ఆధ్యాత్మికత

కార్తీక పూర్ణిమ మరియు జ్వాలా తోరణం

karthika-pournami-and-jwala-toranam

పౌర్ణమి ప్రతి నెలా వస్తుంది కానీ చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసి ఉండే కార్తీకపౌర్ణమికి ఉండే ప్రత్యేకత మరే పౌర్ణమికీ ఉండదు.

కార్తీకశుద్ద పౌర్ణమి (లేదా కార్తీకపౌర్ణమి) అంటే కార్తీకమాసంలో శుక్లపక్షంలో పున్నమి తిథి కలిగిన పదిహేనవ రోజు. కార్తీకమాసంలో పౌర్ణమి రోజును చాలా పవిత్రమైనదిగా భావిస్తారు, ఏడాది మొత్తం మీద చంద్రుడు కార్తీకపౌర్ణమి రోజున ఉన్నంత ప్రకాశంగా మరే రోజూ ఉండడు.


కార్తీక పౌర్ణమి: దేవ దీపావళి

కార్తీక పౌర్ణమిని దేవ దీపావళి అని కూడా అంటారు. త్రిపుర పౌర్ణమి, దేవ దీపావళి అని పిలవడానికి గల కారణం వెనుక ఒక కథ ఉంది.

పూర్వం త్రిపురాసురుడు అనే రాక్షసుడు…

  • అంతరిక్షంలో మూడు పట్టణాలను నిర్మించుకుని సర్వసుఖాలు అనుభవించేవాడు.
  • బలగర్వంతో దేవతలను, ఋషులను, మునులను హింసిస్తూ ఉండేవాడు.
  • దేవతలు మునులు ఋషులు అంతా కలిసి పరమశివుడిని ప్రార్థించారు.
  • పరమశివుడు మూడు రోజుల పాటు త్రిపురాసురుడితో యుద్ధం చేసి సంహరించాడు.
  • త్రిపుర సంహారం తర్వాత దేవతలు అందరూ దీపాలు వెలిగించి పండుగ జరుపుకున్నారు.

ఈ రోజునే శ్రీమహావిష్ణువు మత్స్యఅవతారం ఎత్తింది

  • వృందాదేవి తులసి మొక్కగా అవతరించింది.
  • దత్తాత్రేయుడు పుట్టింది ఈ రోజే.

జ్వాలా తోరణం: హాలాహల విషం కథ

దేవతలు, రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని చిలికినప్పుడు…

  • ముందుగా హాలాహలం ఉద్భవించింది.
  • ఇది లోకాలను సర్వనాశనం చేసే ప్రమాదం ఉన్నందున, బ్రహ్మాదులు ఈ ఉత్పాదం నుండి రక్షించమని పరమశివుడిని ప్రార్థించారు.
  • వారి ప్రార్థనను మన్నించిన పరమశివుడు ఆ హాలాహలాన్ని మ్రింగడానికి సిద్ధపడ్డాడు.
  • ఆ హాలాహలం బయట ఉంటే పైలోకాలకు, కడుపులోపలికి వెళితే అధోలోకాలను దహించివేస్తుందని అనే ఉద్దేశ్యంతో మహాశివుడు ఆ విషాన్ని కంఠం మధ్యలోనే నిక్షేపించాడు.
  • అందుకే పరమశివుడు గరళకంఠుడు/నీలకంఠుడు అయ్యాడు.

కార్తీకపౌర్ణమి రోజు శివుడికి, మహావిష్ణువుకి కూడా ప్రియమైన రోజు.


కార్తీక పౌర్ణమి ఆచారాలు: దీపారాధన మరియు పుణ్యాలు

ఈ రోజున దేవాలయంలో దీపం వెలిగిస్తే మతిసీ తెలియక చేసిన పాపాలు అన్నీ హరించుకుపోతాయని నమ్మకం.

