02 జూలై 2025 బుధవారం | రాశి ఫలితాలు- జ్యోతిష్య మార్గదర్శనం

మేషం
దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. స్థిరాస్తి వివాదాలు తీరుతాయి. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి.
వృషభం
ఆర్థిక వ్యవహారాలలో చికాకులు ఎదురవుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ప్రతిబంధకాలు ఎదురవుతాయి. మిత్రులతో దైవదర్శనం చేస్తారు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు జరుగుతాయి. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాల్లో అధికారులతో విభేదాలు ఏర్పడతాయి.
మిధునం
నూతన పనులు ప్రారంభిస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. గతంలో చేసిన శ్రమకు ఫలితం లభిస్తుంది. విలువైన వస్తువులు పొందుతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాల్లో ఆశాజనక పరిస్థితులు ఉంటాయి.
కర్కాటకం
పనుల్లో వ్యయప్రయాసలు అధికంగా ఉంటాయి. బంధువులతో అభిప్రాయ భేదాలు కలుగుతాయి. ప్రయాణాలలో మార్పులు సంభవిస్తాయి. ఇంటి పరిస్థితులు అంతగా అనుకూలించకపోవచ్చు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగ విషయాల్లో అధికారులు సహకరించరు.
సింహం
ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.
కన్యా
వివాదానికి సంబంధించి ప్రముఖుల నుంచి వచ్చిన సమాచారం ఊరట కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు వస్తాయి. నష్టాల నుండి బయటపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాల్లో స్థిరత సాధిస్తారు.
తుల
ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. సన్నిహితులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. పనుల్లో ప్రతిబంధకాలు ఎదురవుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. కుటుంబంతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు కొంత మెరుగుపడతాయి. ఉద్యోగాల్లో ఒత్తిడి తగ్గుతుంది.
వృశ్చికం
సోదరులతో కలహ సూచనలు ఉన్నాయి. కొత్త రుణాలు చేస్తారు. గృహ సంబంధిత నిర్ణయాల్లో మార్పులు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగాల్లో స్థానచలన సూచనలు ఉన్నవి.
ధనుస్సు
కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ప్రయాణాల్లో కొత్త పరిచయాలు కలుగుతాయి. మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగాల్లో అంచనాలు నెరవేరుతాయి.
మకరం
భూవివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమవుతాయి. చేపట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది. ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది. వాహన ప్రయోజనం ఉంటుంది. వ్యాపారాల్లో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ సమస్యలు పరిష్కారమవుతాయి.
కుంభం
ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. మిత్రులతో విభేద సూచనలు ఉన్నవి. కొత్త రుణ ప్రయత్నాలు చేస్తారు. పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. వ్యాపారాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగాల్లో అధికారుల నుండి అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి.
మీనం
వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం ఒత్తిడిగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. కొన్ని పనులు వ్యయంతో కానీ పూర్తవుతాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.
