ఆధ్యాత్మికత

జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది?

జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది?

భగవంతుని యందు భక్తి భావన వల్ల కొంత వియోగం దుఃఖము అనుభవింప వలసి వస్తుంది.
( రూప నామములే నమ్మి నందు వల్ల)అది కూడా మార్గమే!… అందువల్ల “అంతర్యామిగా మీరు నన్ను చూసి నట్లయితే, అప్పుడు మీకు వియోగ దుఃఖము ఉండదు, మనస్సు లో శాంతి ననుభవిఁపగలరు,” అని ఈశ్వర తత్వాన్ని గోపి కలకు చెప్పాడు కృష్ణ పరమాత్మ.

ఇది మనందరికీ శిరోధార్యములైన మాట!!…
లోకంలో భూత ప్రేత పిశాచాలను ఆరాధనచేసి నిధులు పొందిన వారున్నారు.
అవి ఈశ్వరుడే ఇవ్వవలసిన అవసరం లేదు.
మరి భక్తులకు ఆయన ఏమి ఇస్తాడు అంటే!!… ఎవ్వరూ ఇవ్వలేని వస్తువునే ఆయన ఇవ్వాలి మరి.
అది సృష్టి లో ఇంకెవ్వరూ ఇవ్వలేరు ఈశ్వరుడు తప్ప, అట్టి వస్తువునే తానివ్వాలి.
అదే ఆయన అధికారానికి తగినట్లుంటుంది.
అట్టి వస్తువు ఏమిటంటే!!… అది జ్ఞానమే!
చరిత్రలో అనేక మంది భక్తులు దరిద్రాన్ని అనుభవించారు, అయినా వాళ్ళు ఆయన కనపడినా కూడా ధనం అడగలేదు.
ఈశ్వరానుగ్రహాన్ని, జ్ఞానాన్ని మాత్రమే కోరుకున్నారు, పొందారు.
తాను అనుభవించే సుఖ దుఃఖా లు, తన చేసుకున్న కర్మ ఫలితాలే అనే జ్ఞానం కలగాలి.
ఈ రెండింటియందూ సమ భావం తో ఉండాలి.
ఈ ప్రకారంగా తెలుసుకుని, చివరకు నేనే దైవం, శత్రువులు, మిత్రులు ఎవరూ లేరు, అందరూ దైవస్వరూపులే !… నేనే దైవం అనే జ్ఞానం కలుగుతుంది.

 శుభమస్తు

🙏 శ్రీ సద్గురు పీఠం ద్వారా…✍️
సమస్త లోకా సుఖినోభవంతు 🙏

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
ఆధ్యాత్మికత

హిందూ జీవితంలో ఆధ్యాత్మిక పరిణామంలో కర్మ మరియు దాని పాత్ర

హిందూ తత్వశాస్త్రంలో కర్మ అనేది అత్యంత లోతైన మరియు పునాది భావనలలో ఒకటి. ఇది తరచుగా “చుట్టూ జరిగేది, చుట్టూ వస్తుంది” అని తప్పుగా అర్థం చేసుకోబడుతుంది,
blank
ఆధ్యాత్మికత

ఆధ్యాత్మిక మేల్కొలుపులో గురువుల పాత్ర

There are many variations of passages of Lorem Ipsum available but the majority have suffered alteration in that some injected