జీవనశైలి

అన్నం గురించి మంచి మనుషులు చెప్పిన గొప్ప మాటలు🙏

blank
  1. ” నేను వంటింట్లోకి వేరే పనిమీద వెళ్ళినా కూడా , వంట చేస్తున్న మా అమ్మగారు. “అన్నం పెట్టేస్తా నాన్నా. ఒక్క అయిదు నిముషాలు ” అనేవారు నొచ్చుకుంటూ- నేను అన్నం కోసం వచ్చాననుకుని ! …. ఎంతయినా అమ్మ అంటే అన్నం. …. అన్నం అంటే అమ్మ ! అంతే ! ( జంధ్యాల గారు ) .
  2. మంచి భోజనం లేని పెళ్ళికి వెళ్ళటం – సంతాప సభకి వెళ్ళిన దానితో సమానం ! ( విశ్వనాధ సత్యనారాయణ గారు ) .
  3. రాళ్లు తిని అరిగించుకోగల వయసులో వున్నప్పుడు తినటానికి మరమరాలు కూడా దొరకలేదు ! … వజ్రాలూ , వైడూర్యాలూ పోగేసుకున్న ఈ వయసులో మరమరాలు కూడా అరగట్లేదు ! అదే విధి ! ( రేలంగి వెంకట్రామయ్య గారు ) . 4. . ఆరు రోజుల పస్తులున్న వాడి ఆకలి కన్నా, మూడు రోజుల పస్తులున్న వాడి ఆకలి మరీ ప్రమాదం ! ఆహారం దొరికినప్పుడు ముందు వాడ్నే తిననివ్వాలి ! ( ముళ్ళపూడి వెంకటరమణ గారు ) .
  4. ఏటా వంద బస్తాల బియ్యం మాకు ఇంటికి వచ్చినా మా తండ్రిగారు అన్నీ మనవి కావు నాయనా ” మనల్ని నమ్ముకున్న వాళ్ళు రేయింబగళ్ళు కష్టపడి పని చేస్తేనే ఇవి మన ఇంటి వరకు వచ్చాయి.. అని బీదసాదలకి ధాన్యం చేటలతో పంచేసే వారు.. అన్నీ మనవి కావు అనటంలో వున్న వేదార్ధం నాకు పెద్దయితేనే గానీ అర్ధం కాలేదు ! ( ఆచార్య ఆత్రేయ గారు )
  5. అమ్మకి నేను అన్నం పెడుతున్నాను అనటం మూర్ఖత్వం ! అమ్మ చేతి అన్నం తింటున్నాను అని చెప్పగలిగినవాడు ధన్యుడు ! ( చాగంటి కోటేశ్వరరావు ) .
  6. ఆకలితో వున్న వాని మాటలకు ఆగ్రహించవద్దు !! (గౌతమ బుద్దుడు ).
  7. ఆత్మీయులతో కలసి తినే భోజనానికి రుచి ఎక్కువ ! పల్చని నీళ్ళ చారు కూడా అమృతంలా రుచిస్తుంది ! ( మాతా అమృతానందమయి )
  8. మీ పిల్లలు ఎంత దూరంలో, ఎక్కడ వున్నా , వేళ పట్టున ఇంత అన్నం తినగలుగుతున్నారంటే అది వాళ్ళ గొప్పా కాదూ , మీ గొప్పా కాదు …. మీ పూర్వీకులు చేసిన పుణ్యఫలమే అని గుర్తించుకుని మనం బ్రతకాలి..

ఎంతటి మంచి వాక్యాలు. ? తమ అనుభవ సారాన్ని మనకి పంచిన పెద్ద మనుషుల బాటలోనే మనం పయనిద్దాం !! సేకరణ… ✍️

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
జీవనశైలి

హిందూ రోజువారీ అభ్యాసాలలో యోగా మరియు ధ్యానం యొక్క పాత్ర

యోగా మరియు ధ్యానం కేవలం శారీరక లేదా మానసిక వ్యాయామాల కంటే చాలా ఎక్కువ – అవి స్వీయ-సాక్షాత్కారానికి మరియు అంతర్గత శాంతికి మార్గాలుగా హిందూ సంస్కృతిలో
blank
జీవనశైలి

హిందూ జీవితంలో జ్యోతిషశాస్త్రం పాత్ర

జ్యోతిష్యం, లేదా జ్యోతిషం, లక్షలాది మంది హిందువుల జీవితాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. పురాతన వేద జ్ఞానంలో పాతుకుపోయిన జ్యోతిష్ భవిష్యత్తును అంచనా వేయడానికి కేవలం ఒక