శ్రీరామనవమి నాడు అర్ఘ్యప్రదానం

పూజానంతరం ‘రామస్య జననీ చాఽసి రామాత్మకమిదం జగత్, అతస్త్వాం పూజయిష్యామి లోకమాతర్నమోస్తుతే’… అని కౌసల్యాదేవిని దశరథ సహితంగా నమస్కరించాలి. పిదప ఈ శ్లోకములతో గంధపుష్పాక్షతలు కలిసిన నీటితో అర్ఘ్యమివ్వాలి:
దశానన వధార్థాయ ధర్మసంస్థాపకాయ చ దానవానాం వినాశాయ దైత్యానాం నిధనాయ చ |
పరిత్రాణాయ సాధూనాం జాతో రామస్స్వయం హరిః గృహాణార్ఘ్యం మయాదత్తం భ్రాతృభిస్సహితో ఽనఘ ||
శ్రీరామనవమీ ప్రోక్తా కోటిసూర్యగ్రహాధికా తస్మిన్ దినే మహాపుణ్యే రామముద్దిశ్య భక్తితః యత్కించిత్ క్రియతే కర్మ తద్భవత్యక్షయకారణం!
ఉపోషణం జాగరణం పిత్రూనుద్దిశ్య తర్పణం తస్మిన్ దినేతు కర్తవ్యం బ్రహ్మావాప్తిమభీష్సు భిః ॥
🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹
శ్రీరామ నవమి నాడు మకుట ధారణ సర్గ చదవాలి అని శాస్త్రంలో ఉన్నది. ఆరోజు పూర్ణ ఉపవాసము ఉండి అనగా అన్నము తినకుండా, దేవాలయముల ముందు నిలబడి భజన చేసి మధ్యాహనము అందరూ కలసి సీతారామప్రభువుని పూజించి, సాయంకాలము శ్రీరామయణములోని రామచంద్రమూర్తికి కిరీటము పెట్టిన ఘట్టము మకుటధారణ సర్గ చదువుతారు.
మకుట ధారణ సర్గ శ్లోకములు
బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితమ్
అభిషిక్తః పురా యేన మనుస్తం దీప్తతేజసమ్
తస్యాన్వవాయే రాజానః క్రమాద్యేనాభిషేచితాః
సభాయాం హేమక్లుప్తాయాం శోభితాయాం మహాధనైః
రత్నైర్నానావిధైశ్చైవ చిత్రితాయాం సుశోభనైః
నానారత్న మయే పీఠే కల్పయిత్వా యథావిధి
కిరీటేన తతః పశ్చాద్వసిష్ఠేన మహాత్మనా
ఋత్విగ్భిర్భూషణైశ్చైవ సమయోక్ష్యత రాఘవః
శ్రీరామ పట్టాభిషేకము జరిగేటప్పుడు కిరీటము ఆనాడు వశిష్ఠ మహర్షి పెట్టారు. ఇప్పుడూ శ్రీరామ పట్టాభిషేకము చేస్తూ ఉంటారు. చేసేటప్పుడు అలా పెట్టే ఆ కిరీటములు ఎవరు చూస్తారో వాళ్ళకి వస్తున్న కష్టములు పోతాయి. మకుటధారణ సర్గ అంత గొప్పది.
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
