12-11-2025 / బుధవారం / రాశి ఫలితాలు 🌞━━━━━━━━━━━━━━━━━━━

♈ మేషం
దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు అధిగమించేందుకు నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు.
━━━━━━━━━━━━━━━━━━━
♉ వృషభం
వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. మానసిక ఆందోళనతో కొంత చికాకు కలుగుతుంది. స్థిరాస్థి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో జాప్యం తప్పదు. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం.
━━━━━━━━━━━━━━━━━━━
♊ మిధునం
ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. సోదరుల సహాయంతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ప్రతిభ వెలుగులోకి వస్తుంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
━━━━━━━━━━━━━━━━━━━
♋ కర్కాటకం
అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండదు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు వాయిదా వేయడం ఉత్తమం. కొందరి ప్రవర్తన వల్ల మానసిక ఆందోళనలు ఎదురవుతాయి. నేత్ర సంబంధిత సమస్యలు బాధించవచ్చు.
━━━━━━━━━━━━━━━━━━━
♌ సింహం
మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అవసరానికి ధన సహాయం లభిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సంతాన వివాహ విషయమై గృహంలో చర్చలు జరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి.
━━━━━━━━━━━━━━━━━━━
♍ కన్య
మీ ఆలోచనలు ఇతరులకు నచ్చకపోవచ్చు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. నూతన రుణ ప్రయత్నాలు కలసి రావు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు సంభవిస్తాయి.
━━━━━━━━━━━━━━━━━━━
♎ తుల
ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. దూరప్రాంత బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు పొందుతారు.
━━━━━━━━━━━━━━━━━━━
♏ వృశ్చికం
వృత్తి వ్యాపారాలలో విశేష లాభం పొందుతారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక ఇబ్బందులు అధిగమించి ముందుకు సాగుతారు.
━━━━━━━━━━━━━━━━━━━
♐ ధనుస్సు
ఇంటా బయట మీ విలువ మరింత పెరుగుతుంది. సమాజంలో ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుతాయి. కొన్ని నిర్ణయాలను ధైర్యంగా తీసుకుంటారు. వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. దైవానుగ్రహంతో కొన్ని పనులు సాఫల్యంగా పూర్తవుతాయి.
━━━━━━━━━━━━━━━━━━━
♑ మకరం
బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలంగా నిలిచిన పనులు సకాలంలో పూర్తవుతాయి.
━━━━━━━━━━━━━━━━━━━
♒ కుంభం
ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. సోదరులతో వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. స్వల్ప అనారోగ్య సమస్యలు కలుగుతాయి. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు తప్పవు.
━━━━━━━━━━━━━━━━━━━
♓ మీనం
సమాజంలో పేరు, ప్రతిష్ఠ పెరుగుతుంది. రుణబాధల నుండి ఉపశమనం పొందుతారు. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. స్త్రీ సంబంధిత ధనలాభ సూచనలు ఉన్నాయి.
━━━━━━━━━━━━━━━━━━━
🍁 శుభం భూయాత్ 🍁
