జీవనశైలి

హింస పెరుగుతున్న సమాజం – కారణాలు, ప్రభావాలు, పరిష్కారాలు!

మీ పిల్లలను మీరు రక్షించుకోలేకపోతే, సమాజం రక్షించదు!

తల్లిని చంపిన కొడుకు .. పిల్లల్ని చంపిన తల్లి ..

భార్యను చంపి కుక్కర్లో ఉడికించిన భర్త ..
భర్తను చంపి ముక్కముక్కలుగా నరికిన భార్య ..

టీచర్‌ను చంపిన విద్యార్థులు ..
విద్యార్థినిపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన టీచర్లు ..

పిల్లల్ని బకెట్లో ముంచి చంపిన తండ్రి ..
జూనియర్ విద్యార్థులపై విచక్షణా రహితంగా దాడి చేసిన హాస్టల్ విద్యార్థి ..

హింస .. నేటి స్థితి!

ప్రతి నిమిషం బ్రేకింగ్ హింసా వార్త!

🌍 పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రికి డిన్నర్ .. హింస కూడా అలానే మారిపోయింది!

ఇందుకు కారణాలు ఏమిటి?

1️⃣ హింసాత్మక వీడియో గేమ్స్

  • మోర్టల్ కంబాట్, సూపర్ మారియో, కెప్టెన్ టోడ్, ట్రెజర్ ట్రాకర్ …
  • చంపడం, నరకడం, తుపాకీ కాల్పులు, గుండె చీల్చడం, రక్తం ఏరులై పారడం … ఇప్పుడు వీటిని పిల్లలు గంటల తరబడి ఆడుతున్నారు!

2️⃣ సినిమాల్లో హింస ప్రేరేపణ

  • కె.జి.ఎఫ్, పుష్ప-2, అనిమల్, కిల్, మార్కో …
  • అల్లుఅర్జున్, బాలకృష్ణ, చిరంజీవి, రజనీకాంత్ – హింస లేకుండా సినిమాలు ఆడవు అన్న నమ్మకంతో..!

3️⃣ హింస జరగడాన్ని నిశ్శబ్దంగా చూడటం

  • రోడ్డుపై హత్య జరిగినా ఎవరూ ఆపే ప్రయత్నం చేయరు.
  • వీడియో తీసి సోషల్ మీడియాలో పెడతారు – జనాలు చప్పట్లు కొడతారు!

4️⃣ పిల్లల పెంపకం అటకెక్కింది

  • తల్లిదండ్రుల నిర్లక్ష్యం – తల్లి ఓటీటీలో బూతు చూస్తోంది, తండ్రి వాట్సాప్‌లో రాజకీయ చర్చలో మునిగిపోయాడు.
  • కుటుంబ వ్యవస్థను పట్టించుకునే వారు లేరు.

5️⃣ విద్యావ్యవస్థ తలకిందులైంది

  • పిల్లలకు ఎమోషనల్ ఇంటలిజెన్స్ నేర్పాల్సిన స్కూల్స్ – ఐఐటీ ఫౌండేషన్ పేరుతో బాల్యాన్ని నాశనం చేస్తున్నాయి!

6️⃣ రాజకీయాలు – హింసను ఆయుధంగా వాడుతున్నారు

  • కులం, మతం, ప్రాంతం పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారు!

7️⃣ సామాజిక జీవనం చచ్చిపోయింది

  • గ్రామాల్లో సాయంకాలం వేళకే తలుపులు వేసుకొని టీవీ ముందు కూర్చుంటున్నారు.
  • ఇంట్లో నలుగురైనా ఎవరి తలమీద వారే – చేతిలో మొబైల్, మాటల్లేవు!

8️⃣ మత్తుపదార్థాలకు బానిసైన సమాజం

  • తల్లిదండ్రులు బార్లలో, పిల్లలు గంజాయికి బానిసలు.

9️⃣ నిద్రలేమి – కోపానికి మూల కారణం

  • మొబైల్ వాడకంతో నిద్రలేమి, అది చిరాకు, కోపాన్ని పెంచుతుంది.

🔟 జంక్ ఫుడ్ – శారీరక, మానసిక ప్రభావం

  • D విటమిన్, మెగ్నీషియం, ఒమెగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ లోపం – హింసా ప్రవృత్తికి బీజం వేస్తుంది!

ఇంతైనా మార్పు వస్తుందా?

జనాలు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటే మార్పు ఉండదు!
మీరు మారండి – సమాజాన్ని మారుస్తారు!

మీరు చేయాల్సింది?

✔️ పిల్లల చేతిలో మొబైల్ తీసేయండి!
✔️ మీ మొబైల్ వాడకాన్ని తగ్గించండి!
✔️ హింసాత్మక సినిమాలను బహిష్కరించండి – ప్లాప్ అయితే ఇక తీయరు!
✔️ పిల్లల స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించండి – సంపూర్ణ విద్య అందించమని డిమాండ్ చేయండి!
✔️ సెన్సార్ బోర్డును తిరిగి లేపండి – హింస, బూతు, గంజాయి పట్ల ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయండి!
✔️ రాజకీయ నాయకులను నిలదీయండి – వారు ఎందుకు హింసపై మాట్లాడటం లేదు?
✔️ సామాజిక ఉద్యమాన్ని మొదలు పెట్టండి – హాష్‌ట్యాగ్ క్యాంపెయిన్ చేయండి!

🚨 నేటి బాలల భవిష్యత్తు ప్రమాదంలో ఉంది!
🛑 మన పిల్లల భద్రత మన చేతుల్లోనే ఉంది!

“మీ పిల్లలను మీరు రక్షించుకోలేకపోతే, సమాజం రక్షించదు!”

📢 విశ్వావసునామ సంవత్సరం – యుగాది శుభాకాంక్షలతో!

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
జీవనశైలి

హిందూ రోజువారీ అభ్యాసాలలో యోగా మరియు ధ్యానం యొక్క పాత్ర

యోగా మరియు ధ్యానం కేవలం శారీరక లేదా మానసిక వ్యాయామాల కంటే చాలా ఎక్కువ – అవి స్వీయ-సాక్షాత్కారానికి మరియు అంతర్గత శాంతికి మార్గాలుగా హిందూ సంస్కృతిలో
blank
జీవనశైలి

హిందూ జీవితంలో జ్యోతిషశాస్త్రం పాత్ర

జ్యోతిష్యం, లేదా జ్యోతిషం, లక్షలాది మంది హిందువుల జీవితాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. పురాతన వేద జ్ఞానంలో పాతుకుపోయిన జ్యోతిష్ భవిష్యత్తును అంచనా వేయడానికి కేవలం ఒక