ఆధ్యాత్మికత

దేవుడంటే ఏంటి? పూజ చేయకపోతే ఏమవుతుంది? | పూజ వెనుక శాస్త్రీయ భావనలు

దేవుడంటే ఏంటి? పూజ చేయకపోతే ఏమవుతుంది? | పూజ వెనుక శాస్త్రీయ భావనలు

దేవుడంటే ఏంటి?
పూజ చేయకపోతే ఏమవుతుంది?

ఇది చిన్నపిల్లలే కాదు… నేడు చదువుకున్న పెద్దవాళ్లూ అడిగే ప్రశ్న. చాలామంది వెంటనే “అలా మాట్లాడితే కళ్లుపోతాయి” అంటారు. కానీ అది నిజమైన సమాధానం కాదు.

దేవుడు శిక్షించేందుకు కూర్చున్నవాడు కాదు.
అలా చెప్పడం వల్ల తెలియని వారిలో భయం పెరిగి దేవునిపై దూరం కలగొచ్చు.

పూజ అనేది ఒక యోగ ప్రక్రియ — మనసుతో చేసే వ్యాయామం.

ఇది మెదడును క్రమబద్ధం చేసి ఏకాగ్రత, జ్ఞానం పెంచుతుంది.

మంత్ర జపం నాలుకకు వ్యాయామం, మాట స్పష్టత, ధారణశక్తి, భయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

అందుకే పూజ అనేది చాదస్తం కాదు —
ఆరోగ్యం, జ్ఞానం, మానసిక సమతుల్యతకు సంబంధించిన సాధన. హిందూ ధర్మాన్ని గౌరవించాలి… పాటించాలి

ఆచారాల వెనుక శాస్త్రీయ భావనలు — మందిరం

👉🏻 మూలవిరాట్ — భూమిలో శక్తి తరంగాలు కూడే ప్రాంతంలో ప్రతిష్ఠ. రాగి రేకులు ఆ తరంగాలను గ్రహించే మధ్యవర్తులు.

👉🏻ప్రదక్షిణ — clockwise గా తిరగడం ద్వారా శక్తి ప్రభావం శరీరానికి చేరుతుంది. వేద నిర్మాణం శరీరంలోని చక్రాలను ఉత్తేజితం చేస్తుంది.

👉🏻ఆభరణాలతో దర్శనం — బంగారం వంటి లోహాలు శక్తి తరంగాలను గ్రహించడంలో సహాయపడతాయి.

👉🏻 కొబ్బరికాయ — అహంకారాన్ని విడిచిపెట్టి స్వచ్ఛమైన మనసుతో జీవించడాన్ని సూచించే సంకేతం.

👉🏻మంత్రోచ్చారణ — లయబద్ధ ధ్వని మెదడు నాడులను ఉత్తేజితం చేసి జ్ఞాపకశక్తి పెంచుతుంది.

👉🏻గర్భగుడి నిర్మాణం — ద్వారం అమరిక శక్తి ప్రవాహాన్ని శరీరానికి చేరేలా చేస్తుంది.

👉🏻అభిషేకం — పంచలోహ విగ్రహాలపై చేసే అభిషేకం ఔషధ గుణాలను సంతరించుకుంటుందని నమ్మకం.

👉🏻హారతి — కర్పూరం వేడి, సువాసన శరీరానికి, కళ్లకు ఉపశమనం ఇస్తుంది.

👉🏻తీర్థం — తులసి, కర్పూరం, పంచామృతం — ఆరోగ్యానికి ఉపకారం.

ఆచారం అంటే మూఢనమ్మకం కాదు — అవగాహనతో ఆచరించిన జీవన విధానం.

🙏 శ్రీ సద్గురు పీఠం ద్వారా….✍️
సర్వే జనాః సుఖినోభవంతు 🙏

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
ఆధ్యాత్మికత

హిందూ జీవితంలో ఆధ్యాత్మిక పరిణామంలో కర్మ మరియు దాని పాత్ర

హిందూ తత్వశాస్త్రంలో కర్మ అనేది అత్యంత లోతైన మరియు పునాది భావనలలో ఒకటి. ఇది తరచుగా “చుట్టూ జరిగేది, చుట్టూ వస్తుంది” అని తప్పుగా అర్థం చేసుకోబడుతుంది,
blank
ఆధ్యాత్మికత

ఆధ్యాత్మిక మేల్కొలుపులో గురువుల పాత్ర

There are many variations of passages of Lorem Ipsum available but the majority have suffered alteration in that some injected