రాశి ఫలితాలు

28-07-2025 | సోమవారం | రాశి ఫలితాలు

blank

శ్రీ గురుభ్యో నమఃముక్తినూతలపాటి వాసు

మేషం
కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు మారుమూలంగా ఉంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. దైవచింతన పెరుగుతుంది. సన్నిహితులతో స్వల్ప వివాదాలు జరగవచ్చు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు వస్తాయి. ఉద్యోగాలలో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. వృధా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.

వృషభం
అనుకున్న పనులు సమయానికి పూర్తవుతాయి. ఉద్యోగాలలో ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆప్తుల సలహాలు అవసరం. విలువైన వస్తువుల కొనుగోలు సాధ్యమవుతుంది. వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు అందుతాయి.

మిథునం
స్థిరాస్తి వివాదాలు చికాకు కలిగించవచ్చు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. చేపట్టిన పనులు నెమ్మదిగా సాగుతాయి. అధికారులతో చర్చలు సఫలీకృతం కావు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి.

కర్కాటకం
దైవసేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తారు. పేరుగల వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారంలో మెరుగైన ఫలితాలు వస్తాయి.

సింహం
ఇంటా బయట కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఆర్థికంగా ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. పుణ్యక్షేత్ర సందర్శనలు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. వ్యాపార, ఉద్యోగాల్లో శుభవార్తలు వింటారు.

కన్యా
ఆదాయం తగినంత సంతృప్తినిస్తుంది. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు పొందుతారు. మిత్రులతో కలిసి దైవదర్శనానికెళ్తారు. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలలో ప్రత్యర్థులు మిత్రులుగా మారవచ్చు. నూతన వాహన యోగం ఉంది.

తులా
పాత మిత్రుల దర్శనం ఆనందాన్ని కలిగిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. కుటుంబసభ్యులతో కలిసి దైవదర్శనాలు చేస్తారు. రుణబాధలు తొలగిపోతాయి. ఉద్యోగస్తులకు జీతభత్యాల్లో శుభవార్తలు అందుతాయి.

వృశ్చికం
దూరప్రయాణాల్లో వాహన సమస్యలు వస్తాయి. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు జరుగుతాయి. వ్యాపారాలు నిరుత్సాహంగా సాగుతాయి. పనులు నిదానంగా పూర్తవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికంగా కొంత కష్టంగా ఉంటుంది.

ధనుస్సు
ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. శ్రమించిన పనికి తగిన ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు తలెత్తుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ ఒత్తిడి ఎక్కువవుతుంది. ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది.

మకరం
గృహనిర్మాణ విషయాలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుస్తారు. పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

కుంభం
ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తిలో అప్రతీక్ష సంఘటనలు చోటు చేసుకుంటాయి. బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఇబ్బందులను అధిగమిస్తారు.

మీనం
ఆస్తి తగాదాలు చికాకు కలిగిస్తాయి. ముఖ్యమైన విషయాల్లో స్థిరంగా ఆలోచించడం కష్టంగా మారుతుంది. బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. శ్రమించిన పనికి ఫలితం అంతగా కనిపించదు. నిరుద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. దైవచింతన పెరుగుతుంది.

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
రాశి ఫలితాలు

20-06-2025 | శుక్రవారం | రాశి ఫలితాలు – శ్రీ గురుభ్యోనమఃముక్తినూతలపాటి వాసు

మేషంస్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి వ్యాపారాల్లో ఊహించని అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది. నిరుద్యోగుల శ్రమ వృధాగా
blank
రాశి ఫలితాలు

22-06-2025 రాశి ఫలితాలు | ఆదివారం జ్యోతిష్యం

🌿 ముక్తినూతలపాటి వాసు గారు అందించిన దిన ఫలితాలు🙏 శ్రీ గురుభ్యోనమః 🔴 మేషందూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. స్థిరాస్తి లావాదేవీలలో లాభాలు. వాహన వ్యాపారాలు మంచి లాభాలు