జీవనశైలి

స్నేహం: జీవితంలో అనుసరించాల్సిన శాశ్వత సంబంధం

blank

ప్రతి మనిషికి జ్ఞానం వచ్చాక స్నేహితులు అనేవారు ఏర్పడుతారు. కొంతమంది కాలక్రమేణా దూరం అవుతుంటే, కొత్తవారు మన జీవితంలోకి ప్రవేశిస్తారు. చిన్నతనం నుండి పెద్దల వరకు, స్కూలు నుండి ఉద్యోగం వరకు ప్రతి దశలోనూ స్నేహితులు మన ప్రయాణంలో ఒక భాగం.

పెద్దయ్యాక, పెళ్ళి అనేది ఒక కొత్త స్నేహంగా మారుతుంది. భర్త భార్యలు ఎప్పటికీ ఒకరికొకరు స్నేహితులుగా ఉండడం వలన దాంపత్య జీవితం మరియు స్నేహబంధం రెండూ బలపడుతాయి. వారి మధ్య ప్రేమ, అభిమానం, అనురాగం మరింత పెరిగి, వారి బంధం బలపడుతుంది.

స్నేహంలో ఎవరికి వారు వారి హద్దుల్లో ఉండటం చాలా ముఖ్యం. హద్దు మీరినప్పుడు స్నేహం ప్రమాదాల్లో పడుతుంది మరియు జీవితంలో అనుకోని విధంగా మార్చేస్తుంది. కాబట్టి, ఒక సరిహద్దులో ఉండటం వారి బంధాన్ని మరింత బలపడేలా చేస్తుంది.

చివరగా, భార్యాభర్తల మధ్య స్నేహం ఒక దృఢమైన అనుబంధంగా మారాలి. వారు స్నేహితులుగా ఉండడం వలన ఎన్నో సమస్యలను సులువుగా పరిష్కరించుకోవచ్చు, మరియు వారి బంధం మరింత బలపడుతుంది.

మల్లికార్జున దీక్షిత్ ఫ్యామిలీ కౌన్సిలర్ & కౌన్సిలింగ్ సైకాలజిస్ట్

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
జీవనశైలి

హిందూ రోజువారీ అభ్యాసాలలో యోగా మరియు ధ్యానం యొక్క పాత్ర

యోగా మరియు ధ్యానం కేవలం శారీరక లేదా మానసిక వ్యాయామాల కంటే చాలా ఎక్కువ – అవి స్వీయ-సాక్షాత్కారానికి మరియు అంతర్గత శాంతికి మార్గాలుగా హిందూ సంస్కృతిలో
blank
జీవనశైలి

హిందూ జీవితంలో జ్యోతిషశాస్త్రం పాత్ర

జ్యోతిష్యం, లేదా జ్యోతిషం, లక్షలాది మంది హిందువుల జీవితాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. పురాతన వేద జ్ఞానంలో పాతుకుపోయిన జ్యోతిష్ భవిష్యత్తును అంచనా వేయడానికి కేవలం ఒక