రాశి ఫలితాలు

10-08-2025 | ఆదివారం I రాశి ఫలితాలు

blank

♈ మేషం

ఇంటి–బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరం అవుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. ధన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు అనుకూలం కావు. వృత్తి–వ్యాపారాలలో ఇతరులతో విభేదాలు కలుగుతాయి. ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది.


♉ వృషభం

ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. దీర్ఘకాలిక రుణభారం కొంత వరకు తగ్గి ఊరట కలుగుతుంది. నూతన ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. గృహంలో శుభకార్య ప్రస్తావన వస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగంలో అధికారుల సహాయం లభిస్తుంది.


♊ మిధునం

అనారోగ్య సమస్యలు కలుగుతాయి. మిత్రులతో మాటపట్టింపులు తప్పవు. పనులు ముందుకు సాగక చికాకు పెరుగుతుంది. వృత్తి–ఉద్యోగాలు సాధారణంగా సాగుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. దూర ప్రయాణాల వలన విశ్రాంతి ఉండదు. ఇంటి–బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి.


♋ కర్కాటకం

స్థిరాస్తి క్రయ–విక్రయాలు లాభదాయకంగా సాగుతాయి. వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. చిన్ననాటి మిత్రుల నుండి ఆసక్తికర విషయాలు తెలుసుకుంటారు. వృత్తి–ఉద్యోగాలలో మీ పనితీరుకు ప్రశంసలు అందుతాయి.


♌ సింహం

ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. సన్నిహితులతో విందు–వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన పనులను కుటుంబ సభ్యుల సహాయంతో పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి.


♍ కన్య

బంధుమిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయరాదు. వృత్తి–వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన కార్యక్రమాలలో ఆటంకాలు తప్పవు. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. ఉద్యోగంలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.


♎ తుల

ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపార ఆలోచనల్లో నిలకడ లోపిస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. నూతన రుణాలు చేయవలసి వస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులు అధికారులతో అప్రమత్తంగా ఉండాలి.


♏ వృశ్చికం

సమాజంలోని ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. నిరుద్యోగ యత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో అధికారులతో చర్చలు లాభదాయకంగా సాగుతాయి. చేపట్టిన పనులు సజావుగా పూర్తి అవుతాయి. ఆర్థిక పురోగతి సాధిస్తారు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఆలయ దర్శనాలు చేస్తారు.


♐ ధనుస్సు

చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి. వృత్తి–ఉద్యోగాలలో పలుకుబడి పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి, కొత్త అవకాశాలు వస్తాయి.


♑ మకరం

నూతన వ్యాపారాలు నిరుత్సాహం కలిగిస్తాయి. ఆర్థిక విషయాలలో సన్నిహితుల ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో అవరోధాలు ఉంటాయి. స్వల్ప అనారోగ్యం కలుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి–ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.


♒ కుంభం

ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. కొన్ని విషయాలలో మానసిక సమస్యలు ఉంటాయి. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు స్వల్ప లాభాన్ని ఇస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.


♓ మీనం

గౌరవ–మర్యాదలు పెరుగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు కార్యసిద్ధి సాధిస్తాయి. సమాజంలో వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం కలుగుతుంది.


🍁 శుభం భూయాత్ 🍀

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
రాశి ఫలితాలు

20-06-2025 | శుక్రవారం | రాశి ఫలితాలు – శ్రీ గురుభ్యోనమఃముక్తినూతలపాటి వాసు

మేషంస్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి వ్యాపారాల్లో ఊహించని అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది. నిరుద్యోగుల శ్రమ వృధాగా
blank
రాశి ఫలితాలు

22-06-2025 రాశి ఫలితాలు | ఆదివారం జ్యోతిష్యం

🌿 ముక్తినూతలపాటి వాసు గారు అందించిన దిన ఫలితాలు🙏 శ్రీ గురుభ్యోనమః 🔴 మేషందూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. స్థిరాస్తి లావాదేవీలలో లాభాలు. వాహన వ్యాపారాలు మంచి లాభాలు