  • రుద్రాభిషేకం చేస్తారు.
  • శివకేశవుల భక్తులు ఈ రోజు పగటిపూట అంతా ఉపవాసం ఉండి సాయంత్రం 365 వత్తులతో దీపాన్ని వెలిగిస్తారు.
    • రోజుకి ఒక ఒత్తి చొప్పున ఏడాది అంతా సూచిస్తాయి.
  • కొందరు ఈ దీపాలను అరటి దొన్నెలపై వెలిగించి నదిలో, చెరువులలో, కాలువలలో వదిలిపెడతారు.
  • నదులు, చెరువులు, కాలువలు లేని ప్రదేశాలలో తులసి కోట లేకపోతే దేవుడి ముందు వెలిగిస్తారు.

కార్తీకపౌర్ణమి రోజున శివాలయంలోగాని, విష్ణు ఆలయంలో గాని దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలను పూజించిన ఫలమే కాక అన్ని పుణ్యనదులలో స్నానం చేసిన ఫలం లభిస్తుంది.

  • ఉసిరికాయలు దానం చేయడం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది.
  • లలితాదేవిని సహస్ర నామాలతో పూజిస్తే ఆ దేవి సకల ఐశ్వర్యాలు కలిగిస్తుంది.
  • ఈ పర్వదినాన సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం మహా శ్రేష్టం అని కొన్ని పురాణాలు చెబుతున్నాయి.

దీపాలను వెలిగించే సమయంలో చెప్పుకోవలసిన స్తోత్రం

కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః జలే స్థలే యే నివసంతి జీవాః దృష్ట్యా ప్రదీపం నచ జన్మ భాగినః భవన్తి త్వం శ్వపచాపి విప్రాః

అర్థం: ఈ దీపం చూసి న ప్రభావం చేత కీటకాలు, పక్షులు, దోమలు, చెట్లు, మొక్కలు, ఉభయచరాలు అన్ని కూడా, అవి ఏ రూపాలలో ఉన్నాయో, ఆ రూపాలలోనే అవి మోక్షం పొందాలని, వాటికి మరుజన్మ ఉండకూడదని ప్రార్థిస్తున్నా.

ఎంతో పుణ్యం చేసుకుంటే మనిషి జన్మ వస్తుంది

  • ఈ జన్మలో మనం బుద్ధి ఉపయోగించి, వేదం చెప్పినట్లు బ్రతికి, జ్ఞానం పొంది మోక్షం పొందవచ్చు.
  • కానీ మిగతా జీవులకు అటువంటి అవకాశం లేదు కాబట్టి ఈ ప్రకృతిలో ఉన్న జీవరాశి ఏదో ఒక రకంగా ఉపకారం చేస్తూనే ఉంటాయి.
  • వాటికి ప్రత్యుపకారం చేయడం మన విధి, ధర్మం కూడా. వాటికి ప్రత్యుపకారం చేయడం కోసం మనలాగా అవి భగవంతుడిని చేరుకోవడం కోసం దీపాన్ని వెలిగించి, ఈ స్తోత్రాన్ని చదవాలి.

కార్తీక పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతం చేయడం ఎంతో శ్రేష్టం.


🌹 ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ 🌹 హర హర హర మహాదేవ శుభమస్తు 🙏

శ్రీ సద్గురుపీఠం లోకా సమస్త సుఖినోభవంతు 🙏


ఈ పవిత్ర రోజు మీ జీవితాన్ని దైవిక ప్రకాశంతో నింపాలని ప్రార్థిస్తున్నాము. మరిన్ని ఆధ్యాత్మిక ఆచారాలు మరియు కథల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. హిందుటోన్ టీమ్ | www.hindutone.com

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
ఆధ్యాత్మికత

హిందూ జీవితంలో ఆధ్యాత్మిక పరిణామంలో కర్మ మరియు దాని పాత్ర

హిందూ తత్వశాస్త్రంలో కర్మ అనేది అత్యంత లోతైన మరియు పునాది భావనలలో ఒకటి. ఇది తరచుగా “చుట్టూ జరిగేది, చుట్టూ వస్తుంది” అని తప్పుగా అర్థం చేసుకోబడుతుంది,
blank
ఆధ్యాత్మికత

ఆధ్యాత్మిక మేల్కొలుపులో గురువుల పాత్ర

There are many variations of passages of Lorem Ipsum available but the majority have suffered alteration in that some injected