జంగం బాడీ మఠం దాటాక తిలభాండేశ్వర్ మహాదేవ ఆలయం ఉంటుంది. కుదిరితే లోలార్క్ కుండ్ చూసుకోండి. హిందువులు అక్కడ ఎక్కువగా పుణ్య స్నానాలు ఆచరిస్తారు.

సూర్య భగవానుడు గుడి, చిన్న గుడులు అక్కడ పక్కనే ఉంటాయి. దర్శనం చేసుకోండి. తర్వాత శివుని దర్శనం చేసుకోండి.

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
homebanner పండుగలు

దసరా: హిందూమతంలో 9 రోజుల ప్రాముఖ్యత

  • September 30, 2024
దసరా, విజయదశమి అని కూడా పిలుస్తారు, ఇది నవరాత్రి అని పిలువబడే 9 రోజుల పాటు జరుపుకునే ప్రధాన హిందూ పండుగ. ప్రతి రోజు లోతైన ఆధ్యాత్మిక
blank
homebanner పండుగలు

బతుకమ్మ పండుగ: తెలంగాణకు ప్రాముఖ్యత

  • September 30, 2024
బతుకమ్మ తెలంగాణలో అత్యంత శక్తివంతమైన మరియు సాంస్కృతికంగా ముఖ్యమైన పండుగలలో ఒకటి, దీనిని ప్రధానంగా మహిళలు జరుపుకుంటారు. ఇది తెలంగాణ సాంస్కృతిక స్ఫూర్తిని సూచించే పూల పండుగ