జీవనశైలి

వివాహం – జీవితానికి శాశ్వతమైన బంధం

blank

జీవితం అన్నాక ఎన్నో పనులు చెయ్యవలసి వస్తుంది. వాటిలో వివాహం కూడా ఒక ముఖ్యమైన ఘట్టం.

చిన్నప్పుడు అమ్మను వదిలి బడికి వెళ్లడం ఇష్టం ఉండదు. కానీ అలవాటు కాగానే ఉన్నత విద్యలు చదివిన వారు కూడా ఉన్నారు, చదువు మధ్యలో ఆపేసినవారు కూడా ఉన్నారు. ఆటలు, భోజనం, టిఫిన్—చాలా పనులు మొదలుపెట్టి మధ్యలో వదిలేసిన ఉదాహరణలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి.

అలాగే వివాహం కూడా ప్రతి మనిషికి తప్పనిసరి. ధనిక–పేద తేడాలు లేకుండా యుక్తవయసులోనే జరగాలి. సంబంధం ఎంచుకునేటప్పుడు ధనార్జన పరులను ప్రాధాన్యంగా తీసుకోవాలి, కానీ ఆస్తి–పాస్తులు, జాతకాలు, శాఖల విషయంలో కొంత రాజీ పడాలి. లేకపోతే వివాహం జరగడం కష్టమవుతుంది.

ఐస్‌క్రీమ్‌ను తిన్నా కరిగిపోతుంది, తినకపోయినా కరిగిపోతుంది. అలాగే “ఫ్రిజ్‌లో పెట్టి తర్వాత తింటాను” అనే వాదనలతో సమయం వృథా చేసుకోవద్దు.

వివాహం అనేది జీవితాంతం తోడుగా నిలిచి, కష్టసుఖాలు పంచుకునే భాగస్వామిని అందిస్తుంది. భార్యాభర్తల మధ్య మాటల్లో మధురిమ ఉంటుంది, అది కేవలం స్నేహితుల మధ్య సాధ్యం కాదు. ఇద్దరి మధ్య ఉండే స్పర్శలో ఎన్నో అనుభూతులు దాగి ఉంటాయి.

మన తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చినట్లే, మనమూ సంతానం ద్వారా దేశానికి భావి పౌరులను అందించాలి. ఇది ప్రతి యువతకు ఉన్న పవిత్రమైన బాధ్యత.

నేను ఒక కుటుంబ కౌన్సిలర్‌గా మనస్ఫూర్తిగా చెప్పదలచుకున్నది ఏమిటంటే—నా దగ్గర కౌన్సిలింగ్‌కి వచ్చిన జంటల్లో ఇప్పటివరకు ఎవరూ విడిపోలేదు. అందరూ సంతోషంగా కలిసే వెళ్లారు. కాబట్టి:

  • వివాహంలో రాజీ పడే స్వభావం కలిగి ఉండండి.
  • భార్యాభర్తల బంధాన్ని కంటికి రెప్పలా కాపాడుకోండి.
  • తల్లిదండ్రులు జీవితాంతం మనతో ఉండరు, కానీ భార్యాభర్తలు ఎక్కువకాలం కలసి జీవిస్తారు.

సినిమాలో హీరో లేదా హీరోయిన్ లేకపోతే చూడ్డానికి మనకు ఇష్టం ఉండదు. అలాగే జీవితంలో భార్య లేదా భర్త లేకపోతే జీవితం అసంపూర్ణం అవుతుంది. విడాకులు అనే ఆప్షన్ ఉన్నా, దానిని ఎంచుకోవద్దని నా మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

అందుకే—
నేటి యువత జీవితంలో స్థిరపడిన వెంటనే వివాహం చేసుకోవాలి. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల వివాహం జరిపించాలి.

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
జీవనశైలి

హిందూ రోజువారీ అభ్యాసాలలో యోగా మరియు ధ్యానం యొక్క పాత్ర

యోగా మరియు ధ్యానం కేవలం శారీరక లేదా మానసిక వ్యాయామాల కంటే చాలా ఎక్కువ – అవి స్వీయ-సాక్షాత్కారానికి మరియు అంతర్గత శాంతికి మార్గాలుగా హిందూ సంస్కృతిలో
blank
జీవనశైలి

హిందూ జీవితంలో జ్యోతిషశాస్త్రం పాత్ర

జ్యోతిష్యం, లేదా జ్యోతిషం, లక్షలాది మంది హిందువుల జీవితాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. పురాతన వేద జ్ఞానంలో పాతుకుపోయిన జ్యోతిష్ భవిష్యత్తును అంచనా వేయడానికి కేవలం ఒక