02-09-2025 • మంగళవారం • రాశి ఫలితాలు

♈ మేషం
ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. దీర్ఘకాలిక ఋణసమస్యల నుండి బయటపడతారు.
వృత్తి–వ్యాపారాల ప్రారంభానికి ఉన్న అవరోధాలు తొలగిపోతాయి.
ఆధ్యాత్మిక కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.
కీలక వ్యవహారాలలో తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తాయి.
నూతన ఉద్యోగయోగం ఉంటుంది.
♉ వృషభం
చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి.
ప్రయాణాలలో కొత్త పరిచయాలు కలుగుతాయి.
సంతానానికి ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి.
దూరప్రాంత బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు వస్తాయి.
ఉద్యోగ సమస్యలను మనోధైర్యంతో అధిగమిస్తారు.
♊ మిధునం
ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి.
స్థిరాస్తి వివాదాలకు పరిష్కార మార్గాలు కనబడతాయి.
కొన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది.
గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.
బంధుమిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది.
గృహంలో కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది.
♋ కర్కాటకం
మిత్రులతో ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి.
స్థిరాస్తి కొనుగోలు యత్నాలు చేస్తారు.
ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి.
దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి.
ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేయకపోవడం మంచిది.
కుటుంబ సభ్యులతో విందు–వినోదాలలో పాల్గొంటారు.
♌ సింహం
బంధుమిత్రులతో గృహంలో ఆనందంగా గడుపుతారు.
నిరుద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి.
భూ సంబంధిత వివాదాలలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు.
కొన్ని వ్యవహారాలలో సోదరుల సహాయం లభిస్తుంది.
వృత్తి ఉద్యోగాలలో కీలక సమాచారం పొందుతారు.
♍ కన్యా
సమాజంలో గౌరవమర్యాదలు పొందుతారు.
బంధుమిత్రుల ఆదరణ పెరుగుతుంది.
చేపట్టిన పనులు కొద్దిగా ఆలస్యమైనా పూర్తవుతాయి.
వ్యాపారాలలో స్వల్ప ధనలాభం ఉంటుంది.
ఉద్యోగ విషయంలో సమయోచిత నిర్ణయాలు లాభం కలిగిస్తాయి.
♎ తుల
ఇంటా–బయటా పరిస్థితులు అనుకూలిస్తాయి.
కుటుంబ సభ్యుల నుండి ధనసహాయం లభిస్తుంది.
దూరప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి.
దూర బంధువుల నుండి శుభవార్తలు వస్తాయి.
ఉద్యోగంలో మీ పనితీరుకు అధికారుల ప్రశంస లభిస్తుంది.
చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి.
♏ వృశ్చికం
నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.
ఆర్థిక స్థితి మరింత బలపడుతుంది.
చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి.
సోదరులతో పాత విషయాలు చర్చిస్తారు.
వృత్తి–వ్యాపారాలలో ఆశించిన లాభాలు వస్తాయి.
ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది.
♐ ధనుస్సు
మిత్రులతో వ్యాపార చర్చలు చేస్తారు.
కుటుంబ సభ్యుల నుండి ధనసహాయం పొందుతారు.
దూరప్రాంత బంధువుల ఆహ్వానాలు అందుతాయి.
కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.
అధికారుల అనుగ్రహంతో కొన్ని పనుల్లో విజయం సాధిస్తారు.
నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
♑ మకరం
వివాదాలను మిత్రుల సహాయంతో రాజీ చేసుకుంటారు.
దైవసేవా కార్యక్రమాలకు హాజరవుతారు.
వ్యాపార పరంగా వచ్చిన కొత్త అవకాశాలను వదులుకోవద్దు.
నూతన వస్తు–వాహన లాభాలు పొందుతారు.
ఉద్యోగంలో స్వంత ఆలోచనలతో ముందుకు సాగడం మంచిది.
♒ కుంభం
వృత్తి–వ్యాపారాలలో కొత్త ప్రోత్సాహకాలు లభిస్తాయి.
ముఖ్యమైన వ్యవహారాలలో ఆకస్మిక విజయం సాధిస్తారు.
శుభకార్యాలకు కుటుంబ సభ్యులతో హాజరవుతారు.
గృహ కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.
అవసరం లేని ప్రయాణాలు చేయవలసి రావచ్చు.
పనుల్లో శారీరక శ్రమ తప్పదు.
♓ మీనం
వివాదాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని సన్నిహితుల నుండి సేకరిస్తారు.
ఆత్మీయుల నుండి ఊహించని ఆహ్వానాలు వస్తాయి.
క్రయ–విక్రయాలు లాభసాటిగా సాగుతాయి.
ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.
వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.
దూరప్రయాణాలు అనుకూలిస్తాయి.
🍁 శుభం భూయాత్ 🍁
