29–11–2025, శనివారం — రాశి ఫలితాలు

మేషం ♈
వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఇతరుల వల్ల సమస్యలు ఎదురవుతాయి. నూతన ఋణాలు చేయాల్సి వచ్చే అవకాశం ఉంది. వృథా ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు వాయిదాపడతాయి. దైవ చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు చోటుచేసుకుంటాయి.
వృషభం ♉
ఉద్యోగస్తులకు ఉన్నత హోదాలు లభిస్తాయి. ప్రతి రంగంలోనూ ఉత్సాహం పెరుగుతుంది. స్నేహితులతో సఖ్యత బలపడుతుంది. విలువైన వస్తువులు, వాహనాల కొనుగోలు సాద్యమవుతుంది. చిన్ననాటి మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత వేగంగా సాగుతాయి.
మిధునం ♊
వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. వృథా ఖర్చులు మరింత పెరుగుతాయి. ఉద్యోగ వాతావరణం చికాకు కలిగిస్తుంది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబసభ్యులతో చిన్నపాటి వివాదాలు తలెత్తుతాయి.
కర్కాటకం ♋
ఆకస్మిక ధనలాభం సూచన ఉంది. ఇంటి–బయటి పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగ–వృత్తుల్లో కొన్ని మంచి సంఘటనలు జరుగుతాయి. వ్యాపార విస్తరణ పథకాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. స్నేహితులతో ఉన్న వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
సింహం ♌
ఇంట్లో కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. చేపట్టిన పనులు సులభంగా పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు అనుకూల వాతావరణం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.
కన్య ♍
బంధువులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. సోదరులతో ఒక విషయంపై సఖ్యత లోపిస్తుంది. వ్యాపారాలు స్తబ్ధుగా సాగుతాయి. ఉద్యోగుల్లో ఒత్తిడి పెరుగుతుంది. దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది.
తుల ♎
ఉద్యోగస్తులకు నిరుత్సాహం తలెత్తుతుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ముఖ్యమైన పనులు నిరాశ కలిగిస్తాయి. శ్రమ ఎక్కువగా పడుతుంది. వ్యాపారాల్లో గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వృశ్చికం ♏
గుర్తింపు, గౌరవం పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో సఖ్యత బాగుంటుంది. లాభదాయక పరిస్థితులు నెలకొంటాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పలుకుబడి ఉన్నవారితో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి.
ధనస్సు ♐
ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు. సంతానం విద్య–ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలిస్తాయి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. కొత్త పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి.
మకరం ♑
ఉద్యోగస్తులకు స్థానచలనం సూచిస్తుంది. ఆదాయం తక్కువగానే ఉంటుంది. స్నేహితులతో విభేదాలు చికాకు కలిగిస్తాయి. వ్యాపారాలలో ఆటుపోట్లు తప్పవు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. వృథా ఖర్చులపై జాగ్రత్త అవసరం. పనుల్లో శ్రమ ఎక్కువగా ఉంటుంది.
కుంభం ♒
దేవాలయ దర్శనాలు చేస్తారు. నూతన వాహనయోగం ఉంది. ఆకస్మిక ధనలాభం సంభవిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు శుభవార్తలు వస్తాయి. పనుల్లో అనుకోని సానుకూలత ఉంటుంది. శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి.
మీనం ♓
సంతానం వివాహ ప్రయత్నాలు ఆలస్యమవుతాయి. ముఖ్య కార్యక్రమాలు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగాల్లో ఊహించని మార్పులు సంభవిస్తాయి. బంధువులతో విభేదాలు బాధిస్తాయి. కుటుంబ ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.
